రమణీయం రథసప్తమి సంబరం
ABN , First Publish Date - 2023-01-29T01:28:46+05:30 IST
మార్కాపురం పట్టణంలో రథసప్తమి వేడుకలు శనివారం అంగరంగ వైభవంగా భక్తజన రంజకంగా జరిగాయి.
రజత రథంపై సప్తవాహనాలతో భక్తులకు దర్శనం
మార్కాపురం(వన్‌టౌన్), జనవరి 28: మార్కాపురం పట్టణంలో రథసప్తమి వేడుకలు శనివారం అంగరంగ వైభవంగా భక్తజన రంజకంగా జరిగాయి. ‘ఇల వైంకుంఠం ఇదే’ అనేలా లక్ష్మీ చెన్నకేశవస్వామికి సప్తవాహన సేవ నిర్వహించారు. ‘జై చెన్నకేశవ జైజై చెన్నకేశవ’ నామస్మరణల మధ్య మార్కాపురం పట్టణం ఆధ్యాత్మీక శోభతో మురిసిపోయింది. సప్తవాహనాలపై చెన్నుని దర్శించుకున్న భక్తజనం పారవశంలో మునిగి తేలారు. తెల్లవారిజామున 5:30 గంటలకు శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. నాయుడువీధిలో సూర్యుడు ఉదయించ గానే ప్రధానర్చకులు శ్రీపతి అప్పనాచార్యుల ఆధ్వర్యంలో వేదపండితులు సూర్యస్తోత్రం నిర్వహించారు. అనంతరం స్వామి వారు శేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, చంద్రప్రభ వాహనాలపై విహరించారు. వెండి రథంపై శ్రీదేవీ భూదేవీ సమేత చెన్నకేశవుడు నాలుగు మాఢ వీధులలో భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమలలో నిర్వహించిన తీరుగా మార్కాపురంలో చెన్నకేశవ స్వామికి రథసప్తమి నిర్వహించడం విశేషం. ఈ కార్యక్రమంలో పురపాలకశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మార్కాపురం, గిద్దలూరు ఎమ్మెల్యేలు కేపీ నాగార్జునరెడ్డి, అన్నా రాంబాబు, వైసీపీ జిల్లా అధ్యక్షుడు జంకె వెంకటరెడ్డి వాహనసేవలో పాల్గొన్నారు. ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్ పి.కేశవరావు, ఈవో జి.శ్రీనివాసరెడ్డి, రథసప్తమి కమిటీ చైర్మన్ యక్కలి కాశీవిశ్వనాథం, సభ్యులు, ఆలయ సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు.
శాస్ర్తోక్తంగా చక్రస్నానం
స్థానిక శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయంలో రథ సప్తమి పురస్కరించుకొని శ్రీచక్ర స్నానం వేడుకలు శని వారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రధానర్చకులు శ్రీపతి అప్పనాచార్యుల ఆధ్వర్యంలో వేద పండితులు శ్రీ మహావిష్ణువు ప్రధాన ఆయుధమైన సుదర్శన చక్రానికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు పెద్దసంఖ్యలో హాజరై దర్శించుకున్నారు. చెన్నకేశవస్వామి మూలవిరాట్‌ను శోభాయమానంగా అలంకరించారు.
