దర్శి ప్రాంతంలో జోరుగా పేకాట

ABN , First Publish Date - 2023-02-21T22:12:53+05:30 IST

దర్శి ప్రాంతంలో జోరుగా పేకాట సాగుతోంది. శివారు ప్రాంతాలు, నదీ పరీవాహక ప్రాంతాలను ఎంచుకొని అక్కడ రహస్యంగా శిబిరాలను నిర్వహిస్తున్నారు. స్థాని కులతోపాటు సుదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడ వచ్చి పేకాటను ఆడుతున్నారు. పెద్ద ఎత్తున పేకాట సాగుతుండగా, లక్షల రూపా యలు చేతులు మా రుతున్నట్లు విన్పిస్తోంది.

దర్శి ప్రాంతంలో జోరుగా పేకాట

శివారు ప్రాంతాల్లో రహస్యంగా శిబిరాలు

ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న ఆటగాళ్లు

పోలీసుల దాడుల్లో పట్టుబడుతున్న జూదరులు

దర్శి, ఫిబ్రవరి 21 : దర్శి ప్రాంతంలో జోరుగా పేకాట సాగుతోంది. శివారు ప్రాంతాలు, నదీ పరీవాహక ప్రాంతాలను ఎంచుకొని అక్కడ రహస్యంగా శిబిరాలను నిర్వహిస్తున్నారు. స్థాని కులతోపాటు సుదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడ వచ్చి పేకాటను ఆడుతున్నారు. పెద్ద ఎత్తున పేకాట సాగుతుండగా, లక్షల రూపా యలు చేతులు మా రుతున్నట్లు విన్పిస్తోంది. పోలీ సులు దాడులు చేసినప్పుడల్లా జూదరులు పట్టుబ డుతున్నారు. అయితే పోలీసులు పూర్తి స్థాయిలో పేకాటపై దృష్టి సారించకపోవడంతో పేకాట ఆగడం లేదు. దాడులు జరిగినప్పుడు ఒకటి రెండ్రోజులు ఆ టను ఆపి, స్థలాలను మార్చి ఇతర ప్రాంతాలకు మ కాం మార్చి యథేచ్ఛగా ఆట సాగిస్తున్నారు. కొంత మంది వ్యక్తులు ఇక్కడకు పిలిపించి ఆట ఆడిస్తు న్నారు. వారి వద్ద నుంచి కొంత సొమ్ము ఖర్చుల కింద వసూళ్లు చేస్తూ మీకు ఎలాంటి భయం లేదు. మేము న్నామంటూ భరోసా ఇస్తున్నారు. మధ్యవర్తులు కొం దరు అధికారులతో లింకులు పెట్టుకొని పేకాట జోరుగా సాగిస్తున్నట్లు సమాచారం అందువలన పోలీసులు దా డులు చేసినా పూర్తి స్థాయిలో ఎవరూ దొరకడం లేదు. దాడులకు వస్తున్న విషయం కూడా పేకాట నిర్వా హకులకు ముందుగానే సమాచారం తెలియడంతో అక్కడి నుంచి అందరూ జారుకుంటున్నట్లు ఆరోపణలు న్నాయి. ఈ కారణాలతోనే పేకాట యథేచ్ఛగా, జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కొత్తపల్లి వద్ద పేకాట ఆడుతున్న విషయం తెలిసి పోలీసులు దాడులు చేయగా, అప్పటికే కొందరు పరారయ్యారు. కొద్దిమంది మాత్రమే దొరికారు. పెద్దపెద్ద శిబిరాలను ఏర్పాటు చేసి ఆట ఆడించేచోట జూదరులెవరూ దొరకకపోవడానికి ముందస్తు సమాచారమే కారణమని విమర్శలు విన్పిస్తు న్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఆడుకునే చిన్నచిన్న జూద రులు మాత్రం పట్టుబడుతున్నారు. దర్శి మండలంలో ముసీ పరీవాహక ప్రాంతంలో, బొట్లపాలెం శివారు ప్రాం తాల్లో, చందలూరు. దర్శి కొండ ప్రాంతాల్లో పే కాట జరుగుతున్నట్లు సమాచారం. అలాగే ముండ్లమూరు మండలంలో నూజెండ్ల రోడ్లులోని కొండవద్ద, పసుపు గల్లు శివారు ప్రాంతాల్లో పేకాట జరుగుతున్నట్లు సమా చారం. తాళ్లూరు మండలంలో శివరాంపు రం, బొద్దికూర పాడు శివారు ప్రాంతాల్లో కురిచేడు మండలంలో అటవీ ప్రాంతంలో పేకాట ఆడుతున్నట్లు సమాచారం. జూ దరులు కొద్దిరోజులు ఒక చోట, మరికొద్ది రోజులు ఇంకో చోటకు మకాం మారుస్తూ అనుమానాలు రాకుండా జా గ్రత్తలు తీసుకుంటున్నారు. అక్కడ పేకాట జరుగు తున్నట్లు అజ్ఞాన వ్యక్తులు ఇచ్చిన సమాచారంతో దాడుల్లో పట్టుబడుతున్నారు.

ఆట చోటే వడ్డీ వ్యాపారం

పేకాట ఆడేందుకు వచ్చిన జూదరులు ఆటో ఓడి పోయి తెచ్చిన డబ్బంతా కోల్పోతారు. అలాంటి వా రు తిరిగి ఆటను కొనసాగించేందుకు డబ్బులు అ ప్పుగా ఇచ్చేవారికీ ఇక్కడ కొదవలేదు. పేకాటలో ఆ స్తులు సైతం కోల్పోయి రోడ్డునపడినవారు లేకపో లేదు. పేకాట శిబిరాల వద్ద వడ్డీలకు అప్పులు ఇ చ్చి భారీగా సంపాదిస్తున్నారు. ఆటలో డబ్బులు పో గొట్టుకున్నవారికి అధిక వడ్డీలకు అప్పులు ఇస్తు న్నారు. చేతిలో డబ్బులు పడగానే మళ్లీ ఆటలో కూ ర్చుంటున్నారు. గెలిస్తే అప్పులు తీర్చి సరదాగా ఉం టారు. అప్పు తీసుకున్న డబ్బు కూడా పోగొట్టుకున్న జూదరులు రెండు విధాలా దెబ్బతగులు తుంది. సొంత డబ్బు పోగొట్టుకోగా చేసిన అప్పులకు వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రోజువారీ, వారం, నెలవారీగా వడ్డీలకు ఇస్తూ సొమ్ము చేసుకుంటు న్నా రు. గెలిస్తే సరే ఓడిపోతే సొంత ఆస్తులను సైతం అ మ్ముకోవల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అనేక కు టుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఇప్పటికైనా పోలీసు అధికారులు పేకాట స్థావరాలను గుర్తించి కళ్లెం వే యాలని బాధిత కుటుంబాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. మొ క్కుబడి దాడులతో సరి పెట్టకుండా అసలు సూత్రధారు లెవరో తెలుసుకొని కట్టడి చేయాలని కోరుతున్నారు.

Updated Date - 2023-02-21T22:12:55+05:30 IST