అక్రమ అరెస్టుపై నిరసన

ABN , First Publish Date - 2023-09-18T01:53:10+05:30 IST

ఓటమి భయంతోనే వైసీపీ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై అక్రమ కేసులు పెట్టించిందని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ముత్తుముల అశోక్‌రెడ్డి ఆరోపించారు.

అక్రమ అరెస్టుపై నిరసన

గిద్దలూరు, సెప్టెంబరు 17 : ఓటమి భయంతోనే వైసీపీ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై అక్రమ కేసులు పెట్టించిందని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ముత్తుముల అశోక్‌రెడ్డి ఆరోపించారు. చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా స్థానిక క్లబ్‌ రోడ్డు రిలే నిరాహార దీక్షలు ఐదో రోజు కొనసాగాయి. కొమరోలు, బేస్తవారపేట మండలాలకు చెందిన టీడీపీ నాయకులు నల్లకుండువా లతో దీక్షలో పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి మాట్లాడుతూ యువతకు ఉపాధి కల్పించలేని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌లో అవినీతి జరిగిందని చంద్రబాబుపై నేరారోపణలు చేయడం దుర్మార్గమన్నారు. దేశానికే టెక్నాలజిని పరిచయం చేసిన వ్యక్తి చంద్రబాబు అని కొనియాడారు. రాజారెడ్డి రాజ్యాంగంలో అరాచక పాలన చేస్తున్న జగన్‌ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపే రోజు దగ్గర పడిందని జోష్యం చెప్పారు. బద్వేలు నియోజకవర్గ టీడీపీ నాయకులు రితీష్‌రెడ్డి శిబిరానికి చేరుకొని ప్రసంగించారు. రిలేదీక్షలో పాల్గొన్న వారిలో కొమరోలు, బేస్తవారపేట మండలాల టీడీపీ అధ్యక్షులు బోనేని వెంకటేశ్వర్లు, సోరెడ్డి మోహన్‌రెడ్డి, టీడీపీ నాయకులు పూనూరు భూపాల్‌రెడ్డి, ముత్తుముల సంజీవరెడ్డి, బిజ్జం తిరుపాల్‌రెడ్డి, దూదేకుల సైదులు, అరుణ్‌కుమార్‌, వీరశేఖర్‌, రవీంద్రనాథ్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ వెంకటరామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

కంభం : కంభం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు నుంచి క్షేమంగా బయటకు రావాలని కోరుతూ కంభం, అర్థవీడు మండలాల క్రైస్తవలు చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కంభం చర్చిలో, అయ్యవారిపల్లె చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నిజాయితీగా ఉంటూ మచ్చలేని చంద్రబాబు నాయుడు అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు త్వరగా బయటకు రావాలని కోరుతూ ఎల్‌.కోట పంచాయతీకి చెందిన తెలుగు యువత ప్రధాన కార్యదర్శి గని వెంకటేశ్వర్లు మార్కాపురంలోని అల్లూరి పోలేరమ్మ గుడిలో 101 కొబ్బరి కాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు.

ఎర్రగొండపాలెం(పుల్లలచెరువు) : మాజీ సీఎం, ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టు ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ అని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవీ.ఆంజనేయులు అన్నారు. ఆదివారం స్థానిక ఆంధ్రా బ్యాంకు కూడలిలో ‘బాబు తోడుగా మేము సైతం’ రీలే దీక్షలు పెద్ధారవీడు మండల టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అంబేడ్కర్‌ రాజ్యాంగం అమలుకావడం లేదని, సీఎం జగన్‌ రాజారెడ్డి రాజ్యంగాన్ని అమలు చేస్తున్నారని అన్నారు. టీడీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి నాయకులను, పశ్నించిన కార్యకర్తలపై దొంగ కేసులు పెట్టి అక్రమంగా జైళ్లకు పంపిస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం రావడం ఖాయమన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ నాయకులకు వడ్డీతో సహా అన్ని చెల్లిస్తామని అన్నారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ గుడూరి ఎరిక్షన్‌బాబు మాట్లాడుతూ స్కీల్‌డెవలంప్‌మెంట్‌ ద్వారా లక్షలాది మందికి శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇస్తే అందులో అవినీతీ జరిగిందని చంద్రబాబును అక్రమంగా జైలుకు పంపడం దారుణమన్నారు. సొంత బాబాయిని చంపిన అవినాశ్‌ రెడ్డిని వదిలేసి ఆ నింద చంద్రబాబుపై మోపి గత ఎన్నికల్లో సానుభూతి పొందారన్నారు. వైసీపీకి కాలం చెల్లిందని ఇక పెట్టె, బెడా సర్దుకొని ఇంటికి పోయే సమయం అసన్నమైందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీమాజీ ఉపాధ్యక్షుడు డాక్టరు మన్నె రవీంద్ర, నియోజకవర్గ పరిశీలకులు వేయిత శ్రీనివాస్‌, టీడీపీ మండలాధ్యక్షుడు మెట్టు శ్రీనివాసరెడ్డి, చేకూరి సుబ్బయ్య, టీడీపీ నియోజకవర్గ నాయకులు గొట్టం శ్రీనివాసరెడ్డి, అంబటి వీరారెడ్డి, వేగినాటి శ్రీను, మంత్రునాయక్‌, దొడ్డా శేషాద్రి, వల్లభనేని కాశయ్య, బట్టు సుధాకర్‌రెడ్డి, నాగేశ్వరరావు, షేక్‌ మహాబూబ్‌, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

