చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే పీడీ యాక్టు

ABN , First Publish Date - 2023-10-12T00:09:03+05:30 IST

జిల్లాలో ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే పీడీ యా క్టు పెట్టేందుకు వెనుకాడబోమని ఎస్పీ మలికగర్గ్‌ హెచ్చరించారు.

చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే పీడీ యాక్టు

ఎస్పీ మలికగర్గ్‌

ఒంగోలు(క్రైం), అక్టోబరు11: జిల్లాలో ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే పీడీ యా క్టు పెట్టేందుకు వెనుకాడబోమని ఎస్పీ మలికగర్గ్‌ హెచ్చరించారు. బుధవారం ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలోని గెలాక్సీ భవన్‌లో నేర సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ నేరచరిత్ర కలిగిన నిందితులపై ఉన్న కేసులను త్వరితగతిన విచారణ చేసి శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు కట్టడి చేసేందుకు ముందస్తు చ ర్యలు తీసుకోవాలని, అవసరమైయితే పీడీ చట్టం వి నియోగించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలి గిస్తే ఎంతటి వారైన సహించేది లేదని స్పష్టం చేశా రు. చోరీ కేసులను త్వరితగతిన విచారించి బాధి తులకు సత్వర న్యాయం అందేలా చూడాలన్నారు. రాత్రులు గస్తీ ముమ్మరం చేసి దొంగతనాలు జరగ కుండా చూడాలన్నారు. త్రీవరమైన నేరాల విచార ణలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగి ంచి గుడ్‌ ట్రయిల్‌ మానిటిరింగ్‌ ద్యారా కేసుల్లో నిం దితులకు శిక్షలు పడేలా చూడాలని సూచించారు. దసరా పండుగను పురస్కరించుకొని నవరాత్రుల ఉ త్సవాలు జరుగుతున్నాయని, దేవాలయాలు, పుణ్యక్షేత్రాల వద్ద భద్రత ఏర్పాట్లు చేయాలని ఆదే శించారు. సమావేశంలో ఏఎస్పీలు కె.నాగేశ్వరరావు, ఎస్‌వీ.శ్రీధర్‌రావు, డీఎస్పీలు సీఐలు పాల్గొన్నారు.

Updated Date - 2023-10-12T00:09:03+05:30 IST