టీడీపీతోనే మహిళలకు ప్రాధాన్యం
ABN , First Publish Date - 2023-08-22T21:44:10+05:30 IST
తెలుగుదేశం పార్టీలోనే మహిళలకు సముచిత స్థానంతో ప్రాధాన్యత లభిస్తుందని తెలుగు మహిళలు పేర్కొన్నారు. 12 రోజులుగా మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జి ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ఆదేశాలతో నగరంలో మహాశక్తి మినీ మేనిఫెస్టోపై ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు.
తెలుగు మహిళల ఇంటింటి ప్రచారం
కనిగిరి, ఆగస్టు 22: తెలుగుదేశం పార్టీలోనే మహిళలకు సముచిత స్థానంతో ప్రాధాన్యత లభిస్తుందని తెలుగు మహిళలు పేర్కొన్నారు. 12 రోజులుగా మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జి ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ఆదేశాలతో నగరంలో మహాశక్తి మినీ మేనిఫెస్టోపై ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా స్థానిక 16వ వార్డులో తెలుగు మహిళలు ఇంటింటికీ తిరుగుతూ మహిళలకు ప్రాధాన్యత కల్పిస్లూ మహాశక్తి మేనిఫెస్టోలోని పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికీ వెళ్లి టీడీపీ అధికారంలోకి వస్తే మహిళలకు ఇచ్చే ప్రాధాన్యత, పథకాలను వివరించారు. ప్రతి ఇంటిలోకి మహిళలకు నెలకు ఏడాదికి రూ.15వేలు చంద్రబాబు అందించడం జరుగుందని వివరించారు. అదేవిధంగా ప్రతి ఇంట్లో చదువుకునే విద్యార్థులందరికీ ఉచితంగా చదివిస్తారన్నారు. ఏడాదికి 3గ్యాస్ సిలిండర్లతో పాటు మహిళల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టనున్నారని వివరించారు. అన్నివర్గాల ప్రజలకు మేలుచేసే టీడీపీని వచ్చే ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిపించుకోవాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలుగు మహిళలు కరణం అరుణ, మాజీ కౌన్సిలర్ షేక్ వాజిదాబేగం, హసీనా, దొరసాని, వెంకటలక్షమ్మ, సమీరా, నీరజ పాల్గొన్నారు.