ఘనంగా మహబూబ్ సుబానీ గార్మీ పండుగ
ABN , First Publish Date - 2023-10-30T00:00:03+05:30 IST
సంతనూతల పాడులో ముస్లింలు ఆదివారం మహబూబ్ సుబా నీ గార్మీ పండుగ సందర్బంగా జెండా గంధమహో త్సవం ఘనంగా నిర్వహించారు.
దామచర్ల, రియాజ్, బీఎన్‌లకు ఘనస్వాగతం
సంతనూతలపాడు, అక్టోబరు 29: సంతనూతల పాడులో ముస్లింలు ఆదివారం మహబూబ్ సుబా నీ గార్మీ పండుగ సందర్బంగా జెండా గంధమహో త్సవం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ముస్లింల ఆహ్వానం రాత్రి 9-30 గంటలకు విచ్చే సిన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్, జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, నియోజక వర్గ ఇన్‌చార్జ్ బీఎన్.విజయ్‌కుమార్‌లకు నిర్వహకు లు పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలికారు. తొలుత స్ధానిక అంబేడ్కర్‌భవన్‌లోని డాక్టర్ బీఆర్.అంబే డ్కర్ విగ్రహానికి అతిథులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కొంత దూరం ర్యాలీ గా వచ్చిన అనంతరం బస్టాండ్ వద్ద దామచర్ల, బీఎన్‌లను ఆట గుర్రాలపై ఊరేగింపుగా తీసుకువ చ్చారు. మసీద్‌సెంటర్ వద్దకు చేరుకోగానే టెంకా యలు కొట్టారు. కార్యక్రమంలో ముస్లిం సం ఘనాయకులు షేక్ నాయబ్‌రసూల్, కాలేషావలి, వలి(మెకానిక్), షేక్ మక్బుల్, బకూన్, నజీర్, ము నీర్, అడకా స్వాములు, బొమ్మినేని రామంజనేయు లు, మండల అధ్యక్షుడు మద్దినేని హరిబాబు, జన సేన నాయకులు పాల్గొన్నారు.