రాజధానికి గుర్తింపు చంద్రబాబుతోనే సాధ్యం

ABN , First Publish Date - 2023-02-21T00:35:29+05:30 IST

అమరావతి రాష్ట్ర రాజధాని అని దేశానికి ప్రపంచానికి తెలియాలంటే చంద్రబాబునాయుడు మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు.

రాజధానికి గుర్తింపు చంద్రబాబుతోనే సాధ్యం

పొదిలి రూరల్‌, ఫిబ్రవరి 20 : అమరావతి రాష్ట్ర రాజధాని అని దేశానికి ప్రపంచానికి తెలియాలంటే చంద్రబాబునాయుడు మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని టీ.సల్లూరు గ్రామంలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహించారు. నాలు గు సంవత్సరాలలో జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రాన్ని అదోగతి పాలుజేశాడని విమర్శించారు. రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టలేదన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేతగాక ప్రశ్నిం చిన వారికి ఇబ్బందులకు గురి చేస్తున్నార న్నారు. నిత్యవసరాల విషయంలో మధ్య తరగతి ప్రజల నడ్డి విరిచా డన్నారు. ఉద్యోగ, ఉపాధ్యా యులపై కక్ష సాధింపు దోరణితో వ్యవహరిస్తున్నార న్నారు. కార్యక్రమంలో టీడీ పీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పెద్ద దోర్నాల : గన్నవరం టీడీపీ కార్యాలయంపై వైసీపీ గూండాలు దాడి చేయడం అమానుషమని ఒంగోలు పార్ల మెంటు టీఎన్‌టీయూసీ ప్రధాన కార్యదర్శి ఈదర మల్లయ్య ఆరోపించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరులసమావేశంలో మల్లయ్య మాట్లా డారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే వైసీపీ నాయకులు దాడులకు తెగబడుతున్నార న్నారు. దుండగులు కార్యాలయంపై దాడి చేయడమే గాక పర్నీచర్లు, కంప్యూటర్లు, వాహనాలను ధ్వంసం చేశారన్నారు. పోలీ సులకు సమాచారమిచ్చినా పట్టించుకోక పోవడం దారుణమన్నారు. ఈ సైకో పాలన ఎంతో కాలం కొనసాగదన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని తగిన బుద్ది చెబుతార న్నారు. దాడులకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Updated Date - 2023-02-21T00:35:31+05:30 IST