Share News

పంచాయతీ నిధులు పక్కదారి

ABN , First Publish Date - 2023-10-30T23:15:17+05:30 IST

సంతనూతలపాడు గ్రామ పంచాయతీ నిధులు పక్కదారిపట్టించారని టీడీపీ అనుబంధసంఘం తెలుగునాడు ట్రేడ్‌యూనియన్‌ కౌ న్సిల్‌ మండల అధ్యక్షుడు మందాడి వెంకటేశ్వర్లు ఆరోపించారు. సోమవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో టీడీపీ మండల అధ్యక్షుడు మద్దినేనిహరిబాబు అధ్యక్షతన సమావేశం జరిగింది.

పంచాయతీ నిధులు పక్కదారి
మాట్లాడుతున్న మందాడి వెంకటేశ్వర్లు

రూ.కోటికి పైగా స్వాహా చేసినట్లు ఆరోపణలు

డేటాఎంట్రీ ఆపరేటర్‌ లేకుండానే జీతం డ్రాచేసిన వైనం

సంతనూతలపాడు, అక్టోబరు 30: సంతనూతలపాడు గ్రామ పంచాయతీ నిధులు పక్కదారిపట్టించారని టీడీపీ అనుబంధసంఘం తెలుగునాడు ట్రేడ్‌యూనియన్‌ కౌ న్సిల్‌ మండల అధ్యక్షుడు మందాడి వెంకటేశ్వర్లు ఆరోపించారు. సోమవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో టీడీపీ మండల అధ్యక్షుడు మద్దినేనిహరిబాబు అధ్యక్షతన సమావేశం జరిగింది. సమావేశంలో మందాడి మాట్లాడుతూ సంతనూతలపాడు పంచాయతీ నిధులు 2019 నుంచి 2023 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి జరిపిన లావాదేవీలలో పంచాయతీ అధికారి, స్థానిక వైసీపీ మండల నాయకుడితో కుమ్మక్కై పనులు చేయకుండానే నిధులును గోల్‌మాల్‌ చేశారన్నారు. గ్రామ పంచాయతీ నిధులు, 14, 15 వ ఆర్థిక సంఘం నిధులను అనేక పనులకు మళ్లించి స్వాహాచేశారని ఆరోపించారు. అలాగే ప్రజల వద్ద నుంచి రూ.3కోట్ల 94లక్షలు పన్నుల రూపంలో వసూలుచేశారని, వీటిలో సుమారు రూ.కోటిరూపాయలు అవినీతి చేసినట్లు ఆయన ఆరోపించారు. శ్మశానవాటిక పేరుతో అరకొర పనులు చేసి అవినీతికి పాల్పడ్డారని అన్నారు. అంతేకాకుండా మంగలిపాలెం , ముస్లిం శ్మశానవాటికలు, ఆర్చి కాంపౌండ్‌వాల్‌, భూమి చదునుచేయడం తదితర పనుల పేరుతో అవి చేయకుండానే నిధులను స్వాహాచేసినట్లు వెల్లడించారు. మండలంలో ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు, మరమ్మతుల పేరుతో పంచాయతీ అధికారి, వైసీపీ మండల నాయకుడు కలిసి నిధులను బొక్కేసినట్లు తెలిపారు. చివరకు మురుగునీటి కాలువల వద్ద, వీధుల్లోను ఫాగింగ్‌ చేయకుండానే చేసినట్లు చూపి నిధులను తినేశారన్నారు. దీనిపై ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపడితే నిజాలు బయటపడతాయని లేకుంటే టీడీపీ నాయకులే పూర్తి ఆధారాలతో దోపిడీని బయటపెడతామన్నారు.ఈ సమావేశంలో టీడీపీ నాయకులు పి.నారాయణస్వామి చౌదరి, మాధవి, ఎం.శ్రీను, డి.హరిబాబు, సుందర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-10-30T23:15:17+05:30 IST