టీడీపీలో పలు కుటుంబాలు చేరిక

ABN , First Publish Date - 2023-06-26T00:37:27+05:30 IST

వైసీపీ నుంచి టీడీపీలోనికి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. గిద్దలూరుకు చెందిన వేములపాటి చంటి ఆధ్వర్యంలో వివిధ వర్గాలకు చెందిన 30 కుటుంబాలు తాజాగా టీడీపీలో చేరాయి.

టీడీపీలో పలు కుటుంబాలు చేరిక

గిద్దలూరు, జూన్‌ 25 : వైసీపీ నుంచి టీడీపీలోనికి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. గిద్దలూరుకు చెందిన వేములపాటి చంటి ఆధ్వర్యంలో వివిధ వర్గాలకు చెందిన 30 కుటుంబాలు తాజాగా టీడీపీలో చేరాయి. పట్టణంలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్న వీరిని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ముత్తుముల అశోక్‌రెడ్డి సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువాలు కప్పారు. టీడీపీలో చేరిన వారిలో వేములపాటి చెన్నయ్య, బాలుడు, మాచర్లయ్య, లింగమయ్య, రామక్రిష్ణాచారి, రంగనాయకులు తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు సయ్యద్‌ షాన్షావలి, టీడీపీ నాయకులు వడ్లమాని సుబ్బరాయుడు, చిలకల రమణ, కేశవ్‌గౌడ్‌, ఉలాపు శేఖర్‌, తదితరులు ఉన్నారు.

కంభం : ప్రజలను చైతన్య పరిచేందుకే బస్సు యాత్రలో భాగంగా కంభం మండలం ఎల్‌.కోట గ్రామానికి వచ్చిన టీడీపీ జిల్లా నాయకులు రచ్చబండ అనం తరం గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి ఆధ్వర్యంలో పల్లెనిద్ర చేశారు. ఆదివారం ఉదయం ఎల్‌కోట గ్రామంలో ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T00:37:27+05:30 IST