వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి కోసం ఉద్యమబాట
ABN , First Publish Date - 2023-01-01T03:06:51+05:30 IST
వెలిగొండ ప్రాజెక్ట్‌ను త్వరిత గతిన పూర్తిచేయాలని డి మాండ్ చేస్తూ, త్వరలో ఉద్యమాన్ని చేపట్టను న్నట్లు మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పిలుపునిచ్చారు.
మార్కాపురం, డిసెంబరు 31: వెలిగొండ ప్రాజెక్ట్‌ను త్వరిత గతిన పూర్తిచేయాలని డి మాండ్ చేస్తూ, త్వరలో ఉద్యమాన్ని చేపట్టను న్నట్లు మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక ఎన్‌జీవో అసోసియేషన్ సమావేశం మందిరంలో శనివారం వెలుగొండ ప్రాజెక్ట్ నిర్వాసితుల సమస్యలపై అఖిల పక్షాలతో సీపీఎం నాయకులు గాలి వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహిం చారు. మాజీఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్ట్ నిర్వాసితుల కు న్యాయం చేయడం కోసం టీడీపీ తరపున ఫిబ్రవరి 1 నుంచి పోరుబాట నిర్వహించనున్న ట్లు తెలిపారు. విపక్షాలు ఇచ్చే వినతిపత్రాలతో ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. నిర్వాసితు లకు ప్రభుత్వం ప్రకటించిన రూ.12.60 లక్షల నష్ట పరిహారం హేతుబద్ధంకాదన్నారు. పరిహారాన్ని పెంచేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. సీపీఐ నాయ కులు అందె నాసరయ్య, సీపీఎం నాయ కులు డి.సోమయ్య, డీకెఎం రఫీ, జనసేన నాయకులు వీరయ్య, షేక్ సాదిక్ తది తరులు పాల్గొన్న సమావేశంలో నిర్వాసితు ల ఎంపిక తుది గడువును 2023 ఏప్రిల్ వరకూ పొడిగించాలన్నారు. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కోసం రూ.1400 కోట్ల నిధులు 2023 మార్చిలోపు విడుదల చేయాలని, వెలుగొండ ప్రాజెక్ట్ కోసం భూము లు ఇచ్చిన రైతులకు ఎకరాకు రూ.5 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలని తీర్మానించారు.