తాడేపల్లికి చేరిన పాకల పంచాయితీ
ABN , First Publish Date - 2023-08-30T23:24:43+05:30 IST
వైసీపీ కంచుకోటైన పాకలలో ఇటీవల స ర్పంచ్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఘోర పరాజయంపై ఆపార్టీ ఆత్మ పరిశీలన చేపట్టింది. ఈ విషయంపై బుధవారం తాడేపల్లిలోని కార్యాల యంలో పార్టీ రీజనల్ కోఆర్టినేటర్ విజయసాయిరెడ్డి బుధవారం సమీక్ష ని ర్వహించారు.
సర్పంచ్ ఉప ఎన్నికలో వైసీపీ మద్దతు అభ్యర్థి ఓటమిపై సమీక్ష
హాజరైన వరికూటి, మాదాసి, బత్తుల, గ్రామ నాయకులు
ఓటమికి కారణాన్ని ఒకరిపై ఒకరు నెట్టుకునే ప్రయత్నం
ఆగ్రహం వ్యక్తంచేసిన విజయసాయిరెడ్డి
పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేయాలని హుకుం
సింగరాయకొండ, ఆగస్టు 30 : వైసీపీ కంచుకోటైన పాకలలో ఇటీవల స ర్పంచ్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఘోర పరాజయంపై ఆపార్టీ ఆత్మ పరిశీలన చేపట్టింది. ఈ విషయంపై బుధవారం తాడేపల్లిలోని కార్యాల యంలో పార్టీ రీజనల్ కోఆర్టినేటర్ విజయసాయిరెడ్డి బుధవారం సమీక్ష ని ర్వహించారు. నియోజవర్గ ఇన్‌చార్జి వరికూటి అశోక్‌బాబు, మాజీ ఇన్‌చార్జి మాదాసి వెంకయ్య, వైసీపీ వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బత్తుల అశో క్‌కుమార్‌రెడ్డితోపాటు పాకల పంచాయతీలోని వైసీపీ నాయకులు హా జరయ్యారు. పార్టీ మద్దతుతో నామినేషన్ దాఖలు చేసిన మాజీ కొక్కిలగడ్డ రోశయ్య భార్య స్వాములమ్మ ఎందుకు నామినేషన్ విత్ డ్రా చేసుకున్నారని విజయసాయిరెడ్డి నాయకులకు ప్రశ్నించారు. దీనిపై వారు పలు రకాల స మాధానాలు చెప్పారు. దీంతో ఆయన నేరుగా రోశయ్య కుమారుడికి ఫోన్ చేసి నామినేషన్ ఉపసంహరణకు గల కారణాలు అడిగారు. గత పంచాయతీ ఎన్నికలో రూ.30 లక్షలు ఖర్చుపెట్టి తన తండ్రి సర్పంచ్‌గా గెలిచారని ఆయన తెలిపారు. అనారోగ్య కారణాల వలన ఆయన మృతిచెందడంతో ఉప ఎన్ని కలో వైసీపీ మద్దతుతో సర్పంచ్‌గా తన తల్లి స్వాములమ్మ నామినేషన్ దాఖ లు చేశారని చెప్పారు. ఆ తరువాత గ్రామ వైసీపీ నాయకులు ఎన్నికల ఖ ర్చులు పెట్టుకోవాలని చెప్పారన్నారు. మళ్లీ డబ్బులు ఖర్చుపెట్టేంత ఆర్థిక స్థో మత లేదని నాయకులకు తాను చెప్పగా వారు రెబల్ అభ్యర్థులతో నామి నేషన్ వేయించారని తెలిపారు. నాయకుల నుంచి సంపూర్ణ మద్దతు లభిం చనందునే తన తల్లి నామినేషన్ ఉపసంహరించుకున్నారని విజయ సాయి రెడ్డికి వివరించారు. అనంతరం వైసీపీ రెబల్స్‌గా నామినేషన్ దాఖలు చేసిన గొల్లపోతు గోవర్ధన్, రవిలను ఎందుకు నామినేషన్లు వేశారు? ఎందుకు ఉప సంహరించుకున్నారు? అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. వైసీపీ గ్రామ నా యకుల సూచన మేరకు నామినేషన్లు విత్‌డ్రా చేసుకున్నట్లు వారు తెలిపారు.
