ప్రతి నీటిబొట్టును సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2023-03-26T01:20:25+05:30 IST

ప్రతి నీటిబొట్టును వృథా కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జలజీవన్‌ మిషన్‌ టీం-కోఆర్డినేటర్‌ షేక్‌ సుల్తానా అన్నారు.

ప్రతి నీటిబొట్టును సద్వినియోగం చేసుకోవాలి

రాచర్ల, మార్చి 25 : ప్రతి నీటిబొట్టును వృథా కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జలజీవన్‌ మిషన్‌ టీం-కోఆర్డినేటర్‌ షేక్‌ సుల్తానా అన్నారు. వరల్డ్‌ వాటర్‌ డే సందర్భంగా రాచర్లలో శనివారం గ్రామంలో అవగాహన సద స్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సుల్తానా మాట్లాడుతూ రానున్న తరాలకు పూర్తిస్థాయిలో నీరు అందించాలంటే ప్రస్తుతం నీటిని ఆదా చే యాలన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వరనాయక్‌, సచివాలయ అసి స్టెం ట్‌ నాయబ్‌రసూల్‌, గ్రామస్థులు పాల్గొన్నారు.

రాచర్ల : ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా మొక్కలు నాటాలని తహసీల్దార్‌ దిలీప్‌కుమార్‌ అన్నారు. శనివారం తహసిల్దార్‌ కార్యాలయం ఆవరణలో రెవెన్యూ సిబ్బంది ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమంలో తహసీల్దార్‌ పాల్గొన్నారు. దాదాపు 100 మొక్కలను రెవెన్యూ సిబ్బంది నాటారు. రాబోయే రోజుల్లో కూడా మొక్కలునాటే కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్‌ భారతీభాయి, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ గంగిరెడ్డి, సర్వేయర్‌ సిలార్‌ఖాన్‌, వీఆర్‌వో పద్మావతి, మాచర్ల, యోనా, వెంకటేశ్వర్లు, ప్రభుదాస్‌, సచివాలయ సర్వేయర్లు పాల్గొన్నారు.

మార్కాపురం(వన్‌టౌన్‌) : ప్రతి పాఠశాలలో ఎకో క్లబ్‌ నిర్వహించాలని ఏపీఎన్‌జీసీ డైరెక్టర్‌ పి.స్రవంతి అన్నారు. స్థానిక జెడ్పీ బాలుర ఉన్న త పాఠశాలలో ఏపీఎన్జీసీ ఆధ్వర్యంలో ఎర్త్‌అవర్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్రవంతి మాట్లాడుతూ.. గ్లోబల్‌ వార్మింగ్‌ వల్ల జీవం మనుగడ ప్రమాదకరంగా మారిన తరు ణంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు మొక్కలు నాటాలన్నారు. అనంతరం వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అం దించారు. చిత్రలేఖనంలో ఈదుమూడి పాఠశా లకు చెందిన మైఖేల్‌ ప్రథమ బహుమతి అందు కున్నాడు. దర్శికి చెందిన రాహుల్‌ ద్వితీయ, జగంగుంట్లకు చెందిన సందీప్‌ కుమార్‌ తృతీయ బహుమతి పొందారు. క్విజ్‌లో చెన్నారెడ్డిపల్లె పాఠశాలకు చెందిన గణేష్‌, బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన రంగశివనాయుడు బహుమతులు పొందాడు. ధనుష్‌, నమ్రతలు కూడా క్విజ్‌ విభాగంలో బహుమతులు అందు కున్నారు. కార్యక్రమంలో ఏపీఎన్జీసీ క్లస్టర్‌ కో-ఆర్డీనేటర్లు ఓ.రవిశేఖర్‌రెడ్డి, స్వర్ణలత, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-26T01:20:25+05:30 IST