పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యాన్ని సహించం

ABN , First Publish Date - 2023-03-25T22:06:44+05:30 IST

గ్రామాల్లో పారిశుధ్య నిర్వక్షణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని జిల్లా పంచాయతీ అధికారి జీవీ నారా యణరెడ్డి అన్నారు. ఆయన శనివారం మండలంలోని ఈదర, పూరిమెట్ల, మా రెళ్ల గ్రా మాలను సందర్శించారు.

పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యాన్ని సహించం

జిల్లా పంచాయతీ అధికారి నారాయణరెడ్డి

ముండ్లమూరు, మార్చి 25 : గ్రామాల్లో పారిశుధ్య నిర్వక్షణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని జిల్లా పంచాయతీ అధికారి జీవీ నారా యణరెడ్డి అన్నారు. ఆయన శనివారం మండలంలోని ఈదర, పూరిమెట్ల, మా రెళ్ల గ్రా మాలను సందర్శించారు. ముందుగా ఎస్‌డబ్ల్యూపీసీ షెడ్లను సంద ర్శించారు. ఈ సందర్భంగా క్రాప్‌ మిత్రలు సేకరించిన చెత్తను ఎస్‌డబ్ల్యూపీసీ ఒడ్డుకు చేర్చాలని, అక్కడ రెండో విడతగా తడి, పొడి, హానికార చెత్తగా వేరు చేసి తడి చెత్తలో వర్మీ కంపోస్టు తయారు చేయాలని, పొడి చెత్తను శుద్ధి చేసి అమ్మా లని ఆదేశించారు. గ్రామాల్లో ఇంటి పన్ను వసూలు చేయాల న్నారు. పూరి మెట్ల, మారెళ్లలో ఎస్‌ డబ్ల్యూపీసీ షెడ్‌ నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహ రిం చిన ఇరువురు పం చాయతీ కార్యద ర్శులకు చార్జ్‌ మెమోలు జారీ చేశారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని తాగు నీటి ఎద్దడి సమస్య లేకుండా చూడాలన్నారు. ఆయన వెంట ఈ వోఆర్‌డీ ఓబులేసు, సర్పంచ్‌లు పద్మావతి, ఒగులూరి రా మాంజీ, పంచాయతీ కార్యద ర్శులు జే శ్రీనివాసరావు, రాధాకృష్ణ, సుబ్బారెడ్డి, అంజిరెడ్డి, ఇరుగుల కొండారెడ్డి ఉన్నారు.

Updated Date - 2023-03-25T22:06:44+05:30 IST