మెప్మా సిబ్బంది ఇష్టారాజ్యం
ABN , Publish Date - Dec 25 , 2023 | 12:02 AM
అద్దంకిలో మెప్మా సిబ్బంది అంతా మా ఇష్టం అన్న విధంగా వ్యవహరిస్తున్నారు. దీంతో స్వయం సహాయక సంఘాల సభ్యులలో మె ప్మా సిబ్బంది తీరుపట్ల తీవ్ర వ్యతిరేఖత వ్యక్తమవు తుంది. అద్దంకి పట్టణంలో సుమారు 8 వేల మంది స్వయం సహాయక సంఘాల సభ్యులు ఉన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమా లతో పాటు అధికార వైసీపీ కార్యక్రమాలకు జన సమీ కరణ కావాలంటే మొదట గుర్తుకు వచ్చేది మెప్మా సభ్యులే. అధికార పార్టీ నేతల నోటి నుంచి మాట రాక ముందే మెప్మా సిబ్బంది నుంచి ఆర్‌పీల ద్వారా సభ్యు లకు ఆదేశాలు పోతున్నాయి.
జగనన్న మహిళా మార్ట్‌లో అంతా మాయ
బయట మార్కెట్ కంటే ఎక్కువ ధరలు
22 నెలలు దాటినా ఇంకా తేలని లెక్కలు
స్వయం సహాయక సంఘాల సభ్యులలో తీవ్ర వ్యతిరేకత
అద్దంకి, డిసెంబరు 24: అద్దంకిలో మెప్మా సిబ్బంది అంతా మా ఇష్టం అన్న విధంగా వ్యవహరిస్తున్నారు. దీంతో స్వయం సహాయక సంఘాల సభ్యులలో మె ప్మా సిబ్బంది తీరుపట్ల తీవ్ర వ్యతిరేఖత వ్యక్తమవు తుంది. అద్దంకి పట్టణంలో సుమారు 8 వేల మంది స్వయం సహాయక సంఘాల సభ్యులు ఉన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమా లతో పాటు అధికార వైసీపీ కార్యక్రమాలకు జన సమీ కరణ కావాలంటే మొదట గుర్తుకు వచ్చేది మెప్మా సభ్యులే. అధికార పార్టీ నేతల నోటి నుంచి మాట రాక ముందే మెప్మా సిబ్బంది నుంచి ఆర్‌పీల ద్వారా సభ్యు లకు ఆదేశాలు పోతున్నాయి. ఒక్కో ఆర్‌పీకి టార్గెట్‌లు విధించి జన సమీకరణ చేస్తున్నారు. సమావేశానికి హాజరైన తరువాత నాయకుల కోసం పడిగాపులు కా యాల్సి రావటం, మీటింగ్‌లు ముగిసే వరకు వేచి ఉం డాల్సి రావటంతో స్వయం సహాయక సభ్యులలో అస హనం పెరిగిపోతుంది. దీంతో స్వయం సహాయక సం ఘాల సభ్యులు రగిలిపోతున్నారు. ఇటీవల కాలంలో పలువురు స్వయం సహాయక సంఘాల సభ్యులయితే మీ గ్రూపులు వద్దు, మీ రుణాలు వద్దు తల్లీ అని ము ఖాన చెప్తున్నట్లు తెలుస్తుంది. మెప్మా సిబ్బంది మా త్రం అధికార పార్టీ నేతల మెప్పు కోసం, వాళ్ళను ప్ర సన్నం చేసుకోంటూ తమ సీటుకు ఇబ్బంది లేకుండా చేసుకునే విధంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వ స్తున్నారు. మెప్మా సిబ్బంది తీరు ఇదేవిధంగా కొనసాగి తే వచ్చే ఎన్నికలలో అధికార వైసీపీ పట్ల తీవ్ర వ్యతి రేఖత వచ్చే అవకాశం ఉందని పలువురు వైసీపీ నేత లు సైతం వ్యాఖ్యానిస్తున్నారు.
స్వయం సహాయక సంఘాల సభ్యుల సొమ్ముతో..
అద్దంకి పట్టణంలో మెప్మా ఆధ్వర్యంలో 2022 ఫిబ్ర వరి 3న గతంలో ఉన్న అన్నా క్యాంటిన్ లో జగనన్న మహిళా మార్ట్‌ను ఏర్పాటు చేశారు. ఒక్కో స్వయం సహాయక సం ఘం నుంచి రూ.1500 చొప్పున 800 సం ఘాల నుంచి సుమారు రూ.12 లక్షలు వసూలు చేసి జగనన్న మహిళా మార్ట్‌లో పెట్టుబడి పెట్టారు. ప్రతి ఏటా జమా ఖర్చులు చూసి వచ్చే లా భాన్ని స్వయం సహాయక సంఘాల సభ్యులకు పం చుతామని ప్రగల్పాలు పలికారు. అయితే, మహిళా మార్ట్ ప్రారంభించి సుమారు 22 నెలలు దాటినా ఇం తవరకు లెక్కలు చూసిన పాపాన పోలేదన్న విమర్శ లు వస్తున్నాయి. సభ్యుల సొమ్ములతో వ్యాపారం చే స్తూ సిబ్బంది జల్సాలకు వినియోగిస్తున్నారన్న విమ ర్శలు వస్తున్నాయి. ఇది చాలదన్నట్లు ప్రతిసభ్యురాలు ఖచ్చితంగా నెలవారీ సరుకులు కొనాల్సిందేనని తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. సభ్యుల చేత సరుకులు కొనించేందుకు వీలుగా స్వయం సహాయక సంఘాల సమావేశాలను సైతం జగనన్న మహిళా మార్ట్ వద్ద నిర్వహిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. రోజువారీ ఆర్‌పీలకు టార్గెట్‌లు విధిస్తున్నట్లు తెలుస్తుంది.
అద్దంకిలో మొత్తం 32 మంది ఆర్‌పీలు ఉండగా, ఒక్కొక్కరు తమ పరిధిలోని స్వయం సహాయక సం ఘాల సభ్యులచేత రోజుకు కనీసం రూ.3 వేలకు కొను గోలు చేయించాలని టార్గెట్ విధించినట్లు తెలుస్తుంది. ఒకవేళ టార్గెట్ పూర్తి చేయకపోతే జీతంలో కట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఆర్‌పీకి నెలకు రూ.8 వేలు జీతం కాగా, గత నెలలో సరిగ్గా వ్యాపారం చేయలేదని పది మందికి వెయ్యి రూపాయలు చొప్పున జీతం కట్ చేసినట్లు తెలుస్తుంది. మెప్మా ఆధ్వర్యంలో జగనన్న మహిళా మార్ట్ నిర్వహిస్తున్నా వస్తువుల ధరలు మా త్రం బయట మార్కెట్ కంటే ఎక్కువగా ఉన్నాయన్న విమర్శలు వస్తున్నాయి. దీంతో సభ్యులు కొనుగోలుకు విముఖత చూపుతున్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి విచారణ చేపట్టి సిబ్బందిపై చర్యలు తీసుకోవల్సిన అవసరం ఉంది. లేకుంటే సిబ్బంది తీరుతో స్వయం సహాయక సంఘా ల సభ్యులలో తీవ్రవ్యతిరేఖత వచ్చే అవకాశం ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.