మెప్మా సిబ్బంది ఇష్టారాజ్యం
ABN , First Publish Date - 2023-06-03T23:05:58+05:30 IST
జగనన్న ఆసరా డబ్బులు స్వ యం సహాయక సంఘాల గ్రూపుల ఖాతాలలో జమ అయినప్పటికీ, వాటిని సభ్యుల ఖాతాల లోకి జమ చేయాలంటే మా త్రం జగనన్న మ హిళా మార్ట్‌లో సరుకులు కొనాల్సిందేనని మెలి క పెడుతున్నారు.
ఆసరా డబ్బులు రావాలంటే
జగనన్న మహిళా మార్ట్‌లో సరుకులు కొనాల్సిందే!
స్వయం సహాయ సంఘాలపై ఆర్పీల ఒత్తిడి
అద్దంకి, జూన్ 3: జగనన్న ఆసరా డబ్బులు స్వ యం సహాయక సంఘాల గ్రూపుల ఖాతాలలో జమ అయినప్పటికీ, వాటిని సభ్యుల ఖాతాల లోకి జమ చేయాలంటే మా త్రం జగనన్న మ హిళా మార్ట్‌లో సరుకులు కొనాల్సిందేనని మెలి క పెడుతున్నారు. సాధారణంగా పట్టణ పరిధి లోని స్వయం సహాయక సంఘాల సభ్యులు ఏవైనా పనులు ఉంటే మెప్మా కార్యాలయానికి వెళ్ళాల్సి ఉంది. అయితే, అద్దంకి పట్టణంలోని స్వయం సహాయక సంఘాల సభ్యులు మా త్రం జగనన్న మహిళా మార్ట్ వద్దకు రావాల్సిం దేనని షరతు పెడుతున్నారు. జగనన్న మహిళా మార్ట్‌లో సరుకులు కొనుగోలు చేసిన తరువాత సంబంధిత ఆర్పీలు తమ పరిధిలోని స్వయం సహా యక సంఘాల సభ్యులకు సంబంధించి వేలిముద్ర వేయిస్తున్నారు. కనీసం ఒక్కో సభ్యురాలు వెయ్యి రూపాయలు చొప్పున మహిళా మార్ట్‌లో కొనుగోలు చేయాల్సిందేనని ఖరా ఖండిగా చెప్తున్నారు. ఒక్కో ఆర్పీకి రోజువా రీ టార్గెట్‌లు విధిస్తుండటంతో ప్రతి రోజు స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఫోన్ లు చేసి ఒత్తిడి తెస్తున్నారు.
స్వయం సహాయక సంఘాల సభ్యుల షేర్ కాపిటల్‌తో మహిళా మార్ట్ ప్రారం భించి ఏడాది దాటిపోయింది. ప్రారంభంలో మహిళా మార్ట్‌ను పరిచయం చేసేందుకు ఒత్తిడి తేవటంలో కొంతమేర అర్ధం ఉంది. ఏడాది తరువాత కూడా సరుకులు కొనాలని ఒత్తిడి తేవటం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
మహిళా మార్ట్‌లో సరుకుల ధరలు బయట మార్కెట్‌లో ధరల కంటే అదనంగా ఉండటంతో స్వయం సహాయక సంఘాల సభ్యులు కొనుగోలు చేసేందుకు వెనుకడుగు వేస్తున్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యుల ను ఏదో ఒక సాకుతో మహిళా మార్ట్‌కు పిలిపించి సరుకులు కొనుగోలు చేయించటమే ధ్యేయంగా మెప్మా అధికారులు, సి బ్బంది వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మెప్మా అధికారులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిం చటంపై కట్టడి చేయాలని స్వయం సహాయక సం ఘాల సభ్యులు కోరుతున్నారు.