మార్కాపురం సబ్‌కలెక్టర్‌గా రాహుల్‌మీనా
ABN , Publish Date - Dec 19 , 2023 | 11:31 PM
మార్కాపురం సబ్ కలెక్టర్‌గా రాహుల్ మీనాను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు.
ఒంగోలు(కలెక్టరేట్), డిసెంబరు 19 : మార్కాపురం సబ్ కలెక్టర్‌గా రాహుల్ మీనాను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. ఐఏఎస్ శిక్షణ పూర్తిచేసుకున్న రాహుల్ పోస్టింగ్ కోసం వెయిటింగ్‌లో ఉన్నారు. మంగళవారం రాత్రి రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలతోపాటు శిక్షణ పూర్తిచేసుకున్న ఐఏఎ్‌సలకు సబ్‌కలెక్టర్లుగా పోస్టింగ్‌లు ఇచ్చారు. ఆ మేరకు రాహుల్‌మీనాను మార్కాపురం సబ్‌కలెక్టర్‌గా నియమించారు. మార్కాపురంలో పనిచేస్తున్న సేతు మాధవన్‌ను బదిలీ చేశారు. ఎంఎ్‌సఎంఈ కార్పొరేషన్ సీఈవోగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.