నిరుద్యోగులను నిలువునా ముంచిన జగన్‌

ABN , First Publish Date - 2023-04-03T01:20:29+05:30 IST

ఏటా జనవరి 1న జాబ్‌క్యాలెండర్‌ అంటూ ప్రగల్బాలు పలికిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నిరుద్యోగులను నిలువునా ముంచారని టీడీపీ ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ గూడూరి ఎరిక్షన్‌ బాబు విమర్శించారు.

నిరుద్యోగులను నిలువునా ముంచిన జగన్‌

ఎర్రగొండపాలెం, ఏప్రిల్‌ 2: ఏటా జనవరి 1న జాబ్‌క్యాలెండర్‌ అంటూ ప్రగల్బాలు పలికిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నిరుద్యోగులను నిలువునా ముంచారని టీడీపీ ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ గూడూరి ఎరిక్షన్‌ బాబు విమర్శించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆదివారం జరిగిన పార్టీ నాయకుల సమావేశంలో మాట్లాడారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు లేక, రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలు రాక, స్వయం ఉపాధికి ప్రభుత్వం నుంచి సహకారంలేక రాష్ట్రంలో యువత భవిష్యత్‌ ప్రశ్నార్ధకంగా మారిందన్నారు. 2019 నాటికి రాష్ట్రంలో 4.0 ఉన్న నిరుద్యోగశాతం, డిసెంబరు 2022 నాటికి 7.7 శాతం నమోదైందన్నారు. టీడీపీ అధికారంలో 5సంవత్సరాలలో రెండుసార్లు డీఎస్సీ నిర్వహించి 18 వేల ఉపాధ్యాయ పోస్టులు నియమించినట్లు తెలిపారు. నాలుగేళ్లలో ఒక్క డీఎస్సీ అయినా నిర్వహించారా..? అని ప్రశ్నించారు. ఐటీ అభివృద్ధితో 34 వేల ఉద్యోగాలు, నైపుణ్యాభివృద్ధి సంస్థలో 64,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత టీడీపీ ప్రభుత్వానిది అని అన్నారు. సమావేశంలో టీడీపీ మండల అధ్యక్షుడు చేకూరి సుబ్బారావు, పుల్లలచెరువు టీడీపీ అధ్యక్షులు పయ్యావుల ప్రసాదరావు, తోట మహేష్‌, పాలడుగు వెంకటకోటయ్య, కంచర్ల సత్యనారాయణగౌడ్‌, మస్తాన్‌వలి పాల్గొన్నారు.

Updated Date - 2023-04-03T01:20:29+05:30 IST