అసెంబ్లీలో అడుగుపెట్టడ మే లక్ష్యం
ABN , Publish Date - Dec 14 , 2023 | 12:02 AM
కమ్యూ నిస్టులు లేని చట్టసభ ల్లో ప్రజా సమస్యలు ప రిష్కారం కావని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గస భ్యు లు జి.ఈశ్వరయ్య అ న్నారు. తెలంగాణ స్ఫూ ర్తితో 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ శాసనసభలో సీపీఐ అభ్యర్థులు అడుగు పెట్టడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా 35 స్థానాల నుంచి సీపీఐ పోటీ
జిల్లాలో కనిగిరి, వైపాలెంలలో బరిలోకి..
గుండ్లకమ్మ ప్రాజెక్టు రిపేర్లకు నిధులకు తెప్పించలేని
బాలినేని జిల్లాకు అవసరమా..
సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఈశ్వరయ్య
ఒంగోలు(కలెక్టరేట్), డిసెంబరు 13: కమ్యూ నిస్టులు లేని చట్టసభ ల్లో ప్రజా సమస్యలు ప రిష్కారం కావని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గస భ్యు లు జి.ఈశ్వరయ్య అ న్నారు. తెలంగాణ స్ఫూ ర్తితో 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ శాసనసభలో సీపీఐ అభ్యర్థులు అడుగు పెట్టడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. బుధవారం ఒంగోలులోని మల్లయ్యలింగం భవన్‌లో దర్శి మండల కార్యదర్శి ఎం.రమేష్ అధ్యక్షతన జరిగిన సభలో ఈశ్వరయ్య మాట్లాడారు. సీపీఐ అభ్యర్థులు పోటీ చేసేందుకు 35 స్థానాలను గుర్తించినట్లు తెలిపారు. జిల్లా నుంచి కనిగిరి, వైపాలెం నియోజక వర్గాల నుంచి సీపీఐ అభ్యర్థులు బరిలో నిలుస్తారన్నారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ సొంతంగా పోటీచేయడం బీజేపీకి కలిసి వచ్చిం దన్నారు. తెలంగాణలో రేవంత్‌రెడ్డి పోరాటాల ఫలితంగానే కాంగ్రెస్ పార్టీ అధి కారంలోకి వచ్చిందన్నారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీ, సీపీఐ, సీపీఎంలు కలిసి పోటీచేయడమే లక్ష్యంగా సీపీఐ భావిస్తుందన్నారు. చంద్రబాబు అరెస్టు వెనుక మోదీ, అమిత్‌షాలు ఉన్నారని ఆరోపించారు. గుం డ్లకమ్మ ప్రాజెక్టు మరమ్మతులకు నిధులు సాధించలేని ఎమ్మెల్యే బాలినేని శ్రీ నివాసరెడ్డి జిల్లాకు అవసరమా అని ఈశ్వరయ్య ప్రశ్నించారు. గుండ్లకమ్మ ప్రాజె క్టు పరిధిలోని ఎమ్మెల్యే టీజేఆర్.సుధార్‌బాబు ఎక్కడ ఉన్నారని ఆయన ప్రశ్నిం చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ ఆర్.వెం కట్రావు, పీవీఆర్‌చౌదరి, డి.శ్రీనివాస్, అందె నాసరయ్య, వి.హనుమారెడ్డి, కే.వీ రారెడ్డి, ఎస్‌డి.మౌలాలి, ఆర్.రామకృష్ణ, పి.ప్రభాకర్, విజయ, ఎస్.రావమ్మ త దితరులు పాల్గొన్నారు.