రాజీ కోసం ఒత్తిళ్లు !
ABN , First Publish Date - 2023-09-23T00:23:20+05:30 IST
సారీ చెప్పటమా.. కుదిరే పనే కాదు...’ తహసీల్దార్‌పై స్వయంగా ప్రభుత్వ కార్యాలయంలోనే విధుల్లో ఉండగా దాడి చేసిన వైసీపీ నేత దుంపా చెంచిరెడ్డి మాట ఇది. ‘నాదేమీ లేదు, నాకు అండగా నిలిచిన రెవెన్యూ, తహసీ ల్దార్స్ అసోసియేషన్ల మాటే నామాట.’ ఇది బాధిత తహ సీల్దార్ లక్ష్మీనారాయణరెడ్డి మాట. దీంతో తన అనుచరు డిని కాపాడుకునే ప్రయత్నంలో ఉన్న సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్‌బాబు ఉద్యోగ సంఘాలపైన, వాటికి నాయకత్వం వహించే ఉద్యోగులపైనా తీవ్రమైన ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది.
అధికార పార్టీదే కాదు ..పోలీసులదీ అదే పంథా ?
ససేమిరా అంటున్న చెంచిరెడ్డి
యూనియన్ నిర్ణయమే అంటున్న తహసీల్దార్
రంగంలోకి దిగిన ఎమ్మెల్యే సుధాకరబాబు
(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)
‘సారీ చెప్పటమా.. కుదిరే పనే కాదు...’ తహసీల్దార్‌పై స్వయంగా ప్రభుత్వ కార్యాలయంలోనే విధుల్లో ఉండగా దాడి చేసిన వైసీపీ నేత దుంపా చెంచిరెడ్డి మాట ఇది. ‘నాదేమీ లేదు, నాకు అండగా నిలిచిన రెవెన్యూ, తహసీ ల్దార్స్ అసోసియేషన్ల మాటే నామాట.’ ఇది బాధిత తహ సీల్దార్ లక్ష్మీనారాయణరెడ్డి మాట. దీంతో తన అనుచరు డిని కాపాడుకునే ప్రయత్నంలో ఉన్న సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్‌బాబు ఉద్యోగ సంఘాలపైన, వాటికి నాయకత్వం వహించే ఉద్యోగులపైనా తీవ్రమైన ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. అంతేకాక ఉన్నత స్థాయిలోని కొంద రి సపోర్టుతో పోలీసుల ద్వారా కూడా ఉద్యోగ సంఘాలపై ఒత్తిడి తెచ్చారు. దీనికితోడు తహసీల్దార్ కార్యాలయంలో ని నలుగురు ఉద్యోగులను ఆగమేఘాలపై బదిలీ చేసిన కలెక్టరు దినేష్‌కుమార్ బాధితుడైన తహసీల్దార్‌ను కూడా బదిలీ చేశారు. దీంతో సంతనూతలపాడు తహసీల్దార్‌పై వైసీపీ నేత చేసిన దాడి వ్యవహారం సరికొత్త మలుపులు తిరిగే అవకాశం కనిపిస్తోంది.
వైసీపీ నేతను రక్షించేందుకే..
ఎస్‌ఎన్‌పాడు తహసీల్దార్ లక్ష్మీనారాయణరెడ్డిపై కా ర్యాలయంలోనే వైసీపీ నేత చెంచిరెడ్డి దాడికి దిగటం దా నిపై రెవెన్యూ సంఘాలు ఆందోళన చేపట్టడం, పోలీసులు సాదాసీదా కేసు నమోదు చేయటం తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంలో చెంచిరెడ్డిని రక్షించేందుకు ఎమ్మెల్యే సు ధాకరబాబు ప్రత్యక్షంగా రంగంలోకి దిగినట్లు కనిపిస్తోం ది. తదనుగుణంగా అమరావతిలో పార్టీ అధిష్టానంలోని పాలకవర్గంలోని ముఖ్య నాయకులను కలవటమే గాక కేసు నుంచి చెంచిరెడ్డిని బయటపడేసేందుకు రెవెన్యూ సంఘాల నేతలపై కూడా తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ని ఎలాంటి విచారణ లేకుండా అరెస్టు చేసి జైలుకి పంపి న పోలీసులు సాక్షాత్తూ ఒక మండల మేజిస్ట్రేట్‌పై దాడి జరిగితే ఇంత వరకు అరెస్టు చేయకపోగా విచారణ పేరు తో కాలక్షేపం చేస్తుండటం అధికారపార్టీ వ్యవహారశైలికి దర్పణం పడుతోంది. మేమంతే అన్నట్లుగా పోలీసుల వ్యవహారశైలి కనిపిస్తోంది. చెంచిరెడ్డిపై మండల మేజి స్ట్రేట్ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం ముందస్తు చర్యలు తీసుకో కుండా శుక్రవారం డీఎస్పీ విచారణ చేయటం విశేషం. ఇటు బాధితుడు, రెవెన్యూ అసోసియేషన్ నాయకుడితో పాటు అటు నిందితుడితో వేర్వేరుగా డీఎస్పీ మాట్లాడారు. పెద్దలు చెప్పారు, డీఎస్పీ చేశారు కానీ అసలేం జరిగింద నేది తెలియాలంటే వారిని విచారిస్తే తెలుస్తుందనుకోవ టం అవివేకమే. విపక్ష నేత చంద్రబాబునాయుడు విష యంలో