ఓటమి చెందిన ప్రసన్నకుమార్‌పై ప్రశ్నల వర్షం
వైసీపీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన కుర్రు ప్రసన్నకుమార్‌పై విజయసాయిరెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. ఒక విలేకరి, టీడీపీ నేతలపై కిడ్నాప్ కేసు ఎందుకు పెట్టావని, వాళ్లు నిన్ను కిడ్నాప్ చేస్తే నీదగ్గర ఫోన్ ఉంచుతారా అని ప్రశ్నించినట్లు తెలిసింది. ఆతరువాత వాళ్లెవ రూ తనను కిడ్నాప్ చేయలేదని ప్రసన్నకుమార్ ఒప్పుకున్నట్లు సమాచారం. నామినేషన్ ఉపసంహరించుకోవడానికి ఏసమయంలో ఎక్కడ ఎవరి కారు ఎ క్కారో, ఎందుకు ఎక్కారో పూర్తి సమాచారం తన దగ్గర ఉందని విజయ సా యి అన్నట్లు తెలిసింది. అనంతరం పాకలలో నీ ఓటమికి కారణమేంటని ప్ర సన్నకుమార్‌ని ప్రశ్నించగా డాక్టర్లు మాదాసి వెంకయ్య, బత్తుల అశోక్ కుమార్‌రెడ్డి సహకరించలేదని ఆయన చెప్పినట్లు తెలిసింది.
నాకు ఎలాంటి సమాచారం లేదు : మాదాసి
పాకలలో సర్పంచ్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనకపోవడంపై నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జి వెంకయ్యను విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. అ భ్యర్థి ఎంపిక విషయంపై తనకు ఎలాంటి సమాచారం లేదని, ప్రచారానికి ర మ్మని ఎవరూ పిలవలేదని ఆయన సమాధానం ఇచ్చారు. అందువలన తాను ప్రచారంలో పాల్గొనలేదని వెంకయ్య తెలిపారు. గత సార్వత్రిక ఎన్నికల్లో త నకు పాకల గ్రామంలో 1,500 పైచిలుకు మెజారిటీ వచ్చిన విషయాన్ని ఆ యన గుర్తు చేశారు. సర్పంచ్ ఉప ఎన్నికలో నాయకులను కలుపుకొని పోకపోవడం, ఎలక్షన్ సక్రమంగా చేయటపోవడంతోనే ఓటమి చెందామని తెలిపారు. దీనిపై విజయసాయిరెడ్డి స్పందిస్తూ పిలవకపోతే పనిచేయాల్సిన బాధ్యత లేదా అని వెంకయ్యను ప్రశ్నించినట్లు సమాచారం.
నాపై దాడి చేయించారనే కోపం గ్రామస్థుల్లో ఉంది : బత్తుల
వైసీపీ వైద్యవిభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బత్తుల అశోక్‌కుమార్‌రెడ్డిని మీ స్వగ్రామైన పాకలలో పార్టీ మద్దతు అభ్యర్థి ఎందుకు ఓడిపోయారు మీ రెందుకు ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు అని విజయసాయిరెడ్డి ప్రశ్నించా రు. గతంలో వరికూటి అశోక్‌బాబు అనుచరుడు తనపై దాడిచేశారని ఆయన తెలిపారు. ఇప్పటి వరకూ అతనిపై పార్టీ ఎటువంటి చర్య తీసుకోలేదన్నారు. తనపై దాడిచేసినందున తన అనుచరగణమంతా పంచాయతీ ఎన్నికలకు దూరంగా ఉన్నదని చెప్పారు. ఈ సందర్భంగా దాడిచేసిన వ్యక్తిపై ఇప్పటి వ రకు చర్యలు ఎందుకు తీసుకోలేదని అశోక్‌బాబుని విజయసాయిరెడ్డి ప్ర శ్నించినట్లు తెలిసింది.
వైసీపీ నాయకులు టీడీపీతో కుమ్మక్కవడం వల్లే
ఓడిపోయాం : వరికూటి
కొందరు వైసీపీ నాయకులు, టీడీపీ నాయకుతో కుమ్మక్కు అవడం వలనే పాకల పంచాయతీ ఉప ఎన్నికలో ఓడిపోయామని వరికూటి అశోక్‌బాబు విజయసాయిరెడ్డికి చెప్పినట్లు తెలుస్తోంది. పోలీసులు కూడా టీడీపీ నాయకులకే సహకరించారని ఆయన ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తన తప్పుంటే క్షమించాలని, పార్టీలో అందరినీ కలుపుకొని పోతానని వరికూటి అన్నట్లు సమాచారం.
పార్టీకి కట్టుబడి పనిచేయాల్సిందే : విజయసాయిరెడ్డి
నాయకులు పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేయాల్సిందేనని, ధిక్కరిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని విజయసాయిరెడ్డి హెచ్చరించారు. వరికూటి, వెంకయ్య, డాక్టర్ అశోక్‌కుమార్‌రెడ్డిలనుద్దేశించి గట్టిగానే మాట్లాడినట్లు తెలుస్తోంది. నాయకుల అనైఖ్యత వలనే పార్టీ దెబ్బతింటుందని వారిని మందలించినట్లు సమాచారం. కలిసికట్టుగా పనిచేయాలని వారికి సూచించినట్లు తెలిసింది. సమావేశంలో వైసీపీ జిల్లా అధ్యక్షడు జంకె వెంకటరెడ్డి, నియోజకవర్గ పరిశీలకుడు పోలుబోయిన రూఫ్‌కుమార్ యాదవ్ పాల్గొన్నారు.