కురిచేడులో కలుషిత నీటి సరఫరా ఎంపీడీవో ఆగ్రహం

ABN , First Publish Date - 2023-01-25T23:02:37+05:30 IST

కురిచేడులో పంచాయతీ తరఫున సరఫరా చేస్తున్న మంచినీరు కలుషితమై దుర్వాసన వస్తు న్న విషయం మండల పరిషత్‌ సర్వ సభ్య సమావేశంలో కోఆప్షన్‌ సభ్యులు సయ్యద్‌ ఖాసిం ఫిర్యాదు చేశారు.

కురిచేడులో కలుషిత నీటి సరఫరా ఎంపీడీవో ఆగ్రహం
వ్యర్థాలతో దుర్గంధం వెదజల్లుతున్న మంచినీటి బావి

కురిచేడు, జనవరి 25 : కురిచేడులో పంచాయతీ తరఫున సరఫరా చేస్తున్న మంచినీరు కలుషితమై దుర్వాసన వస్తు న్న విషయం మండల పరిషత్‌ సర్వ సభ్య సమావేశంలో కోఆప్షన్‌ సభ్యులు సయ్యద్‌ ఖాసిం ఫిర్యాదు చేశారు. ప్ర జలు ఆ నీటిని వినియోగించలేని దుర్వాసన వస్తున్నదని ఆయన తెలిపారు. ఎం పీడీవో భవ్య బుధవారం పంచాయతీ బావిని పరిశీలించగా వ్యర్థాలు ఉండి దుర్వాసన వస్తుండడం, పరిసరాలు కూడా అపరిశుభ్రంగా ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దుర్వాసన కూడిన నీటిని సరఫరా చేస్తే ఊరుకోబోనని పంచాయతీ సిబ్బందిని హెచ్చరించారు. వెంటనే నీటి సరఫరా ఆపి బావిని శుభ్రం చేయించాలని సూచించారు. బావిలో నీరు మొత్తం బయటకు తోడించి కొత్త నీటిలో బ్లీచింగ్‌ చల్లి తరువాత ప్రజలకు నీటిని సరఫరా చేయాలని చెప్పారు. ప్రజల నుంచి ఫిర్యాదులు రాకుండా చూడాలన్నారు. మండల కోఆప్షన్‌ సభ్యులు సయ్యద్‌ ఖాశిం ఉన్నారు.

Updated Date - 2023-01-25T23:02:39+05:30 IST