నేత న్నపై చిన్నచూపు
ABN , First Publish Date - 2023-12-10T22:02:07+05:30 IST
ప్రభుత్వం చేనేతను చిన్నచూపు చూస్తోంది. చేనేత చట్టాలు కొన్ని కాగితాలకే పరిమితం అవుతున్నాయి. అందుకు చేనేత, జౌళి శాఖ అధికారుల ఉదాసీన వైఖరే కారణమని సగటు చేనేత కార్మికులు ఆరోపిస్తున్నారు. పవర్‌లూమ్ వస్త్రాలు, చేనేత వస్త్రాలుగా చెలామణి అవుతున్నాయి.
చేనేత వస్త్రాలుగా
పవర్‌లూమ్ వస్త్రాల చెలామణి
నిబంధనల పేరుతో
పలువురికి దక్కని నేతన్న నేస్తం
చీరాల, డిసెంబరు 10: ప్రభుత్వం చేనేతను చిన్నచూపు చూస్తోంది. చేనేత చట్టాలు కొన్ని కాగితాలకే పరిమితం అవుతున్నాయి. అందుకు చేనేత, జౌళి శాఖ అధికారుల ఉదాసీన వైఖరే కారణమని సగటు చేనేత కార్మికులు ఆరోపిస్తున్నారు. పవర్‌లూమ్ వస్త్రాలు, చేనేత వస్త్రాలుగా చెలామణి అవుతున్నాయి.
జిల్లాలో ఉన్న చేనేత మగ్గాలలో సింహభాగం చీరా ల నియోజకవర్గంలో ఉన్నాయి. ఒకప్పుడు నియోజక వర్గంలోని పందిళ్లపల్లి నుంచి ఈపురుపాలెం వరకు చేనేత గుంటమగ్గాల లయబద్ధ చప్పుళ్లు వినిపించేవి. సుమారు రెండు దశాబ్దాల క్రితం సుమారు 15వేలకు పైగా మగ్గాలు ఉండేవి. కాలగమనంలో నెలకొన్న పరి స్థితులతో ప్రస్తుతం వాటిసంఖ్య 6,500కు పడిపోయిం ది. అందుకు అనేక కారణాలున్నాయి. అందులో పవర్ లూమ్ వస్త్రాలు చేనేత వస్త్రాలుగా చెలామణి కావటం కూడా ఒక కారణం. ప్రభుత్వపరంగా అందే రాయితీలు చేనేత సహకార సంఘాలకు మాత్రమే అందటంతో, అసంఘటిత రంగంలో ఉన్న వారికి వృత్తి భద్రత కొర వడటం మరో కారణం. ప్రభుత్వపరంగా అందిస్తున్న నేతన్న నేస్తం ఫలాలు కూడా నిబంధనల పేరుతో కొం దరి దరిచేరకపోవటం ఇంకో కారణం. అధికారులు దృ ష్టి సారిస్తే పవర్‌లూమ్ వస్త్రాలను నియంత్రించ టం కష్టమేమీ కాదు. అయితే చిత్తశుద్ధి లోపిస్తుందనే విమ ర్శలు వినిపిస్తున్నాయి. అందుకు కొంతమేర స్వప్రయో జనాలు కారణమనే ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నాయి.
పవర్‌లూమ్ వస్త్రాల నియంత్రణ ఎలా..
స్ధానికంగా పవర్‌లూమ్‌లు లేవని హ్యాండ్లూమ్ అధి కారులు చెప్తున్నారు. అయితే, ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకున్న ముడి వస్త్రాన్ని కొందరు తమ ఖా ర్ఞానాల్లో డిజైనింగ్ చేయించి చేనేత వస్త్రాలుగా విక్ర యిస్తున్నారనేది ప్రధాన ఆరోపణ. మరికొందరు ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసిన పవర్‌లూమ్ వస్త్రా లను స్థానికంగా చేనేత వస్త్రాలుగా విక్రయిస్తున్నారని చెప్తున్నారు. వీటిని నియంత్రించటం తమ బాధ్యత కా దని హ్యాండ్లూమ్ అధికారులు చెప్పటం విశేషం. అది విజిలెన్స్ అధికారుల పనని చెప్తూ చేతులు దులుపుకో వటం పట్ల సర్వత్రా అసంతృప్తి వ్యక్తం అవుతోంది.
