Share News

వచ్చేనెలలో ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన

ABN , Publish Date - Dec 17 , 2023 | 10:35 PM

బూచేపల్లి వెంకాయమ్మ, సుబ్బారెడ్డి చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో దర్శిలో జనవరి 10, 11 తేదీల్లో జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన పోటీలు నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. దర్శిలోని ఆయన స్వగృహంలో ఆదివారం ఎడ్ల బలప్రదర్శన పోటీల ప్రచార పోస్టర్‌ను జడ్పీ చైర్‌ పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి తదితరులు ఆవిష్కరించారు.

వచ్చేనెలలో ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన
పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌ వెంకాయమ్మ, శివప్రసాద్‌రెడ్డి

దర్శి, డిసెంబరు 17 : బూచేపల్లి వెంకాయమ్మ, సుబ్బారెడ్డి చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో దర్శిలో జనవరి 10, 11 తేదీల్లో జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన పోటీలు నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. దర్శిలోని ఆయన స్వగృహంలో ఆదివారం ఎడ్ల బలప్రదర్శన పోటీల ప్రచార పోస్టర్‌ను జడ్పీ చైర్‌ పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి తదితరులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దర్శిలో తొలిసారిగా జాతీయ స్థాయి పోటీలను భారీ ఎత్తున నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ పోటీలను సీనియర్‌ కేటగిరీ, న్యూ కేటగిరీలో ఎడ్ల బలప్రదర్శన పోటీలు రెండురోజులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సీనియర్‌ కేటగిరీ పోటీల్లో విజేతలకు ప్రథమ బహుమతిగా రూ.2 లక్షలు, ద్వితీయ బహుమతి రూ.1.60 లక్షలు, తృతీయ బహుమతిగా రూ.1.25 లక్షలు, నాల్గవ బహుమతిగా రూ.లక్ష, ఐదవ బహుమతిగా రూ.75వేలు, ఆరవ బ హుమతిగా రూ.50 వేలు, ఏడవ బహుమతిగా రూ.25 వేలు, ఎనిమిదవ బహుమతిగా రూ.20 వేలు, తొమ్మిదవ బహుమతిగా రూ.15వేలు అందజేస్తామన్నారు. న్యూ కేటగిరీలో విజేతలకు ప్రథమ రూ.లక్ష, ద్వితీయ రూ.80 వేలు, తృతీయ రూ.70వేలు, నాల్గవ రూ.60వేలు, ఐదవదిగా రూ.50 వేలు, ఆరవదిడరూ.40వేలు, ఏడవ స్థానానికి రూ.30వేలు, ఎనిమిదవది రూ.20వేలు, తొమ్మిదవ బహుమతిగా రూ.15 వేలు అందుతుందన్నారు. అదేవిధంగా పోటీల్లో పాల్గొన్న ప్రతి జట్టుకు కన్సొలేషన్‌ బ హుమతిగా రూ.7వేలు ఇస్తారన్నారు. ఈ పోటీల్లో అధికజట్లు పాల్గొని కార్యక్రమా న్ని విజయవంతం చేయాలని కోరారు. క్రిస్మస్‌ వేడుకలను పురస్కరించుకొని ఈ నెల 21వ తేదీన నియోజకవర్గంలోని పాస్టర్లకు వస్త్రాలను పంపిణీ చేస్తున్నట్లు శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. దర్శిలోని మా స్వగృహంలో సెమీ క్రిస్మస్‌ వేడుకలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. క్రిస్టియన్‌లు, అభిమానులు పాల్గొనాలని కోరారు. కార్యక్రమం లో రాష్ట్ర షేక్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌ఎం బాషా, మాజీ ఎంపీపీలు వీరగం ధం కోటయ్య, ఇద్దడి దేవదానం, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Dec 17 , 2023 | 10:36 PM