జీవనోపాధి పెంపునకు రుణాలు

ABN , First Publish Date - 2023-06-02T23:06:06+05:30 IST

గ్రామాల్లో అర్హులైన ప్రతి పేద కుటుంబాల వారి జీవనోపాధి పెంపొందించేందుకు వైకెపీ ఆధ్వర్యంలో రుణాలు మంజూరు చేయాలని జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్‌ బి. బాబురావు సూచించారు. స్థానిక వైకెపీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన వీవోఏలకు సమావేశంలో ఆయన ముఖ్యఅతిఽథిగా పాల్గొని మాట్లాడారు. పొదుపు గ్రూపుల్లో ఉండి ఆసక్తిగల మహిళలకు చిన్నతరహా, మధ్యతరహాకు చెందిన డెయిరీ యూనిట్లు, పొట్టేలు పిల్లలు యూనిట్లు, కారం మిషన్లు, సెంట్రింగ్‌ యూనిట్లు, టెంట్‌ హౌస్‌, డీజే యూనిట్లు, బడుగు వికాసం కింద కార్లు, ట్రాక్టర్లు, ఆటోలు తదితర వాటికి రుణాలు ఇప్పించాలని తెలిపారు. అలాగే గ్రూపుల్లో లేని నిరుపేద కుటుంబాలను గ్రూపుల్లో చేర్పించాలన్నారు.

జీవనోపాధి పెంపునకు రుణాలు
సెంట్రింగ్‌ యూనిట్‌ను పరిశీలిస్తున్న ప్రాజెక్టు డైరెక్టర్‌ బాబురావు

దొనకొండ, జూన్‌ 2 : గ్రామాల్లో అర్హులైన ప్రతి పేద కుటుంబాల వారి జీవనోపాధి పెంపొందించేందుకు వైకెపీ ఆధ్వర్యంలో రుణాలు మంజూరు చేయాలని జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్‌ బి. బాబురావు సూచించారు. స్థానిక వైకెపీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన వీవోఏలకు సమావేశంలో ఆయన ముఖ్యఅతిఽథిగా పాల్గొని మాట్లాడారు. పొదుపు గ్రూపుల్లో ఉండి ఆసక్తిగల మహిళలకు చిన్నతరహా, మధ్యతరహాకు చెందిన డెయిరీ యూనిట్లు, పొట్టేలు పిల్లలు యూనిట్లు, కారం మిషన్లు, సెంట్రింగ్‌ యూనిట్లు, టెంట్‌ హౌస్‌, డీజే యూనిట్లు, బడుగు వికాసం కింద కార్లు, ట్రాక్టర్లు, ఆటోలు తదితర వాటికి రుణాలు ఇప్పించాలని తెలిపారు. అలాగే గ్రూపుల్లో లేని నిరుపేద కుటుంబాలను గ్రూపుల్లో చేర్పించాలన్నారు. అందించిన ప్రతి రుణాలు నూరుశాతం రికవరీలు ఉండాలని, అందుకు వీవోఏలు బాధ్యత వహించాలన్నారు. త్వరలో స్వయం సంఘాల ఆధ్వర్యంలో దొనకొండలో మహిళా మార్టు ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామాల్లో ప్రతి కుటుంబం నిత్యావసర వస్తువులు నెలకు కనీసం రూ.3వేలు ఖర్చుచేస్తారని, ఈ సరుకులు మహిళా మార్టులో తీసుకుంటే ఎంఆర్‌పీకే నాణ్యమైన వస్తువులు అందజేస్తారన్నారు. ప్రతి పొదుపు మహిళ షేర్‌ క్యాపిటల్‌గా రూ.200, సభ్యత్వం కింద రూ.10 చెల్లించి జగనన్న మహిళా మార్టులో భాగస్వామ్యం కావాలని కోరారు. అనంతరం పొదుపు మహిళల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న జగనన్న మార్టు ఏర్పాటుకు అనువైన భవనాన్ని పరిశీలించారు.ఈ కార్యక్రమంలో డీపీఎం డేవిడ్‌, బ్యాంకు లింకేజీ డీపీఎం సుబ్బారావు, ఏరియా కో-ఆర్డినేటర్‌ వసుంధరాదేవి, ఏపీఎం వెంకటేశ్వర్లు, సీసీలు, వీవోఏలు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-02T23:06:06+05:30 IST