గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం

ABN , First Publish Date - 2023-03-05T22:44:27+05:30 IST

గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న పీఎంపీ వైద్యులకు ఎలాంటి గుర్తింపు లేదని, వారికి మెడికల్‌ బోర్డు ద్వారా శిక్షణ ఇచ్చి విలేజి క్లినిక్‌లలో అవ కాశం కల్పించాలని గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు బీబీటీ రాజు డిమాండ్‌ చేశారు.

గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం
మాట్లాడుతతున్న సంఘ నాయకులువిలేజి క్లినిక్‌లలో అవకాశం కల్పించాలి

ఒంగోలు(కలెక్టరేట్‌), మార్చి, 5 : గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న పీఎంపీ వైద్యులకు ఎలాంటి గుర్తింపు లేదని, వారికి మెడికల్‌ బోర్డు ద్వారా శిక్షణ ఇచ్చి విలేజి క్లినిక్‌లలో అవ కాశం కల్పించాలని గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు బీబీటీ రాజు డిమాండ్‌ చేశారు. కాపు కల్యాణ మం డపంలో ఆదివారం జరిగిన గ్రామీణ వైద్యులు సంక్షేమ సంఘం జిల్లా 8వ మహాసభలో ఆ యన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా పీఎంపీ వైద్యులు వైద్యులు 50వేల మంది వరకు ఉన్నారని తెలిపారు గ్రామీణ వైద్యు లకు అను భవం ఉన్నందున ప్రభుత్వం పరీక్షలు నిర్వ హించి ఉపాధి అవకాశాలు కల్పిం చాలని కో రారు. డాక్టర్‌ కేసీ మాల్యాద్రి మా ట్లాడుతూ నేటికీ గ్రామాల్లో ఆర్‌ ఎంపీల అవసరం ఉందన్నారు. ఇప్పుడున్న పరిస్థితు లలో రోజు రోజుకు వైద్య విధానంలో అనేక మార్పులు వస్తుండడంతో పీఎంపీలకు వైద్యం పై శిక్షణ ఇవ్వాలన్నారు. డాక్టర్‌ ఆదర్శ్‌ మాట్లాడుతూ ఎముల వైద్యంలో అనేక మార్పులు వచ్చా యని తెలిపారు. కార్యక్రమంలో యూ నాగ రాజు, వీ మాలకొండయ్య తదితరులు పా ల్గొన్నారు. ఈ సభలో నూతన కమిటీ జిల్లా అధ్యక్షుడు బట్టు బాలాజీ, ప్రధాన కార్య దర్శి కే బాలచంద్రం, కందుకూరు రాజగోపాల్‌, షేక్‌ ఇమామ్‌ సాహెబ్‌, పీ కృష్ణారావు, దాసరి సుధాకర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-03-05T22:44:27+05:30 IST