గంగమ్మ ఆలయంలో అర్చక వివాదం
ABN , Publish Date - Dec 23 , 2023 | 11:50 PM
జిల్లాలో ప్రసిద్ధిగాంచిన గుంటిగంగ గంగమ్మ ఆలయంలో అర్చకుల వివాదం చినికిచినికి గాలివానలా మారుతోంది. ఆలయానికి ఇటీవల నిత్య పూజల కోసం బ్రాహ్మణ పూజారిని దేవదాయశాఖ కమిషనర్ నియమించారు. అయితే ఇప్పటివరకు యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి పూజారిగా ఉన్నారు. దేవదాయశాఖ కమిషనర్ ఉత్తర్వుల మేరకు ఆలయ ఈవో పి.కార్తిక్, ఆలయ కమిటీ చైర్మన్ కొసనా గురుబ్రహ్మం గత ఆదివారం బ్రాహ్మణ అర్చకుడితో ఆలయంలో పూజలు చేయించారు.
పట్టించుకోని పోలీ్‌సశాఖ
తాళ్లూరు, డిసెంబరు 23: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన గుంటిగంగ గంగమ్మ ఆలయంలో అర్చకుల వివాదం చినికిచినికి గాలివానలా మారుతోంది. ఆలయానికి ఇటీవల నిత్య పూజల కోసం బ్రాహ్మణ పూజారిని దేవదాయశాఖ కమిషనర్ నియమించారు. అయితే ఇప్పటివరకు యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి పూజారిగా ఉన్నారు. దేవదాయశాఖ కమిషనర్ ఉత్తర్వుల మేరకు ఆలయ ఈవో పి.కార్తిక్, ఆలయ కమిటీ చైర్మన్ కొసనా గురుబ్రహ్మం గత ఆదివారం బ్రాహ్మణ అర్చకుడితో ఆలయంలో పూజలు చేయించారు. దీనిపై ప్రస్తుత పూజారి, ఆయన కుటుంబసభ్యులు అడ్డుచెప్పారు. తాముపూర్వం నుంచి ఆలయంలో అర్చకత్వం చేస్తున్నామని, కొత్త వ్యక్తిని ఆలయంలో పూజలకు అనుమతించేది లేదని చెప్పడంతో వివాదం రేగింది. దీనిపై ఆలయ ఈవో పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక ఎస్సై సిబ్బందితో వెళ్లి ఆలయం వద్ద పరిస్థితిని తెలుసుకున్నారు. దేవాలయం ఎండోమెంట్ పరిధిలో ఉన్నందున ఆశాఖవారి ఉత్తర్వులకు కట్టుబడి ఉండాలని సూచించారు. అయినా ప్రస్తుత పూజారి మాత్రం తాము ఆచారం ప్రకారం పూజలు చేస్తున్నందున మరొకరిని నియమిస్తే ఎలాఅని ప్రశ్నిస్తూ అడ్డుకుంటున్నారు. దీనిపై ఆలయ కమిటీ చైర్మన్ కూడా ఎటూ మాట్లాడలేక మిన్నకుండి పోయారు. ఆలయ అభివృద్ధికి దేవదాయశాఖ కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులను అమలు కాకుండాఅడ్డుకుంటున్న విషయంపై ఫిర్యాదు చేసినా పోలీస్ శాఖ తగు చర్యలు చేపట్టకపోవడాన్ని పలువురు విమర్శిస్తున్నారు.