నేడు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
ABN , First Publish Date - 2023-03-12T23:51:50+05:30 IST
తూర్పు రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల పోలింగ్ సోమవారం జరగనుంది. అందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. రెండు స్థానాలకు కలిపి జిల్లాలో మొత్తం 87,997 మంది ఓటర్లు ఉండగా వారికోసం 138 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో 82,208 మంది పట్టభద్రుల ఓటర్ల కోసం 98.. 5,789 మంది ఉపాధ్యాయ ఓటర్ల కోసం 40 కేంద్రాలు ఉన్నాయి. ఒంగోలులో అత్యధిక సంఖ్యలో ఓటర్లు ఉండగా ఆ స్థాయిలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పట్టభద్రుల స్థానానికి 22 మంది, ఉపాధ్యాయ స్థానానికి 8 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
కేంద్రాలకు చేరిన సిబ్బంది, సామగ్రి
ఉదయం 8నుంచి 4 వరకూ ఓటింగ్
భారీ బందోబస్తు
ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, జేసీ, ఎస్పీ
పట్టభద్రుల స్థానానికి 22 మంది,
ఉపాధ్యాయ స్థానానికి ఎనిమిది మంది అభ్యర్థులు
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. తూర్పురాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయ స్థానాలకు మరికొద్ది గంటల్లో ఓటింగ్ మొదలుకానుంది. అందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. సిబ్బంది సామగ్రితోపాటు వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు ఆదివారం సాయంత్రమే చేరుకున్నారు. సోమవారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభంకానుంది. అధికారులు, సచివాలయ ఉద్యోగులు, పోలీసు సిబ్బంది కలిపి సుమారు 2,500 మంది సేవలను వినియోగించుకుంటున్నారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఆయా ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని నియమించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.
ఒంగోలు, మార్చి 12 (ఆంధ్రజ్యోతి) : తూర్పు రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల పోలింగ్ సోమవారం జరగనుంది. అందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. రెండు స్థానాలకు కలిపి జిల్లాలో మొత్తం 87,997 మంది ఓటర్లు ఉండగా వారికోసం 138 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో 82,208 మంది పట్టభద్రుల ఓటర్ల కోసం 98.. 5,789 మంది ఉపాధ్యాయ ఓటర్ల కోసం 40 కేంద్రాలు ఉన్నాయి. ఒంగోలులో అత్యధిక సంఖ్యలో ఓటర్లు ఉండగా ఆ స్థాయిలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పట్టభద్రుల స్థానానికి 22 మంది, ఉపాధ్యాయ స్థానానికి 8 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ ఎన్నికలు బ్యాలెట్ ద్వారా నిర్వహిస్తుండగా అవసరమైన పత్రాలు, బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేసిన అధికారులు వాటితోపాటు సిబ్బందిని ఆదివారం సాయంత్రానికి ఆయా పోలింగ్ కేంద్రాలకు చేర్చారు. ఒంగోలు, మార్కాపురం, కనిగిరి డివిజన్ కేంద్రాలలో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి పోలింగ్ సిబ్బందికి మెటీరియల్‌ను అందించారు. మధ్యాహ్నం తర్వాత పోలీసు బందోబస్తుతో పంపారు. ఒంగోలు, మార్కాపురంలో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను కలెక్టర్ దినే్‌షకుమార్, కనిగిరి కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ సందర్శించి పలు సూచనలు చేశారు. పోలింగ్ అధికారులుగా గజిటెడ్ హోదా కలిగిన వారిని, ఏపీవోలుగా సూపరింటెండెంట్ స్థాయి అధికారులను నియమించారు. ఇతర సిబ్బందిగా సచివాలయ ఉద్యోగులను నియమించారు. అలా మొత్తం 950 మంది సేవలను వినియోగించుకుంటున్నారు. పోలింగ్ సోమవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ కొనసాగుతుంది. అనంతరం ఆయా కేంద్రాల నుంచి బ్యాలెట్ బాక్సులను డివిజన్ కేంద్రాలకు చేర్చి అక్కడి నుంచి ప్రత్యేక రక్షణతో చిత్తూరుకు తరలించనున్నారు.
భారీ బందోబస్తు
మొత్తం 138 పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మకంగా సుమారు 80 కేంద్రాలను గుర్తించిన అధికారులు ఆయా ప్రాంతాల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. అదనపు బందోబస్తును ఏర్పాటు చేశారు. మొత్తం 1500 మంది వివిధ స్థాయి పోలీసు అధికారులు, సిబ్బంది ఎన్నికల విధులు నిర్వర్తించనున్నారు. కీలకమైన పోలీసు అధికారులతో ఎస్పీ మలికగర్గ్ ఆదివారం ఒంగోలులో ప్రత్యేక సమీక్ష నిర్వహించి తగుసూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఓటర్లకు స్లిప్పులు పంపిణీ చేశామని అధికారులు చెప్తున్నప్పటికీ చాలా ప్రాంతాల్లో అవి సక్రమంగా అదడం లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో పోలింగ్ కేంద్రాలకు సమీపంలో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశామని, అక్కడ తీసుకోవాలని అదికారులు సూచించారు. ఈ ఎన్నికలలో ఓటర్లంతా విద్యావంతులు కాగా అత్యధికులు పొరుగు ప్రాంతాల్లో ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇతర వృత్తులలో ఉన్నారు. అలాంటి వారిలో ఎక్కువ మంది ఓటు హక్కు వినియోగించుకొనేందుకు సొంత ప్రాంతాలకు వస్తున్నారు.