తమిళనాడులో హత్య చేసి..ఒంగోలులోని హోటల్‌లో పని చేస్తూ..
ABN , Publish Date - Dec 29 , 2023 | 12:39 AM
తమిళనాడు రాష్ట్రంలో ఒకరిని హత్య చేసి ఒంగోలు లో తలదాచుకున్న నిందితుడిని అక్కడి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.
నిందితుడిని చాకచక్యంగా అరెస్టు చేసిన పోలీసులు
ఒంగోలు(క్రైం), డిసెంబరు 28: తమిళనాడు రాష్ట్రంలో ఒకరిని హత్య చేసి ఒంగోలు లో తలదాచుకున్న నిందితుడిని అక్కడి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వివ రాలలోకి వెళితే.. తమిళనాడు రాష్ట్రం తిరువాళ్ళురు జిల్లాలో బిరియానీ హోటల్‌లో పని చేసే వ్యక్తిని అస్సాం రాష్ట్రానికి చెందిన రోహిత్‌లింబో పని ఈనెల 25న గొడవపడి రా డ్‌తో తలపై కొట్టి హత్యచేసి పరారీ అయ్యాడు. అక్కడ సీసీ ఫుటేజీ ద్వారా పోలీసులు గుర్తించి నేరస్థలం నుంచి ఈనెల 26 తెల్లవారుజామన చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో కొరమండల్ ఎక్స్‌ప్రెస్ ఎక్కి ఒంగోలు రైల్వేస్టేషన్‌లో దిగినట్లు గుర్తించారు. అక్కడ నుంచి స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో గల హోటల్‌లో పనిచేస్తుండగా నగర పోలీసుల స హకారంతో గురువారం తెల్లవారు జామున అదుపులోకి తీసుకున్నారు. అయితే స్థాని క రైల్వేస్టేషన్ నుంచి నగరంలో ఎక్కడ సీసీ కెమోరాలు పరిశీలిచినా అవి పనిచే యలేదు. దీంతో పోలీసులు విసుగు చెంది ఎట్టకేలకు ఆర్టీసీ బస్టాండ్‌లో వెతకగా నిందితుడు దొరికిపోయాడు.