రైల్వే వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు

ABN , First Publish Date - 2023-03-31T00:31:17+05:30 IST

పట్టణంలోని రాచర్ల రైల్వేగేటు వద్ద బ్రిడ్జి నిర్మాణానికి తాజాగా కేంద్రానికి ప్రతిపాదనలు వెళ్లాయి.

రైల్వే వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు

గిద్దలూరు, మార్చి 30 : పట్టణంలోని రాచర్ల రైల్వేగేటు వద్ద బ్రిడ్జి నిర్మాణానికి తాజాగా కేంద్రానికి ప్రతిపాదనలు వెళ్లాయి. బ్రిడ్జి నిర్మిస్తే ఆ ప్రాంతంలో శాశ్వతంగా ట్రాఫిక్‌ సమస్యకు పరిష్కారం లభిస్తుందని, రైల్వేలైన్‌పై బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి మూడు దశాబ్దాలుగా నాయకులు ఇస్తున్న హామీలు నీటిపై రాతలు గానే మారుతున్నాయి. దీంతో రోజురోజుకు రైళ్లు, గూడ్స్‌ల సంఖ్య పెరుగుతోంది. దీంతో తరచూ గేటు వేస్తుండడంతో ట్రాఫిక్‌ సమస్య పెరిగిపోతూనే ఉంది. డబ్లింగ్‌ పనులు పూర్తయితే రైళ్లు, గూడ్స్‌ల సంఖ్య కూడా రెట్టింపై ట్రాఫిక్‌ సమస్య మరింత జఠిలం అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రజల ఆకాంక్ష మేరకు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డి మరోసారి రైల్వేబ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్‌గడ్కరికి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతిపాదనలు పంపితే త్వరితగతిన చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి చెప్పడంతో పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి కేంద్రానికి ప్రతిపాదనలు పంపించారు. ఈ రైల్వే గేటుకు ఆనుకుని అనంతపురం- గిద్దలూరు- గుంటూరు జాతీయ రహదారి ఉంది. ఈ రహదారి వెంబడి గేటు దాటే క్రమంలో తరచూ ట్రాఫిక్‌ నిలుస్తోంది. ప్రస్తుతం ఉన్న రైల్వే గేటు వద్ద కొంత ఎత్తు మేరకు సబ్‌వే నిర్మిస్తే, రూ.13 కోట్ల వ్యయం అవుతుందని, అండర్‌ బ్రిడ్జీ నిర్మిస్తే రూ.30 కోట్ల దాకా నిధులు మంజూరు చేయాలని, ఓవర్‌బ్రిడ్జి నిర్మిస్తే, రూ.150 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని తగు వివరా లలో మూడు రకాల ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభు త్వం నుంచి వెళ్లాయి. త్వరలోనే నిధులు మంజూరవుతాయని ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నా రు. గేట్లు ఉన్న ప్రతిచోట గేట్లను మూసివేసి అండర్‌ బ్రిడ్జి గాని, ఓవర్‌బ్రిడ్జి గాని నిర్మించే పనులను దేశవ్యాప్తంగా అమలుచేసే యో చనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో గిద్దలూరు పట్టణ నడిబొడ్డున ఉన్న రాచర్ల గేటు, పాములపల్లి గేట్ల స్థానంలో త్వరలోనే అండర్‌ బ్రిడ్జి గాని, ఓవర్‌బ్రిడ్జి గాని నిర్మింస్తే ట్రాఫిక్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.

Updated Date - 2023-03-31T00:31:17+05:30 IST