ప్రహసనంగా ఆక్రమణల తొలగింపు..!
ABN , First Publish Date - 2023-04-02T22:14:48+05:30 IST
దర్శి పట్టణంలో ఆక్రమణల తొలగింపు ప్రహసనంగా మారింది. తొలుత శర వేగంతో ఆక్రమణల తొలగించేందుకు సిద్ధమైన అధికారులు ఆ తర్వాత ఒక్కసారిగా చప్ప బడ్డారు.
నిధుల కొరత సాకుతో నిర్లక్ష్యం
అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు
దర్శి, ఏప్రిల్ 2 : దర్శి పట్టణంలో ఆక్రమణల తొలగింపు ప్రహసనంగా మారింది. తొలుత శర వేగంతో ఆక్రమణల తొలగించేందుకు సిద్ధమైన అధికారులు ఆ తర్వాత ఒక్కసారిగా చప్ప బడ్డారు. నిధుల కొరత వలన జాప్యం జరుగు తోందని అధికారులు చెప్తున్నారు. అధికారుల అసంబద్ధ వైఖరి పట్ల ప్రజలు, పాలకవర్గం అ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఆక్ర మణ తొలగింపు కార్యక్రమాన్ని మధ్యలో నిలిపిఏవసి రకరకాల సాకులు చూపుతుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. నిలిపివేయ టానికి లోగుట్టు ఏమై ఉంటుందని ప్రజలు రక రకాలుగా చర్చించుకుంటున్నారు. రెండు నెలల క్రితం దర్శి - కురిచేడు రోడ్డులో తొలుత ఆక్ర మణల తొలగింపు చేపట్టారు. రోడ్డు మార్జిన్‌లో పేదలు వేసుకున్న షెడ్లు, చిరువ్యాపారుల బం డ్లు ఆఘమేఘాల మీద తొలగించారు. అలాగే దర్శి - పొదిలి రోడ్డులో కూడా రోడ్డు మార్జిన్‌లో షెడ్లు, బడ్డీ బంకులను తొలగించారు. ఆ తర్వాత ఏమైందో కాని ఆక్రమణల తొలగింపు ముందుకు సాగలేదు. అధికారులు ఆక్రమణల తొలగింపు నిలిపి వేయ డంతో సర్వత్రా విమర్శలు వచ్చాయి. దీంతో దర్శి - అద్దంకి రోడ్డులో రెండవ విడత ఆక్రమణ తొలగింపు కొంత వరకు చేశారు. ఆ తర్వాత మళ్లీ మధ్యలో నిలిపి వేశారు. గత నెలరోజులుగా ఆక్రమణల తొల గింపును అధికారులు పట్టించుకోలేదు. నిత్యం రద్దీతో ట్రాఫిక్ సమస్య ఎదుర్కొంటున్న దర్శి- లంకో జనపల్లి రోడ్డులో ఆక్రమణల విషయాన్ని పట్టించు కోవడంలేదు. ఆక్రమణల తొలగింపు కార్యక్రమంలో ఎందుకు జాప్యం చేస్తున్నరని ప్రశ్నించిన వారికి నిధుల కొరత అంటూ చెప్తుకొస్తున్నారు. దళలవారీ గా తొలగిస్తామని సర్దుబాటు చేసే ప్రయత్నం చేస్తు న్నారు. తొలగింపుల్లో అధికారులు అవలంబిస్తున్న వైఖరిపై కొద్ది రోజుల క్రితం జరిగిన కౌన్సిల్ సర్వ సభ్య సమావేశంలో పలువురు కౌన్సిలర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అధి కారులు ఆక్రమణలు తొలిగంపును మధ్యలో నిలిపి వేయడానికి వివిధ రకాల సాకులు చెప్ప డానికి బలమైన కారణాలు ఉన్నట్లు ప్రజలు భావిస్తున్నారు.
బడా వ్యాపారుల జోలికి పోని అధికారులు
పేదలు, చిరు వ్యాపారులు వేసుకున్న రే కుల షెడ్లను, బడ్డీ బంకులను తొలగించిన అధికారులు బడా వ్యాపారుల ఆక్రమణల జోలికి వెళ్లకపోవడం విమర్శలకు తావిస్తోంది. పెద్దల ఒత్తిడి కారణంగానే ఆక్రమణల తొల గింపుపై అధికారులు మీనమేషాలు లెక్కిస్తు న్నారని ప్రజలు అంటున్నారు. దీంతో ఆక్రమణలు తొలగించిన కొన్ని ప్రదేశాల్లో కొం దరు మళ్లీ బంకులను ఏర్పాటు చేసుకొని వ్యాపారాలను చేసుకుంటున్నారు. మిగిలిన రో డ్లల్లో ఆక్రమణలను తొలగించకుండా కేవలం రెండు రోడ్లల్లోనే అధికారులు ఉద్దేశపూ ర్వకంగా ఆక్రమణలు తొలిగించి మిగిలిన చోట్ల పట్టించుకోలేదని అందువలనే తాము ఇక్కడ మళ్లీ చిరు వ్యాపారాలు సాగిస్తున్నామని స్పష్టం చే స్తున్నారు. అధికారుల్లో చిత్తఽశుద్ది ఉంటే అన్ని రోడ్లలో ఆక్రమణలు తొలగించాలని లేదా అందరికీ సమన్యాయం పాటించాలని చిరు వ్యాపారులు అంటున్నారు. ప్రజల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుండడంతో పాటు కౌన్సిలర్లు కూడా అధి కారుల తీరుపట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై అధికారులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచిచూడాలి.