టీడీపీ, వామపక్ష నేతలకు నోటీసులు
ABN , First Publish Date - 2023-03-19T23:01:24+05:30 IST
జీవో 1ని రద్దు చేయాలని కోరు తూ సీపీఎం, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు నేడు (సో మవారం) చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. ఈ మేరకు ఆదివారం స్థానిక టీడీపీ, సీపీఎం పార్టీలకు చెం దిన పలువురు నేతలకు ఆ కార్యక్రమానికి వెళ్దొ ద్దంటూ ఆంక్షలు జారీ చేస్తూ నోటీసులు జారీ చే శారు.

చలో అసెంబ్లీకి అనుమతి నిరాకరణ
నాయకుల ముందస్తు అరెస్టు
కనిగిరి, మార్చి 19 : జీవో 1ని రద్దు చేయాలని కోరు తూ సీపీఎం, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు నేడు (సో మవారం) చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. ఈ మేరకు ఆదివారం స్థానిక టీడీపీ, సీపీఎం పార్టీలకు చెం దిన పలువురు నేతలకు ఆ కార్యక్రమానికి వెళ్దొ ద్దంటూ ఆంక్షలు జారీ చేస్తూ నోటీసులు జారీ చే శారు. తెలుగుదేశం పార్టీకి చెందిన రాష్ట్ర ఐటీ డీపీ నాయకులు జం షీర్ అహ్మద్, పార్లమెంట్ కార్యనిర్వాహక కార్య దర్శి, టీడీపీ సీనియర్ నా యకులు వీవీఆర్ మ నోహరరావు (చిరంజీవి)కి నోటీసులు అందచేసి బైండోవర్ కేసులు నమోదు చేశారు. అదే విధంగా సీపీఎం పార్టీకి చెందిన పీసీ కేశవరావు, బడుగు వెంకటేశ్వర్లు ఇంకా ఇత ర నాయ కులకు, కాంగ్రెస్ పార్టీ నేతలకు నోటీసు లు అం దించారు. అనంతరం పార్లమెంట్ కార్య నిర్వా హక కార్యదర్శి తమ్మినేని వెంకటరెడ్డి, టీ డీపీ సీనియర్ నాయకుడు బేరి పుల్లారెడ్డి, మం డల పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు యాదవ్, క న్వీనర్ పిచ్చాల శ్రీనివాసరెడ్డి, టౌన్‌పార్టీ తెలుగు యు వత అధ్యక్షుడు షేక్ ఫిరోజ్, సీపీఐ జిల్లా నా యకులు బాలిరెడ్డి, టౌన్ పార్టీ అధ్యక్షుడు తమ్మి నేని శ్రీనివాసులరెడ్డి తదితరులకు నోటీసులిచ్చి రాత్రి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
స్టేషన్‌లో టీడీపీ నాయకులు
పామూరు : బ్రిటీష్ కాలం నాటి చట్టాలను వైసీపీ జీవో నెంబర్ 1 ద్వారా తీసుకురావడాన్ని నిరసిస్తూ ఆ చట్టాన్ని రద్దు చేయాలని డి మాం డ్ చేస్తూ ప్రతిపక్షాలు చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపు ని చ్చాయి. ఆ కార్యక్రమానికి అనుమతి లేదంటూ పోలీసులు పోలీసులు టీ డీపీ నా యకులకు నోటీసులు అందచేసి ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకు న్నారు. తెలుగు యువత అధ్యక్షుడు ఉప్పలపాటి హరిబాబు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు డోలా శేషాద్రి, పట్టణ ప్రధాన కార్యదర్శి గుత్తి మ హేష్, బీసీ మండల కమిటీ అధ్యక్షుడు మండ్ల రమణయ్యను బైండోవర్ చేశారు. అరెస్టు చేయడం అక్రమమని హరిబాబు విమర్శించారు. పో లీసుల తీరును ఖండించారు. సుందరయ్యభవన్‌లో సీపీఎం మండల కార్యదర్శి కె.మాల్యాద్రి, షేక్ కాశింసాహెబ్, చాంద్‌బాషా, వైవీరనా రాయణ, చల్లా వెంకటేశ్వర్లుతోపాటు మరో ముగ్గరు కార్మిక సంఘ నా యకులకు నోటీసులు అందాయి. సీపీఐ నాయకులు సయ్యద్‌మౌలాలి, వ జ్రాల సుబ్బారావు, పాలపర్తి మస్తాన్ రావు, ఇర్రి వెంకట్‌రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చి బైండోవర్ చేశారు. సమస్యలపై నిరసన తెలియజేసే హక్కును సైతం వైసీపీ పాలకులు కాలరాస్తున్నారని వామపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతి లేదంటూ నోటీసులి వ్వడం సరికాద న్నారు. సోమవారం ఆందోళన కార్యక్రమాలు చేపడతా మని తెలిపారు.