వస్త్ర కొనుగోలుదారులలో ఎక్కువ మంది చేనేత, ప వర్‌లూమ్ వస్త్రాల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించలేక పో తున్నారు. దీన్ని విక్రయదారులు సొమ్ము చేసుకుంటు న్నారు. హ్యాండ్లూమ్ కన్నా పవర్‌లూమ్ వస్త్రాలు తక్కు వ ధరకు రావటంతో అంతిమంగా చేనేత వస్త్రాలు తయారుచేసే నేతన్న తాము నష్టపో తు న్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కనిపించని విజిలెన్స్ చర్యలు
చేనేత రిజర్వేషన్‌లో పొందుపరిచిన 11 రకాల ఉత్పత్తులు కూడా పవర్‌లూమ్స్‌పై తయారుచేస్తున్నా, వాటిని చేనేత వస్త్రాలు గా విక్రయిస్తున్నా విజిలెన్స్ అధి కారులు చర్యలు నామమాత్రంగా కూడా ఉండటం లే దని ఆ రంగ ప్రతినిధులు అంటున్నారు. దీంతో అం తిమంగా చేనేత రంగం నిర్వీర్యం అయ్యే పరిస్ధితి ఏర్ప డిందని తమ వాదన వినిపిస్తున్నారు.
శాఖల మధ్య సమన్వయలోపం
కొన్ని కంపెనీలలో పాక్షికంగా మిషనరీపై తయా రుచేసిన వస్త్రాలు కూడా చేనేత వస్త్రాలుగా చెలామణి అవుతున్నాయి. సదరు కంపెనీల రిజిస్ట్రేషన్, సేల్స్ టా క్స్, టిన్, జీఎస్‌టీ అన్నీ సీటీఓ(కమిర్షియల్ టాక్స్ ఆఫీ సు) పరిధిలోకి రావటంతో హ్యాండ్లూమ్ అధికారులు కొన్ని సందర్భాల్లో చర్యలు చేపట్టాలన్నా మిన్నకుండాల్సి వస్తోంది. ఈమేరకు వారు తమ ఆంతరంగిక సంభా షణల్లో చర్చించుకున్నట్లు సమాచారం.
సక్రమంగా అందని సబ్సిడీ
మగ్గం ఉన్న వ్యక్తికి ప్రతినెల 4 బండిల్స్(ఒక్కో బం డిల్ 4.7 కేజీలు)నూలు, 6 కేజీలు పట్టు సబ్సిడీపై స రఫరా చేయాలి. అందుకు సంబంధించి లబ్ధిదారులు పూర్తి ధర చెల్లించి నూలు, పట్టు కొనుగోలు చేస్తే, వాటి ధరపై 15 శాతం సబ్సిడీ కొనుగోలుదారుల ఖాతాలో జమచేస్తారు. ఆర్థిక పరిపుష్టి తక్కువగా ఉన్న నేత న్నలు కొందరు ముందుగా పెట్టుబడిపెట్టి నూలు, ప ట్టు కొనుగోలు చేయలేక షావుకార్లును ఆశ్రయిస్తుంటా రు. ధరల నియంత్రణలో కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు విఫలమయ్యాయని ఆ రంగ ప్రతనిధులు ఆరో పిస్తున్నారు. రెట్టింపయిన రంగులు, రసాయనాల ధర లు అందుకు నిదర్శనమంటున్నారు. కొన్ని సందర్భాల్లో నేతన్న కోరినరకం నూలు ఉండటం లేదని చెప్తున్నారు.
పలువురికి అందని నేతన్న నేస్తం
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నేతన్న నేస్తం ఫలాలు కూడా నిబంధనల పేరుతో కొందరికి అందలేదు. ఈ పథకం వర్తింపజేస్తున్నామని అంతకు ముందున్న ప లు పథకాలకు తిలోదకాలిచ్చారు. మొత్తంగా ప్రభుత్వం చేనేతను చిన్నచూపు చూస్తుందని సగటు చేనేత కార్మికులు వాపోతున్నారు.