త్రిపురాంతకం : రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అక్రమ కేసుల నుండి త్వరగా బయటపడాలని, ప్రసిద్ధ పుణ్యక్షేత్రం త్రిపురాంతకేశ్వరస్వామి, బాలాత్రిపుర సుందరీదేవి అమ్మవార్ల ఆలయాల్లో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మంచౌదరి ఆదివారం ప్రత్యేకపూజలు చేశారు. అనంతరం స్థానిక టీడీపీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. చంద్రబాబునాయుడు త్వరలోనే కడిగిన ముత్యంలా కేసుల నుంచి బయటపడతారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కావాలనే టీడీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తుందన్నారు. చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసుతో జగన్‌రెడ్డి తన రాజకీయ మరణశాసనాన్ని తనే రాసుకున్నాడన్నారు. త్వరలోనే లోకేష్‌ యువగళం పాదయాత్ర పునఃప్రారంభం అవుతుందని అన్నారు. ఈ సందర్బంగా టీడీపీ నాయకులు బ్రహ్మంచౌదరిని టీడీపీ నాయకులు సన్మానించారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు ఎం.వలరాజు, నాయకులు దేవినేని చలమయ్య, జి.సునీల్‌చౌదరి, ఎం.గాలెయ్య, ఎన్‌.రాయుడు, పి.వెంకటేశ్వర్లు, చల్లా వెంకటేశ్వరరెడ్డి, ఎం.అచ్చయ్య, ఐ.ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

టీడీపీలో పలు కుటుంబాల చేరిక

కొనకనమిట్ల : మండలంలోని తువ్వపాడు గ్రామంలో ఆదివారం వైసీపీని వీడి పలువురు మార్కాపురం టీడీపీ ఇన్‌చార్జి కందుల నారాయణరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు అక్రమ అరెస్ట్‌తో వైసీపీ ప్రభుత్వ పాపాలు పండేరోజు దగ్గర పడిందన్నారు. అందుకు వైసీపీ నుండి టీడీపీలోకి 35 కుటుంబాలు చేరడమే అందుకు నిదర్శనమన్నారు. వారికి కండువాలను కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అంబటి చిన్నపెద్దన్న, అంబటి రామయ్య, వేము వెంకట్రావ్‌, వేము రామయ్య, వేము ఏసురత్నం, దాసరి కొండయ్య, దాసరి శివయ్య, దాసరి కొండలరావు, నూతలపాటి రాంబాబు, చెరుకూరి కొండయ్య, అంబటి చినవెలుగొండయ్య, అంబటి పెదపెద్దన్న, చెరుకూరి నాగేశ్వరరావు, చెరుకూరి వెంకటేష్‌, చెరుకూరి నాగేష్‌, నూతలపాటి నాగార్జున, చెరుకూరి శ్రీను, చెరుకూరి పిచ్చయ్య, అంబటి అనిల్‌, చెరుకూరి చినవెంకటేష్‌, చెరుకూరి నవీణ్‌, దాసరి వెంకటేష్‌, దాసరి పెదకొండయ్య, వేము అజిత్‌, దాసరి కొండయ్య, వేము కొండయ్య, దాసరి కోటేష్‌, చెరుకూరి సురేష్‌, దాసరి మాలకొండయ్యల తదితరులు పాల్గొన్నారు. టీడీపీ మండల అధ్యక్షుడు మోరబోయిన బాబురావు వీరిని సమన్వయం చేశారు.

Updated Date - 2023-09-18T01:53:10+05:30 IST