అరెస్టు చేసి విచారణ చేస్తామని చెప్పిన పో లీసులు ఇక్కడ మండల మేజిస్ట్రేట్ ఇచ్చిన ఫిర్యాదుపై అ లా స్పందించకుండా విచారణ పేరుతో కాలక్షేపం చేయ టం వారి ద్వంద్వ నీతిని తేటతెల్లం చేసింది. ఈ నేపథ్యం లో అసలేం జరుగుతుందనే అంశాన్ని లోతుగా పరిశీలిం చగా చెంచిరెడ్డికి మద్దతుగా ఎమ్మెల్యే సుధాకరబాబు రంగంలోకి వచ్చారు. అమరావతిలో ప్రభుత్వ ప్రత్యేక సల హాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని కలిశారు. పార్టీ రీజనల్ కోఆర్డినేటరు, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డినీ కలి శారు. జిల్లా మంత్రి సురేష్‌తోపాటు ఆ పార్టీలో సీనియర్ నాయకుడు బాలినేనినీ కలిశారు. మీ సమస్య మీరే పరి ష్కరించుకోండని బాలినేని చెప్పగా సజ్జల, విజయసా యిరెడ్డిలు అటు కలెక్టరుకి ఇటు ఎస్పీలకు ఫోన్ చేసినట్లు సమాచారం. వారేం చెప్పారు వీరు ఎలా స్పందించారు అ నే విషయాన్ని పక్కనబెడితే గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలు అనేక అనుమానాలకు తావి స్తున్నాయి. రాజీ ప్రయత్నంలో భాగంగా చెంచిరెడ్డి ద్వారా బాధితుడు లక్ష్మీనారాయణరెడ్డికి సారీ చెప్పించి కేసుని ముగించాలనే ప్రయత్నం జరిగింది. సారీ చెప్పేందుకు చెంచిరెడ్డి ససేమిరా అనటంతో అధికారపార్టీ ముఖ్యంగా ఎమ్మెల్యే సుధాకరబాబు బాధితుడు లక్ష్మీనారాయణరెడ్డిపె ౖనా ఆయనకు మద్దతుగా ఉన్న ఉద్యోగసంఘాలపైనా దాడి ప్రారంభించారు. దీంతో లక్ష్మీనారాయణరెడ్డి నాదేమీ లేదు, మా అసోసియేషన్ నాయకులు ఏది చెబితే అదే తన నిర్ణయమని తేల్చిచెప్పినట్లు తెలిసింది. ఆపై ఎమ్మె ల్యే సుధాకరబాబు నేరుగాను, ఇంకోవైపు ఉన్నతస్థాయి లోని పాలకవర్గ ప్రభువుల ద్వారా ఉద్యోగసంఘాల నా యకులపై వత్తిడి తెచ్చే పనికి శ్రీకారం పలికినట్లు తెలిసి ంది. తహసీల్దార్‌ల సంఘానికి నాయకుడిగా ఉన్న అధికారి ఎస్‌ఎన్‌పాడు నియోజకవర్గ పరిధిలోనే పనిచేస్తున్నా రు. దీంతో మొండిగా ముందుకెళ్తే నాకు చాలా విష యాల్లో మీరు దొరుకుతారు, జాగ్రత్త అంటూ అతనిని హెచ్చరించినట్లు తెలిసింది. సహజంగానే రెవెన్యూ అ సోసియేషన్ నాయకులకు నాయకులతో పరిచయాలు ఉంటాయి. అలాంటి ఒక రెవెన్యూ అసోసియేషన్ నాయ కుడిని కూడా ఇప్పటికీ మేము అధికారంలోనే ఉన్నాం, ఉంటాం మాకు దొరక్కపోరు జాగ్రత్త అంటూ హెచ్చరిక జారీ చేసినట్లు తెలిసింది. ఇటు చెంచిరెడ్డి సారీ చెప్పబో నని తేల్చిచెప్పటం, మా ఉద్యోగ సంఘాలు ఏది చెబితే అది చేస్తానని తహసీల్దార్ చెప్పిన నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నాయకులపై ఈ విధమైన వత్తిడికి అధికారపా ర్టీ దిగటం, అందులో కీలకభూమిక ఎమ్మెల్యే సుధాక ర బాబు పోషిస్తుండటం విశేషం.
తహసీల్దార్‌నూ బదిలీ చేశారు..
ఈ నేపథ్యంలో ఎస్‌ఎన్‌పాడు తహసీల్దార్ కార్యాల యం ప్రక్షాళనకు శ్రీకారం పలికిన కలెక్టరు బాధిత తహ సీల్దార్ లక్ష్మీనారాయణరెడ్డిని కూడా బదిలీ చేశారు. ఈ వి షయం యావత్తు ఉద్యోగవర్గాలను ఆందోళనకు గు రిచేస్తోంది. ఈ సమయంలో తహసీల్దార్‌ను కూడా బదిలీ చేస్తే ఖచ్చితంగా అధికారులు, ఉద్యోగులు మనోధైర్యం కో ల్పోవటం ఖాయమని పలువురు అభిప్రాయపడ్డారు. అం తేగాక దాడిచేసిన వైసీపీ నేత దుంపా చెంచిరెడ్డిని సం తృప్తిపరిచేందుకు కలెక్టరు ద్వారా వైసీపీ ప్రభుత్వం చే సిన ప్రయత్నంలో అదొక భాగంగా కూడా భావించాల్సి వస్తుందని పలువురు ఉద్యోగులు వ్యాఖ్యానించారు. దీంతో ఒక ఎమ్మెల్యే స్వయంగా జోక్యం చేసుకుని చేస్తున్న రాజీ ప్రయత్నాలు, బెదిరింపులు కలెక్టరు చేపట్టిన బదిలీల వ్య వహారంతో ఈ ఘటన మున్ముందు ఏ మలుపు తిరుతుం దనేది ఆసక్తికరంగా మారింది.