దోచుకోవడమే వైసీపీ నేతల పరమావధి

ABN , First Publish Date - 2023-03-31T00:28:04+05:30 IST

రాష్ట్రాన్ని దోచుకోవడమే వైసీపీ నాయకులు పరమావధి గా వ్యవహరిస్తున్నారని మార్కాపురం టీడీపీ ఇన్‌చార్జ్‌ కందుల నారాయణరెడ్డి విమర్శించారు.

దోచుకోవడమే వైసీపీ నేతల పరమావధి

కొనకనమిట్ల, మార్చి 30 : రాష్ట్రాన్ని దోచుకోవడమే వైసీపీ నాయకులు పరమావధి గా వ్యవహరిస్తున్నారని మార్కాపురం టీడీపీ ఇన్‌చార్జ్‌ కందుల నారాయణరెడ్డి విమర్శించారు. వెలుగొండ ప్రాజెక్ట్ట్‌ పూర్తి, మార్కాపురం జిల్లా సాధనే ధ్యేయంగా ఆయన ప్రారంభించిన ప్రజా చైతన్యయాత్ర 5వ రోజు కొనసాగింది. గురు వారం మండలంలోని ఇరసలగుండం, బచ్చల కూరపాడు, చెర్లోపల్లి, సిద్ధవరం, కొనకనమిట్ల, ఎదురాళ్లపాడు గ్రామాలలో పర్యటించారు. ఈ సందర్భంగా మండలకేంద్రం కొనకనమిట్ల బస్టాండ్‌ కూడలిలో భారీగా తరలివచ్చిన ప్రజలను, అభిమానులను ఉద్దేశించి కందుల మాట్లాడారు. ప్రజాసమస్యల పరిష్కరించే విషయంలో తాను ఎప్పుడు ముందుండి పోరాడ తానన్నారు. ఇసుక, మట్టి, వంటివి సామాన్యు లకు అందకుండా వైసీపీ నేతలు ఇతర రాష్ట్రాల కు తరలించి జేబులు నింపు కుంటున్నారని ఆరోపించారు. గిద్దలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ అశోక్‌రెడ్డి మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్ట్‌ తామే పూర్తి చేసి ప్రారంభిస్తామన్నారు. వెలిగొండను పూర్తి చేసే ఉద్దేశ్యమే ప్రభుత్వానికి ఉంటే రూ.3500 కోట్లు అవసరమైతే కేవలం రూ.100కోట్లు కంటి తుడుపు చర్యగా బడ్జట్‌లో కేటాయించడం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. అన్నిప్రాంతాలకు మేలు చేసే ఉద్దేశ్యం జగన్‌మోహన్‌రెడ్డికి లేదన్నారు. ఆయన రాయలసీమకే ముఖ్యమంత్రి అని రాష్ట్రానికి కాదని విమర్శించారు. నాడు పాదయాత్ర సమయంలో జగన్మోహనరెడ్డి మాట్లాడుతూ.. తాను అధికారంలోకి వచ్చిన ఏడాదిలో వెలిగొండను పూర్తిచేస్తానని ప్రగల్బా లు పలికాడన్నారు. ఇప్పుడు వెనుకబడిన పశ్చి మ ప్రకాశాన్ని విస్మరించారన్నారు. రైతన్నకు వైసీపీ ఎలాంటి మేలు చేయలేదని అధికారం లోకి రాకముందు రూ.3000 కోట్లతో పెట్టుబడి సాయం అందిస్తానని ప్రకటించాడన్నారు. ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. టీడీపీ ప్రభుత్వ హాయంలోనే రైతన్నలకు మేలు జరిగిం దన్నారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో రైతన్న అప్పులతో ఆత్మహత్యలు చుసుకుంటు న్నారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ టీడీపీకి మద్దతుగా నిలవాలన్నారు. కార్యక్రమం లో టీడీపీ మండల అధ్యక్షుడు బాబురావు, పొదిలి ఏఎంసీ మాజీ చైర్మన్‌ చప్పిడి రామలింగయ్య, కనకం నరసింహారావు, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి కామసాని రామిరెడ్డి, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-31T00:28:04+05:30 IST