గంగమ్మ భక్తులకు విశ్రాంతి గదులు

ABN , First Publish Date - 2023-03-25T22:00:34+05:30 IST

ప్రసిద్ధ గుంటిగంగా భవానీ అమ్మవారిని దర్శించుకునే భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ చైర్మన్‌ కటకంశెట్టి శ్రీనివాసరావు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని దాతల సహకారంతో విశ్రాంతి గదులను నిర్మించడం అభినందనీయమని ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ అన్నారు.

గంగమ్మ భక్తులకు విశ్రాంతి గదులు
తిరునాళ్ల పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే మద్దిశెట్టి

దాతల సాయంతో నిర్మాణం

ప్రారంభించిన ఎమ్మెల్యే మద్దిశెట్టి

తాళ్లూరు, మార్చి 25: ప్రసిద్ధ గుంటిగంగా భవానీ అమ్మవారిని దర్శించుకునే భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ చైర్మన్‌ కటకంశెట్టి శ్రీనివాసరావు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని దాతల సహకారంతో విశ్రాంతి గదులను నిర్మించడం అభినందనీయమని ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ అన్నారు. గుంటిగంగ తిరునాళ్ల ప్రాంగణంలో దాతల సహకారంతో రూ.32లక్షల నిధులు సమకూర్చి నిర్మించిన విశ్రాంతి గదులను ఎమ్మెల్యే మద్దిశెట్టివేణుగోపాల్‌, వైసీపీ ఇన్‌ చార్జి మద్దిశెట్టి రవీంద్ర, ఏఎంసీ మాజీ చైర్మ న్‌ మారం వెంకటరెడ్డి శనివారం ప్రారంభించా రు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గంగమ్మను దర్శించుకునే భక్తుల కష్టాలను గుర్తించిన ఆలయ కమిటీ చైర్మన్‌ శ్రీనివాసరావు దాతల సహకా రంతో నిధులు సమకూర్చి విశ్రాంతి గదులను నిర్మింప చేశారన్నారు. అమ్మవారిని దర్శించుకునే భక్తులు మొక్కులు తీర్చుకునే సమయం లో విశ్రాంతి గదుల్లో సేద తీర్చుకోవచ్చునన్నారు. ఆలయ కమిటీ చైర్మన్‌ శ్రీనివాసరావు మా ట్లాడుతూ విశ్రాంతి గదుల నిర్మాణం చేపడుతున్నామని చెప్పగానే చీమకుర్తికి చెం దిన ఏ ఎంసీ మాజీ చైర్మన్‌ మారం వెంకటరెడ్డి సొం తంగా ఒకగది నిర్మాణ ఖర్చును భరించార న్నారు. ముందుగా గంగమ్మ తల్లిని దర్శించు కున్న ఎమ్మెల్యేకు పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి పూజలు చేశారు. కార్యక్రమంలో ఐ.వేణుగోపాల్‌రెడ్డి, ఎంపీపీ తాటికొం డ శ్రీనివాసరావు, జడ్పీటీసీ సభ్యుడు మారం వెంకటరెడ్డి, వైస్‌ఎంపీపీలు ఐ వెంకటేశ్వరరెడ్డి, ఎంఎన్‌పీ నాగార్జునరెడ్డి,జెసీఎస్‌ కన్వీనర్‌ యాడిక శ్రీనివాసరెడ్డి, కోఆప్సన్‌ సభ్యులు కరిముల్లా, సొసైటీ చైర్మన్లు వలసారెడ్డి, శ్రీనివాసరెడ్డి, సర్పంచ్‌లు కాలేషావలి, చిమ టా సుబ్బరావు, వైసీపీ నేతలు పులి ప్రసాద్‌రెడ్డి, పులి బ్రహ్మారెడ్డి, సుబ్బారెడ్డి, నిశ్శంకం హనుమంతరావు, యలమందారెడ్డి, పోశం శ్రీకాంత్‌రెడ్డి, దేవదానం, గురుబ్రహ్మం, కాశిరెడ్డి దేవదాయశాఖ ఈవో భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. భక్తులను అన్నదానం ఏర్పాటు చేశారు.

తిరునాళ్ల పోస్టర్‌ ఆవిష్కరణ

ఏప్రిల్‌ 6, 7, 8న జరుగనున్న గుంటిగంగ తిరునాళ్ల పోస్టర్‌ను ఎమ్మెల్ల్యే మద్దిశెట్టి ఆవి ష్కరించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో భా స్కర్‌రెడ్డి, లక్కవరం కృష్ణస్వామి, నాగులుప్పలపాడు ఈవో చందోలు సుబ్బారావు, కమిటీ చై ర్మన్‌ కటకంశెట్టి శ్రీనివాసరావు, ఆలయ కమి టీ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-25T22:00:34+05:30 IST