రాజేశ్వరిని అభినందిస్తున్న ఎమ్మెల్యే బాలినేని

ABN , First Publish Date - 2023-05-25T23:36:52+05:30 IST

దక్షిణ కొరియాలో జరిగిన ఏషియా పసిఫిక్‌ మాస్టర్స్‌ గేమ్స్‌లో డిస్కస్‌ త్రో, 5కే వాకింగ్‌ పోటీల్లో గోల్డ్‌, సిల్వర్‌ మెడల్స్‌ సాధించిన కల్లు రాజేశ్వరిని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులరెడ్డి అభినందించారు.

రాజేశ్వరిని అభినందిస్తున్న ఎమ్మెల్యే బాలినేని
రాజేశ్వరిని అభినందిస్తున్న ఎమ్మెల్యే బాలినేని

రాజేశ్వరిని అభినందించిన బాలినేని

ఒంగోలు (కార్పొరేషన్‌), మే 25 : దక్షిణ కొరియాలో జరిగిన ఏషియా పసిఫిక్‌ మాస్టర్స్‌ గేమ్స్‌లో డిస్కస్‌ త్రో, 5కే వాకింగ్‌ పోటీల్లో గోల్డ్‌, సిల్వర్‌ మెడల్స్‌ సాధించిన కల్లు రాజేశ్వరిని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులరెడ్డి అభినందించారు. ప్రపంచ స్థాయిలో ప్రకాశం జిల్లా కీర్తి ప్రతిష్టలను చాటి, భారతదేశ జెండాను ఎగురవేసిన రాజేశ్వరి భవిష్యత్‌లో మరెన్నో పతకాలు సాధించాలని బాలినేని ఆకాంక్షించా రు. ఈసందర్భంగా రాజేశ్వరి మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో విదేశాలలో జ రిగే పోటీలో పాల్గొనేందుకు తనకు ప్రోత్సాహమందించి సహకరించిన బాలినేనికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రాజేశ్వరీ కోచ్‌ దాసరి విజయ్‌ భాస్కర్‌, ఆమె భర్త దాసు, అన్న మోహన్‌ పాల్గొన్నారు.

అర్హులందరికీ పథకాలు అందిస్తాం

ఒంగోలు(కలెక్టరేట్‌) : అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలను అందిస్తామని మాజీమంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. గడపగడపకు కార్యక్రమం గురువారం గోపాలనగరంలో జరిగింది. ముందుగా అధికారులు, పార్టీ నాయకులతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ సమస్యలను బాలినేని అడిగి తెలుసుకున్నారు. పథకాలు అందుతున్నాయా లేదా వాకబు చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ ఉద్యోగులు, మునిసిపల్‌ అధికారులు, ఉద్యోగులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-25T23:38:03+05:30 IST