భక్తిశ్రద్ధలతో పోలేరమ్మ జాతర

ABN , First Publish Date - 2023-03-20T00:25:08+05:30 IST

మార్కాపురం పట్టణ శివార్లలో వెలసిన అల్లూరి పోలేరమ్మ ఆలయంలో ఉగాది ముందు నిర్వహించే ఐదు ఆదివారాల జాతర భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

భక్తిశ్రద్ధలతో పోలేరమ్మ జాతర

మార్కాపురం(వన్‌టౌన్‌), మార్చి 19: మార్కాపురం పట్టణ శివార్లలో వెలసిన అల్లూరి పోలేరమ్మ ఆలయంలో ఉగాది ముందు నిర్వహించే ఐదు ఆదివారాల జాతర భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు పోలేరమ్మ మూలవిరాట్‌ను శోభాయమానంగా అలంకరించి విశేష పూజలు చేశారు. తెల్లవారు జాము న మూడు గంటల నుంచే భక్తులు పోలేరమ్మ దర్శనానికి బారులు తీరారు. పొంగళ్లు వండి నైవేథ్యం సమర్పించారు. నాగుల పుట్టలో పాలుపోసి నాగశిలలకు పూజలు చేశారు. కుంకుమ బండ్లు కట్టి మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తడంతో ఆలయ కమిటీ చైర్మన్‌ బాసని శ్రీనివాసులు, ఈవో ఈదుల చెన్నకేశవరెడ్డి, సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పట్టణ పోలీసులు భక్తులను క్యూలైన్లలో పంపించారు.

కంభం (అర్ధవీడు) : మండలం లోని మాగుటూరు గ్రామంలోని శ్రీ లక్ష్మిపద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి 32వ వార్షికోత్సవ వేడుకలను ఆలయకమిటీ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మిపద్మావతి సమేత వెంకటేశ్వరస్వామి వారికి వేద పడితులు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, హోమాలను నిర్వహించారు. స్వామివారికి గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ గిద్దలూరు ఇన్‌చార్జ్‌ ముత్తుముల అశోక్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కమిటీ వారిచే నిర్వహించిన ఎడ్ల బండ్లపోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు, కార్యాకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-20T00:25:08+05:30 IST