అసైన్మెంట్‌ భూముల్లో రియల్‌ ఎస్టేట్‌ ప్లాట్లు

ABN , First Publish Date - 2023-09-25T23:29:38+05:30 IST

పేదలుగా ఉన్నప్పుడు జీవనోపాధి కోసం ప్రభు త్వం వారికి భూమిని పం చారు. అయితే ఆ భూమికి సమీపంలో ప్రస్తుతం మెడికల్‌ కళాశాల మంజూరైంది. దీంతో ఆ భూమి విలువ పెరిగింది. దీంతో సాగు కోసం ఇచ్చిన భూమిని వ్యాపార వనరుగా మార్చుకోవడానికి సదరు లబ్ధిదారులు చూశారు. దీనిపై ఫిర్యాదులు అందడంతో జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాసులు పూర్తిస్థాయిలో విచారించారు. కిందిస్థాయి సిబ్బంది నివేదికలు, పూర్వపు రికార్డుల ఆధారంగా సదరు వ్యక్తులకు అసైన్డ్‌ అయిన ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకంటూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు స్థానిక రెవెన్యూ అధికారులు అసైన్మెంట్‌ భూమిలో నోటీస్‌ బోర్డు ఏర్పాటు చేశారు. అయితే అప్పటికే పాట్లు చేసి చదును చేసి ఉండడంతో రాళ్లను తొలగించడానికి అధికారులు యత్నించారు. అక్రమార్కులు అడ్డుకోవడంతో పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేసి రాళ్లను తొలగించారు.

అసైన్మెంట్‌ భూముల్లో రియల్‌ ఎస్టేట్‌ ప్లాట్లు
ఎక్స్‌కవేటర్‌ను అడ్డుకుంటున్న భూ యజమానులు

భూములు రద్దుచేస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు

రాళ్లు తొలగించేందుకు అధికారుల యత్నం

అడ్డుకున్న భూ యజమానులు

పోలీసు బందోబస్తుతో ఎట్టకేలకు తొలగింపు

మార్కాపురం, సెప్లెంబరు 25: పేదలుగా ఉన్నప్పుడు జీవనోపాధి కోసం ప్రభు త్వం వారికి భూమిని పం చారు. అయితే ఆ భూమికి సమీపంలో ప్రస్తుతం మెడికల్‌ కళాశాల మంజూరైంది. దీంతో ఆ భూమి విలువ పెరిగింది. దీంతో సాగు కోసం ఇచ్చిన భూమిని వ్యాపార వనరుగా మార్చుకోవడానికి సదరు లబ్ధిదారులు చూశారు. దీనిపై ఫిర్యాదులు అందడంతో జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాసులు పూర్తిస్థాయిలో విచారించారు. కిందిస్థాయి సిబ్బంది నివేదికలు, పూర్వపు రికార్డుల ఆధారంగా సదరు వ్యక్తులకు అసైన్డ్‌ అయిన ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకంటూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు స్థానిక రెవెన్యూ అధికారులు అసైన్మెంట్‌ భూమిలో నోటీస్‌ బోర్డు ఏర్పాటు చేశారు. అయితే అప్పటికే పాట్లు చేసి చదును చేసి ఉండడంతో రాళ్లను తొలగించడానికి అధికారులు యత్నించారు. అక్రమార్కులు అడ్డుకోవడంతో పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేసి రాళ్లను తొలగించారు.

మెడికల్‌ కళాశాల రావడంతో..

మార్కాపురం మండలం రాయవరం పరిధిలోని సర్వే నెంబర్‌ 158-1లో 4.97 ఎకరాల భూమి పొందుగుల రామ కోటమ్మ పేరున, సర్వే నెంబర్‌ 159-4లో 1 ఎకరా కాగటూరి వీరయ్యకు 159-5లో 1 ఎకరా భూమిని పిన్నబోయిన మల్లికార్జున్‌కు 2005లో ఆన్‌లైన్‌ అయినట్లు రికార్డులున్నాయి. ఈ భూములు వారికి వారసత్వంగా వచ్చాయని రికార్డుల పరంగా తెలుస్తుంది. అంతకు ముందే వీరి పూర్వికులకు అ సైన్డ్‌ చేయడం ద్వారా వీరికి వచ్చినట్లు తెలుస్తోంది. అ యితే ప్రభుత్వ నిబంధన మేరకు పేదలకు ఇచ్చే అసైన్‌మెంట్‌ భూమిలో వ్యవసాయ పనులు మాత్రమే చేయాలి. అందకు విరుద్ధంగా ఇక్కడ ప్లాట్లు వేశారు. ఈ భుములన్నీ రాయవరం వద్ద నిర్మిస్తున్న మెడికల్‌ కళాశాలకు 200 అడుగుల దూరంలో ఉన్నాయి. దీంతో వీటి విలువ పెరిగింది. దీంతో భూ యజమానులు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావించారు. ఆయా భూములను చదును చేసి రియల్‌ ఎస్టేట్‌ ప్లాట్లు వేశారు. దీనిపై జిల్లా అధికారులకు ఫిర్యాదు అందాయి. జిల్లా కలెక్టర్‌ దినే్‌షకుమార్‌ ఆదేశాల మేరకు జేసీ శ్రీనివాసులు పూర్తి స్థాయిలో విచారించారు. అక్కడ అక్రమంగా స్థిరాస్థి వ్యాపారం చేస్తున్నారని నిర్ధారించారు. ఆ భూములను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. ఆయా భూముల్లో ఉన్న ప్లాట్ల హద్దు రాళ్లు, కంచెలను తొలగించాలని ఆదేశించారు. దీంతో డిప్యూటీ తహసీల్దార్‌ పర్విన్‌, ఆర్‌ఐ ఆర్‌.సుబ్బారావులు సోమవారం ఉదయం ఎక్స్‌కవేటర్‌తో రాళ్లు తొలగించేందుకు ఆక్కడకు వెళ్లారు. విషయం తెలుసుకున్న అనుభవదారులు అక్కడకు వచ్చి యంత్రాలను అడ్డుకున్నారు. అడ్డంగా పడుకొని ఎక్స్‌కవేటర్లను కదలనీయలేదు. దీంతో పరిస్థితిని సబ్‌ కలెక్టర్‌ సేతుమాధవన్‌కు వివరించారు. ఆయన ఆదేశాలతో రూరల్‌ ఎస్సై వెంకటేశ్వర్లు నాయక్‌ సిబ్బందితో అక్కడకు వెళ్లి రెవెన్యూ సిబ్బందికి ఎవరూ అడ్డురాకుండా చేశారు. దీంతో ఎట్టకేలకు పాట్ల హద్దురాళ్లను తొలగించేందుకు రెవెన్యూ యం త్రాంగం ఉపక్రమించారు.

Updated Date - 2023-09-25T23:29:38+05:30 IST