ఎమ్మెల్సీ విజయం.. నియంత పాలనకు అంతం
ABN , First Publish Date - 2023-03-05T22:41:05+05:30 IST
తూర్పు రాయలసీమ పట్టభద్రుల టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్‌ను గెలిపించ డం ద్వారా నియంత పాలనకు స్వస్తి పలకాలని టీ డీపీ నాయకులు పిలుపునిచ్చారు. కొండపిలోని కామేపల్లి రోడ్డులోని ప్రైవేటు కల్యాణ మండపంలో ఆదివారం జరిగిన కొండపి నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొని మాట్లాడారు.
టీడీపీ నేతల పిలుపు
కొండపి, మార్చి5: తూర్పు రాయలసీమ పట్టభద్రుల టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్‌ను గెలిపించ డం ద్వారా నియంత పాలనకు స్వస్తి పలకాలని టీ డీపీ నాయకులు పిలుపునిచ్చారు. కొండపిలోని కామేపల్లి రోడ్డులోని ప్రైవేటు కల్యాణ మండపంలో ఆదివారం జరిగిన కొండపి నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొని మాట్లాడారు. సభాధ్యక్షుడు కొండపి ఎమ్మెల్యే డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతున్నదని, రాబోయే ఎన్నికల్లో టీడీపీని గెలిపించుకుని చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఒంగోలు పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు నూకసాని బాలాజీ మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాలకు టీడీపీ ప్రభుత్వంలోనే న్యాయం జరిగిందన్నారు. టీడీపీ కనిగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి ఉగ్రనరసింహారెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలు నిస్తేజంగా ఉండొద్దని, నిత్యం ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేయాలని సూచించారు. ఈసందర్భంగా కార్యకర్తలు స్వామిని మూడోసారి గెలిపించి మంత్రిగా చూస్తామని నినదించగా, మీరు స్వామిని మంత్రిని చేసుకుంటారో, డిప్యూటీ సీఎంని చేసుకుంటారో మీ ఇష్టమన్నారు. మంచివ్యక్తి స్వామి మంత్రి అయితే తనకు కూడా చాలా సంతోషమన్నారు. తాను మాత్రం కచ్చితంగా ఈసారి గెలుస్తానని, మీరు నిర్భయంగా పందేలు వేసుకోవచ్చన్నారు. మీ డబ్బులు పోతే నేనే చెల్లిస్తానని ఉగ్ర కార్యకర్తలను ఉత్తేజ పరిచారు. నెల్లూరు జిల్లా కందుకూరు టీడీపీ ఇన్‌చార్జి ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం టీడీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నదని, రాబోయే ఎన్నికల్లో టీడీపీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవని, కనీసం టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన నిరుద్యోగ బృతిని కూడా తీసేసిందని అన్నారు. కొండపి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు మన్నవ మోహనకృష్ణ మాట్లాడుతూ ఈప్రభుత్వంలో అభివృద్ధి నిల్, అప్పులు ఫుల్ అని విమర్శించారు. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ పట్టభద్రులకు ఓటు వేసే విధానాన్ని వివరించాలన్నారు. దామచర్ల సత్యనారాయణ మాట్లాడుతూ కార్యకర్తలకు అండగా తమ కుటుంబం ఎల్లపుడూ ఉంటుందన్నారు. ఈసందర్భంగా పార్టీని జెండాను నాయకులు ఆవిష్కరించారు. దివంగత ఎన్టీఆర్, దామచర్ల ఆంజనేయులు విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈమధ్య కాలంలో నియోజకవర్గంలో మరణించిన టీడీపీ నాయకులకు సభలో సంతాపం తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ ఒంగోలు పార్లమెంటు ఉపాధ్యక్షుడు గొర్రెపాటి రామయ్య చౌదరి, టీడీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు సన్నెబోయిన శ్రీనివాసులు, టీడీపీ ఎస్సీ సెల్ జిల్లా నాయకుడు బ్రహ్మానందం, టీడీపీ సీనియర్ నాయకులు బెజవాడ వెంకటేశ్వర్లు, కామని విజయకుమార్, ఎర్రమోతు శ్రీనివాసులు, పోటు శ్రీనివాసమురళి, మాజీ ఎంపీపీ చదలవాడ చంద్రశేఖర్ మాట్లాడారు. సమావేశంలో టీడీపీ ఆరు మండలాల అధ్యక్షులు బొడ్డపాటి యల్లమంద నాయుడు, వేల్పుల శింగయ్య, నరసారెడ్డి, పోకూరి రవీంద్రబాబు, అనుమోలు సాంబశివరావు, టీడీపీ మాజీ జడ్పీటీసీ సభ్యురాలు గాలి పద్మావతి, మాజీ ఎంపీపీ దేపూరి రత్తమ్మ, టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బత్తుల నారాయణస్వామి, టీడీపీ నాయకులు రావిపాటి మధుసూదనరావు, చాగంరెడ్డి నరసారెడ్డి, తిప్పారెడ్డి కృష్ణారెడ్డి, తెలుగు మహిళా నాయకురాళ్లు రావిపాటి సీతమ్మ, మంగపాటి ప్రశాంతి, పేముల విజయనిర్మల, బొద్దులూరి లక్ష్మీప్రసన్న, ఎన్‌ఆర్‌కే యూత్ అధ్యక్షుడు నేతి రవికుమార్, కొణిజేడు టీడీపీ నాయకుడు దావులూరి వేణుగోపాల్, వడ్డెళ్ల మాధవ, మొలకలపల్లి రాధాకృష్ణ, దివి శివచైత న్య, బెల్లం రామకృష్ణ, అబ్బూరి అభిషేక్, గడ్డం పృధ్వి, మద్దినేని వినోద్ పాల్గొన్నారు.