నవరత్నాలు కాదు.. నవ మోసాలు
ABN , Publish Date - Dec 30 , 2023 | 11:51 PM
అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన జగన్‌రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు నవ మోసాలుగా మిగిలాయిని తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు నూకసాని బాలాజీ పేర్కొన్నారు. శనివారం భాగ్యనగర్‌లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మా ట్లాడుతూ జగన్ ప్రజలకు ఇచ్చింది గోరంత, దోచుకున్నది కొండంత అన్నారు.
టీడీపీ ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు నూకసాని
ఒంగోలు (కార్పొరేషన్), డిసెంబరు 30 : అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన జగన్‌రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు నవ మోసాలుగా మిగిలాయిని తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు నూకసాని బాలాజీ పేర్కొన్నారు. శనివారం భాగ్యనగర్‌లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మా ట్లాడుతూ జగన్ ప్రజలకు ఇచ్చింది గోరంత, దోచుకున్నది కొండంత అన్నారు. తన దోపిడీని ఎదుటివారికి అంటగట్టేందుకు అబద్ధాలను పదేపదే చెప్తుండడం జగన్ నె జం అన్నారు. హామీల అమలులో 85 శాతం ఫెయిల్ నే పుస్తకాన్ని ఈ సందర్భంగా ఆయన విష్కరించారు. అలాగే రాష్ట్ర ప్రజలను పథకాల పేరుతో మోసం చేశారని వి మర్శించారు. పెరిగిన ధరలు, జే బ్రాండ్‌ల మద్యం, ఇసుక మాఫియా, మైనింగ్ మా ఫియా, ఆర్టీసీ చార్జీలు, పెంపు, కరెంట్ కోతలతో ప్రజల నెత్తిన భారాలు మోపిన జగన్ ఏ మొహం పెట్టుకుని ఎన్నికల్లో ఓట్లు అడుగుతారని బాలాజీ ప్రశ్నించారు. జగన్ వైఫల్యాలు, హామీలు అమలులో ఫెయిల్ అనే పుస్తకంలో వివరంగా ముద్రించినట్లు ఆయన తెలిపారు.