ఒంగోలు వైపు మళ్లీ వైవీ చూపు!

ABN , First Publish Date - 2023-02-07T00:20:40+05:30 IST

ఒంగోలు లోక్‌సభ స్థానంపై టీటీడీ చైర్మన్‌ వై.వి. సుబ్బారెడ్డి మళ్లీ దృష్టి సారించారా? అన్న ప్రశ్నకు తాజా పరిణామాలను పరిశీలిస్తే అవుననే సమాధానం వస్తోంది. అధికార పార్టీలోని ముఖ్యులతోపాటు కిందిస్థాయి నాయకుల్లో కొద్దిరోజులుగా ఇదే విషయం చర్చనీయాంశం గా మారింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పర్చూరు, నిన్నటికి నిన్న మార్కాపురం, ఎర్రగొండపాలెం నియోజకవర్గాల్లో వైవీ పర్యటనలు, ఆ సందర్భంగా చేసిన ప్రసంగాలు, ఆయన్ను ఉద్దేశించి మిగిలిన నాయకులు చేసిన వ్యాఖ్యానాలను పరిశీలిస్తే వైవీ చూపు ఒంగోలుపై ఉన్నట్లు అర్థమవుతుంది.

ఒంగోలు వైపు  మళ్లీ వైవీ చూపు!
వైవీ సుబ్బారెడ్డి

చేసిన పనులు చెప్పుకుంటూ వెలిగొండపై హామీలు

గతంలో ఎంపీగా బాగా పనిచేశారంటూ

సుబ్బారెడ్డికి మంత్రి సురేష్‌ కితాబు

ఆంధ్రజ్యోతి, ఒంగోలు

ఒంగోలు లోక్‌సభ స్థానంపై టీటీడీ చైర్మన్‌ వై.వి. సుబ్బారెడ్డి మళ్లీ దృష్టి సారించారా? అన్న ప్రశ్నకు తాజా పరిణామాలను పరిశీలిస్తే అవుననే సమాధానం వస్తోంది. అధికార పార్టీలోని ముఖ్యులతోపాటు కిందిస్థాయి నాయకుల్లో కొద్దిరోజులుగా ఇదే విషయం చర్చనీయాంశం గా మారింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పర్చూరు, నిన్నటికి నిన్న మార్కాపురం, ఎర్రగొండపాలెం నియోజకవర్గాల్లో వైవీ పర్యటనలు, ఆ సందర్భంగా చేసిన ప్రసంగాలు, ఆయన్ను ఉద్దేశించి మిగిలిన నాయకులు చేసిన వ్యాఖ్యానాలను పరిశీలిస్తే వైవీ చూపు ఒంగోలుపై ఉన్నట్లు అర్థమవుతుంది. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బావాబామ్మర్దులైన ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఒంగోలు ఎంపీగా మళ్లీ పోటీచేయాలని వైవీ కోరుకోవటం, కుదరదంటే కుదరదని బాలినేని అడ్డంకులు చెప్పడం అందుకు ప్రధాన కారణమైంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బాలినేనిని మంత్రిని చేసిన జగన్‌ వైవీకి టీటీడీ చైర్మన్‌ పదవి ఇచ్చారు. పార్టీ ప్రకాశం జిల్లా బాధ్యతలను బాలినేనికి, గోదావరి జిల్లాల బాధ్యతలను వైవీకి అప్పగించారు. రెండోసారి కూడా వైవీకి టీటీడీ చైర్మన్‌ అవకాశం ఇచ్చిన జగన్‌.. మంత్రివర్గ పునర్విభజనలో బాలినేనిని తప్పించారు. ఆతర్వాత పార్టీపరంగా వైవీకి కీలకమైన విశాఖపట్నం జిల్లా బాధ్యతలను అప్పగించారు. బాలినేనిని ప్రకా శం, బాపట్ల బాధ్యతల నుంచి తప్పించి నెల్లూరు, కడప, తిరుపతి జిల్లాలకు పరిమితం చేశారు.

స్పీడు పెంచిన సుబ్బారెడ్డి

తాజా పరిణామాల నేపథ్యంలో వై.వి. సుబ్బారెడ్డి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కార్యక్రమాల దూకుడు పెంచారు. ప్రత్యేకించి ఒంగోలు లోక్‌సభ వ్యవహారాల్లో ఆయన జోక్యం పెరిగింది. ముందుగా పర్చూరు నియోజకవర్గంలో టీటీడీ కల్యాణమండపం శంకుస్థాపన పేరుతో అడుగుపెట్టిన ఆయన ఆమంచి కృష్ణమోహన్‌ పార్టీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. మర్యాదపూర్వకంగా కూడా బాలినేనిని ఆహ్వానించని ఆ కార్యక్రమంలో వైవీనే ముఖ్య అతిథి. ఆ తర్వాత సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఒంగోలులోనే మకాం వేసిన వైవీ పార్టీ శ్రేణులు కలిసేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. తాజాగా ఆయన ఆదివారం మార్కాపురం, ఎర్రగొండపాలెం నియోజకవర్గాలలో పర్యటించారు. మా ర్కాపురంలో ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి ఇంటికి వైవీ వెళ్లగా అక్కడికి ఆ నియోజకవర్గంలోని చుట్టుపక్కల మండలాలకు చెందిన పార్టీలోని ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు వచ్చి కలిశారు. వారందరితో ఆయన చాలాసేపు సన్నిహితంగా సంభాషించారు.

గుర్రుగా ఉన్న మాగుంట, బాలినేని

ఈ మొత్తం పరిస్థితిని చూస్తే వైవీ వ్యూహాత్మకంగానే ముందడుగు వేస్తున్నారనేది స్పష్టమవుతోంది. జిల్లాలో పార్టీపరమైన బాధ్యతల్లో బాలినేని లేకపోవటం, ఎంపీ మాగుంటపై ఢిల్లీ లిక్కర్‌ స్కాం ఆరోపణలు రావటం ఇత్యాధి కారణాలతో భవిష్యత్తు మనదేనన్న సంకేతాలు ఇచ్చేవిధంగా ఆయన వ్యవహరించారనేది పరిశీలకుల అభిప్రాయం. అయితే ఈ విషయాన్ని ఇటు ఎంపీ మాగుంట, అటు ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని సీరియ్‌సగా తీసుకున్నట్లు తెలిసింది.

Updated Date - 2023-02-07T00:20:42+05:30 IST