Share News

అంగన్‌వాడీల పోస్టుకార్డు ఉద్యమం

ABN , Publish Date - Dec 29 , 2023 | 01:29 AM

కనీస వేతనం అమలు చేయాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి అంగన్‌ వాడిలు పోస్టుకార్డు ద్వారా తమ డిమాండ్లను తెలియ జేశారు.

అంగన్‌వాడీల పోస్టుకార్డు ఉద్యమం

గిద్దలూరు, డిసెంబరు 28 : కనీస వేతనం అమలు చేయాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి అంగన్‌ వాడిలు పోస్టుకార్డు ద్వారా తమ డిమాండ్లను తెలియ జేశారు. 17 రోజులుగా నిరవదిక సమ్మెలో ఉన్న అంగన్‌ వాడీలు సచివాలయం ఎదుట ధర్నా చేసి అక్కడే పోస్టు కార్డులు రాసి పోస్టాఫీస్‌ వద్దకు ర్యాలీగా వెళ్లారు. పోస్టు బాక్స్‌లో కార్డులు వేస్తూ సమ్మెకు మద్దతుగా నినాదాలు చేశారు. రైతుసంఘం ప్రాంతీయ సమన్వయకర్త వి.రామకృష్ణ మాట్లాడుతూ సమస్యను పరిష్కరించ కుండా వైసీపీ ప్రభుత్వం బెదిరింపులకు దిగడం శోచనీ యమన్నారు. ప్రతి కార్మికుడికి, ఉద్యోగికి ఫెన్షన్‌ అనేది హక్కు అన్నారు. కార్యక్రమాలలో అంగన్‌వాడి వర్కర్స్‌ యూనియన్‌ ప్రతినిధులు స్వర్ణ, మున్న, వరలక్ష్మి, రమ ణమ్మ, సీఐటీయూ నాయకులు ఆవులయ్య పాల్గొన్నారు.

పెద్ద దోర్నాల : తమ న్యాయమైన సమస్యలు పరిష్క రించాలని అంగన్‌వాడీలు నిర్వహిస్త్తున్న సమ్మె గురు వారానికి 17వ రోజుకు చేరింది. స్థానిక ఆర్‌టీసీ బస్టాండు వద్ద దోర్నాల, పెద్దారవీడు మండలాలకు చెందిన అంగన్‌వాడీలు రెండు వారాలకు పైగా నిరవధిక సమ్మె నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఉద్యోగభద్రత కల్పించాలని, నెలకు రూ.26 వేల వేతనం చెల్లించాలని, రిటైర్మెంటు కాలం 62ఏళ్లకు పెంచాలన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని ముఖ్యమంత్రికి గుర్తు చేస్తు న్నారు. కార్యక్రమంలో ముంతాజ్‌బేగం, సుబ్బమ్మ, వెంకటలక్ష్మీ, వెంకట రత్నం, తదితరులు పాల్గొన్నారు.

కంభం : తమ న్యాయమైన సమస్యలపై గత 17 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వానికి కొద్దిగైనా చీమకుట్టినట్లు కూడా లేదని, అసలు ముఖ్యమంత్రి జగన్‌కు మహిళలకు గౌరవం ఉందా..? అని ఆవేదన వ్యక్తం చేశారు. కంభం, అర్థవీడు, బేస్తవారపేట మండలాల అంగన్‌వాడీలు కందులాపురం కూడలిలో చేస్తున్న రిలే నిరాహార దీక్ష 17వ రోజుకు చేరింది. వారు మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఓటేసి గెలిపిస్తే ఇప్పటికీ హామీలు నెరవేర్చలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన్ను ఇంటికి పంపడం ఖాయమన్నారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షుడు మహమ్మద్‌ ఇబ్రహీం మాట్లాడుతూ అంగన్‌వాడీలు సమస్యలు సీఎం దృష్టికి పోనివ్వకుండా కొంతమంది దుష్టశక్తులు అడ్డుపడుతున్నారన్నారు. వారి కార్యాలయాలను, ఇళ్లను ముట్టడిస్తామన్నారు. కార్యక్ర మంలో సీఐటీయూ నాయకులు అన్వర్‌భాషా, ఏఐటీయూసీ అధ్యక్షురాలు సరళ, ఉపాధ్యక్షురాలు రాజే శ్వరి, శ్రీదేవి, ఆదిలక్ష్మి, శారద, సుబ్బమ్మ, మాధవి, తిరుపతమ్మ, అంగన్‌వాడిలు పాల్గొన్నారు.

మార్కాపురం వన్‌టౌన్‌ : తమ సమస్యలు పరిష్కరిం చాలని అంగన్‌వాడీలు గత 17 రోజులుగా చేస్తున్న సమ్మె సందర్భంగా గురువారం పోస్టుకార్డులను ముఖ్యమంత్రికి పంపారు. తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్‌ వాడీలు కార్డులపై రాసి పంపారు. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో తమ సమస్యలు పరిష్కరించాలన్నారు. ఎంపీజే నాయకులు సమ్మెకు సంఘీభావం తెలిపారు.

ఎర్రగొండపాలెం : జీతాలు పెంచే వరకు సమ్మె విరమించేదిలేదని ధర్నాలు ఉధృతం చేస్తామని అంగన్వాడీ కార్యకర్తలు పేర్కొన్నారు. ఎర్రగొండపాలెంలో గురువారం ధర్నా శిబిరం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు కబడీ ఆడుతూ నిరసన తెలిపారు. అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు మాట్లాడుతూ 17 రోజులుగా ధర్నా చేస్తున్న ముఖ్యమంత్రి అంగన్వాడీ కార్యకర్తల మీద జాలిలేదని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జీతాలు పెంచుతానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మాటమార్చారని అన్నారు. తమ సమస్యలు పరిష్కరించకుంటే వచ్చేఎన్నికల్లో తమ బలం ఎమిటో తెలియజేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ ఏరియా నాయకులు షేక్‌ అమీర్‌బాష, షేక్‌ రఫీ, అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు జి మల్లేశ్వరి, పి సుబాషిణి, నాగరాజకుమారి, రామసుబ్బమ్మ, అరుణ, సునీత, తలపాటి సుబ్బమ్మ, సుజాత, విజయలక్ష్మి, రూత్‌మేరి, రామకుమారి, తిరుపాలమ్మ, పాల్గొన్నారు.

పొదిలి : సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న నిర్వదిక సమ్మె 17వ రోజుకు చేరింది. సోమవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం ఆవరణలో ఇచ్చిన హామీలు నిలబెట్టాలంటూ నిరసన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీల పరిష్కారం దిశగా వైసీపీ ప్రభుత్వం ముందుకు సాగాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ అమలు చేయడంతో పాటు హామీలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఖాళీపేట్లపై గరిటెలతో మోగిస్తూ నిరసన తెలిపారు. అంగన్వాడీ సభ్యులకు మద్దతుగా యూటీఎఫ్‌, జేవీవీ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Dec 29 , 2023 | 01:29 AM