విశేషంగా వాహనసేవ
శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామికి శనివారం సప్తవాహన సేవ నిర్వహించారు. రథసప్తమి సేవా సంఘం కమిటీ ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కేరళ బృందం వాయిద్యాలు, నరసరావుపేట కనకతప్పెట్లు, మార్కాపురం, పెద్దారవీడు భక్తసమాజాల కోలాటం, మహిళల భజన, చిన్నారుల భరతనాట్య ప్రదర్శనలు, తమిళనాడు కళాకారుల వేషాలు ఆకట్టుకున్నాయి. మార్కాపురం పట్టణంలోని నాలుగుమాఢవీధులతో పాటు పలు ప్రాంతాల్లో భక్తులకు అల్పాహారం, భోజన సౌకర్యం కల్పించారు. స్థానిక కూరగాయల మార్కెట్ సమీపంలో పట్టణ పండ్ల అమ్మకందారుల సంఘం అధ్యక్షుడు షేక్ షఫివుల్లా ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. అన్నదాన కార్యక్రమాలను ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి, చైర్మన్ చిర్లంచర్ల బాలమురళీకృష్ణ, ఈఓ జి.శ్రీనివాసరెడ్డి, రథసప్తమి సేవాసంఘం అధ్యక్షులు యక్కలి కాశీవిశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా రథసప్తమి వేడుకలు
కొమరోలు: రథసప్తమి సందర్భంగా స్థానిక శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి దేవస్ధానం ఆధ్వర్యంలో 12 వాహనాల్లో గోవిందుడు శనివారం భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామి దేవస్ధానంలో స్వామివారిని, అమ్మవారిని విశేషంగా అలంకరించారు. స్వామి వారిని దర్శించుకు నేందుకు మండలంలోని భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం నుంచి స్వామి వారు 12 రకాల వాహనాల్లో గ్రామంలో డప్పువాయిద్యాల నడుమ ఉత్సవ కార్యాక్రమాలు నిర్వహించారు. దేవస్ధానం ఆలయ దర్మకర్త దేవర రమేష్ ఉదయం, మధ్యాహ్న భక్తులకు భోజన వసతిని కల్పించారు.
గిద్దలూరు : రథసప్తమి వేడుకలను గిద్దలూరు ప్రాంతంలో ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకున్నా రు. మహిళలు శనివారం తెల్లవారుజామునే నిద్రలేచి తమ ఇళ్ల ముందు రథం ముగ్గులు వేసి రథసప్తమి వేడుకలకు శ్రీకారం చుట్టారు. దేవాలయాలకు వెళ్లిపూజలు నిర్వహించారు. పట్టణంలోని వేంకటేశ్వరస్వామి, అమ్మవారు, సాయిబాబా, ఆంజనేయస్వామి దేవాలయాలమి రథసప్తమి పండుగ సందర్భంగా సామూహిక పారాయణం నిర్వహించారు.
కొమరోలు : రధసప్తమి సందర్భంగా స్థానిక శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యం లో 12 వాహనాల్లో గోవిందుడు కొమరోలు పురవీధుల్లో శనివారం గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో స్వామివారిని, అమ్మ వారిని ప్రత్యేకంగా అలంకరించారు. స్వామివారిని దర్శిం చుకునేందుకు మండలంలోని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామంలో డప్పువాయిద్యాల నడుమ ఉత్సవసేవ నిర్వహించారు. దేవస్ధానం ఆలయ దర్మకర్త దేవర రమేష్ ఉదయం, మద్యాహ్న భక్తులకు భోజన వసతిని కల్పించారు.
గిద్దలూరు : రథసప్తమి వేడుకలను గిద్దలూరు ప్రాంతంలో ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకున్నారు. మహిళలు శనివారం తెల్లవారుజామునే నిద్రలేచి తమ ఇళ్ల ముందు రథం ముగ్గులు వేసి రథసప్తమి వేడుకలకు శ్రీకారం చుట్టారు. దేవాలయాలకు వెళ్లి పూజలు నిర్వహించారు. పట్టణంలోని వేంకటేశ్వరస్వామి, అమ్మవారు, సాయిబాబా, ఆంజనేయస్వామి దేవాలయాలలో రథసప్తమి పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలతోపాటు సామూహిక పారాయణ కార్యక్రమాలు నిర్వహించారు.
ఎర్రగొండపాలెం : రథసప్తమి సందర్భంగా ఎర్రగొండపాలెంలోని దేవాలయాల్లో దేవతా విగ్రహాలకు భక్తులు ప్రత్యేక అలంకరణ చేసి శనివారం పూజలు నిర్వహించారు. ప్రసన్న వెంకటేశ్వరస్వామి మూలవిరాట్ విగ్రహానికి భక్తులు ప్రత్యేక అలంరణ చేసి పూజలు నిర్వహించారు. వేణుగోపాలస్వామి ఆలయం, కొప్పుకొండ వెంకటేశ్వరస్వామి ఆలయాల్లో భర్తులు పూజలు నిర్వహించారు. ఆలయకమిటీ సభ్యులు భక్తలకు తీర్ధప్రసాదములు పంపిణీ చేశారు. నివాస గృహల ముంగిట మహిళలు రథం ముగ్గులు వేసి రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.