Share News

వైసీపీ పాలనలో గ్రామ స్వరాజ్యానికి తూట్లు

ABN , First Publish Date - 2023-11-19T22:02:29+05:30 IST

జగన్మోహ న్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక గ్రామ స్వరాజ్యా నికి తూట్లు పొడిచారని టీడీపీ, జనసేన నా యకులు ధ్వజమెత్తారు. ఆదివారం మండలం లోని కోటికలపూడి గ్రామం వెళ్లే రోడ్డులో టీడీపీ, జనసేన నాయకులు గుంతల ఆంధ్ర ప్రదేశ్‌కు దారేది పేరుతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ తెలుగుదేశం పార్టీ హయంలో ప్రతి గ్రా మానికి, పట్టణానికి రోడ్లు వేసినట్టు గుర్తు చే శారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రోడ్డు వేసిన పాపాన పోలేదన్నారు. రాష్ట్రంలో రోడ్లు ఎలా ఉన్నాయో వైసీపీ నాయ కులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.

వైసీపీ పాలనలో గ్రామ స్వరాజ్యానికి తూట్లు
అద్దంకి: కోటికలపూడి రోడ్డులో నిరసన వ్యక్తం చేస్తున్న టీడీపీ, జనసేన పార్టీ నాయకులు

టీడీపీ, జనసేన నేతల ధ్వజం

గుంతల రోడ్లపై నిరసన

అద్దంకి టౌన్‌, నవంబరు 19: జగన్మోహ న్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక గ్రామ స్వరాజ్యా నికి తూట్లు పొడిచారని టీడీపీ, జనసేన నా యకులు ధ్వజమెత్తారు. ఆదివారం మండలం లోని కోటికలపూడి గ్రామం వెళ్లే రోడ్డులో టీడీపీ, జనసేన నాయకులు గుంతల ఆంధ్ర ప్రదేశ్‌కు దారేది పేరుతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ తెలుగుదేశం పార్టీ హయంలో ప్రతి గ్రా మానికి, పట్టణానికి రోడ్లు వేసినట్టు గుర్తు చే శారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రోడ్డు వేసిన పాపాన పోలేదన్నారు. రాష్ట్రంలో రోడ్లు ఎలా ఉన్నాయో వైసీపీ నాయ కులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. మాటలు చెప్పడం తప్ప అభివృద్ధి చేయలేదని అన్నారు. అద్దంకి నియోజకవర్గంలో మెజారిటీ రోడ్లు ఇదే పరిస్థితిలో ఉన్నాయ న్నారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.

వైసీపీ పాలనలో రహదారులు అధ్వానం

చింతగుంటపాలెం(పర్చూరు), నవంబరు 19: వైసీపీ ప్రభుత్వ నాలుగు న్నరేళ్ళ పాలనలో రహదారుల పరిస్థితి దయనీయంగా మారిందని టీడీపీ, జనసేన నేతలు పేర్కొ న్నారు. కనీస మరమ్మతులకు కూడా నోచుకోకపోవటంతో ప్రజ లు, వాహనదారులు తీవ్ర ఇక్క ట్లకు గురవుతున్నారని అన్నారు. గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేది కార్యక్రమంలో భాగంగా ఆదివా రం మండలంలోని చింతగుట పాలెం రోడ్లులో నిరసన కార్య క్రమం నిర్వహించారు.. టీడీపీ నాయకుడు విన్నకోట సతీష్‌ ఆఽ ద్వర్యంలో రోడ్డుపై నిరసన వ్య క్తం చేశారు. కార్యక్రమంలో జన సేన నాయకులు గనిపిశెట్టి రాజేష్‌, గ్రంఽధి రాజా, తెలగనేని వెంకటేష్‌, కల వకూరి బసవేశ్వరరావు, విన్నకోట అజేయ్‌, చిమటా గణేష్‌, టీడీపీ మం డల అధ్యక్షుడు షేక్‌ షంషుద్దీన్‌, అగ్నిగుండాల వెంకటకృష్ణారావు, కంచేటి శ్రీహరి, గ్రంధి రమణ, గుమ్మడి చంద్రశేఖర్‌, షేక్‌ బాజి, తమ్ములూరి సు బ్బారావు, చెరుకూరి చింపయ్య, బేతపూడి సురేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-11-19T22:02:34+05:30 IST