రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కనుమరుగు
ABN , First Publish Date - 2023-02-21T22:16:18+05:30 IST
రాష్ట్రంలో చట్టం, న్యాయం కనుమరుగైందని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అ న్నారు. స్థానిక అమరావతి గ్రౌండ్స్ ప్రాంగణంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గన్నవరంలో టీడీపీ కా ర్యాలయంపై వైసీపీ మూకలు దాడి చేస్తుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర వ హించడంపై అన్యాయమన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలను రక్షించాల్సిన పోలీసులు అధికార పార్టీకి తలొగ్గి ప్రజలపైనే తిరుగుబాటు చేయడం హేయమైన చర్యగా డాక్టర్ ఉగ్ర పేర్కొన్నారు.
మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర
కనిగిరి, ఫిబ్రవరి 21: రాష్ట్రంలో చట్టం, న్యాయం కనుమరుగైందని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అ న్నారు. స్థానిక అమరావతి గ్రౌండ్స్ ప్రాంగణంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గన్నవరంలో టీడీపీ కా ర్యాలయంపై వైసీపీ మూకలు దాడి చేస్తుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర వ హించడంపై అన్యాయమన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలను రక్షించాల్సిన పోలీసులు అధికార పార్టీకి తలొగ్గి ప్రజలపైనే తిరుగుబాటు చేయడం హేయమైన చర్యగా డాక్టర్ ఉగ్ర పేర్కొన్నారు. ప్రభుత్వాలు వస్తుంటా యి.. పోతుంటాయని, పోలీస్ వ్యవస్థ ప్రజలదని, ప్రజల కోసం పనిచే యాలన్నారు. పోలీసుల తీరు చేస్తుంటే లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అన్న అనుమానాలు ప్రజలకు తలెత్తుతాయన్నారు. పిచ్చోడి చేతికి రాయి ఇచ్చినట్లుగా ప్రజలు జగన్‌రెడ్డికి అధికారం ఇస్తే ఆ రాయిని ప్రజల పైకే విసిరి రాక్షస ఆనందాన్ని పొందుతున్నారని అన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని ఉగ్ర డిమాండ్ చేశారు. గన్నవరంలో టీడీపీ కార్యా లయంపై వైసీపీ మూకల దాడిపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన టీడీపీ నే తలపై కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు. టీడీపీ నేత పట్టాభిపై పోలీ సులు కొట్టడాన్ని ఉగ్ర ఖండించారు. అరాచక పాలన సాగిస్తున్న జగన్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పాలని ఉగ్ర పిలుపునిచ్చారు. వైసీపీ పాలనను అంతమొందించేందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలన్నారు. స మావేశంలో నియోజకవర్గ క్లస్టర్ ఇన్‌చార్జి దొడ్డా వెంకటసుబ్బారెడ్డి, మా జీ వైస్ చైర్మన్ వీవీఆర్ మనోహరరావు (చిరంజీవి), తె లుగు రైతు రాష్ట్ర నాయకులు రాచమల్ల శ్రీనివాసులరెడ్డి, మండల అధ్య క్షుడు వెంకటేశ్వర్లు, పిచ్చాల శ్రీనివాసులరెడ్డి, పట్టణాధ్యక్షుడు తమ్మినేని శ్రీనివాసులరెడ్డి, సిద్ధాంతి బారాయిమాం, తెలుగు మహిళలు పాల్గొన్నారు.
వైసీపీ అరాచకానికి పరాకాష్ట
టీడీపీ కార్యాలయంపై దాడికి ఖండన
వెలిగండ్ల : టీడీపీ కార్యాల యడంపై దాడి చేసి, వాహ నాలను తగుల బెట్టడం వైసీపీ అరాచక పాలనకు పరాకాష్ట అని టీడీపీ మండలాధ్యక్షుడు ముత్తిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో మీడియాతో సమావేశం ని ర్వహించారు. ఈ సం దర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ పార్టీ కార్యాలయంపై వైసీపీ మూకల దాడిని ఖండించారు. ఎమ్యెల్యే వల్లభ నేని వంశీ ప్రోద్బలంతో వైసీపీ శ్రేణులు రెచ్చి పోయారన్నారు. అక్కడ శాంతిభద్రతల స మస్యను సృష్టించాలనే ప్రయత్నంలో భాగమే ఈ దాడిగా పేర్కొన్నారు. దాడి చేసిన వారిని కాకుండా బాధితులను పోలీసులు అరెస్టు చే యడం అన్యాయ మన్నారు. పోలీసులు ఎవరి కోసం పనిచేస్తున్నారో అర్ధమవుతోందన్నారు. అ రెస్టు చేసిన టీడీపీ నాయకులను వెంటనే వి డుదల చేయాలని డిమాండ్ చేశారు. సమా వేశంలో నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షు డు కేలం ఇంద్రభూపాల్‌రెడ్డి, నియోజకవర్గ బీ సీ సెల్ అధ్యక్షుడు కసునూరి మౌలాలి, పార్టీ ప్రధాన కార్యదర్శి కారంపూడి వెంకటేశ్వర్లు, లక్ష్మీనారాయణ, పుల్లారెడ్డి, బొబ్బా భూపాల్ రెడ్డి, శీను, కాశిరెడ్డి, రమేష్, మాల కొండారెడ్డి, మాల్యాద్రి పాల్గొన్నారు.
పీసీపల్లి : వచ్చే ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోతామన్న భయంతోనే వైసీపీ మూకలు అరాచకాలు సృష్టిస్తున్నారని మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు వేమూరి రామయ్య అ న్నారు. సోమవారం గన్నవరం టీడీపీ కార్యా లయంపై వైసీపీ మూకలు చేసిన దాడిని ఖం డిస్తూ మంగళవారం తెలుగుదేశం పార్టీ కార్యా లయంలో విలేకరుల సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనపై రోజురోజుకూ ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందన్నారు. దీంతో టీడీపీ శ్రేణులను భయాందోళనకు గురిచేసేందుకే ఎక్కడికక్కడ దాడులకు వైసీపీ మూకలు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఇంత జరుగుతు న్నా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడం అన్యాయమన్నారు. సమావేశంలో నియోజక వర్గ తెలుగు రైతు కార్యదర్శి బద్దిపూడి ఎబి నేజరు, బీసీసెల్ కార్యదర్శి కోమటిగుంట్ల వీర య్య, కసిరెడ్డి హనుమారెడ్డి, మూలె వెంకటేశ్వ రరెడ్డి, ముప్పవరపు మాచర్లు, కరణం చంద్ర య్య, సుబ్బరాయుడు, మాలకొండయ్య, టి.శ్రీ ను, వీరాస్వామిరెడ్డి, కోటేశ్వరరావు, కె.శ్రీను, యు.మాలకొండయ్య, కోటేశ్వరరావు, అంకయ్య తదితరులు ఉన్నారు.
సీఎస్‌పురం : రాష్ట్రంలో సైకో పాలన నడు స్తోందని తెలుగుదేశం పార్టీని ఎదుర్కొనే ద మ్ములేక పార్టీ కార్యాలయాలపై టీడీపీ కార్యక ర్తలపై అధికార పార్టీ నాయకులు, వారి మూ కలు దాడులు చేస్తున్నాయని టీడీపీ మండల అధ్యక్షుడు బొమ్మనబోయిన వెంగయ్య అన్నా రు. టీడీపీ కార్యాలయంపై వైసీపీ శ్రేణుల దా డిని ఖండించారు. మంగళవారం పార్టీ కార్యాల యంలో విలేకరుల సమావేశంలో వారు మా ట్లాడారు. చంద్రబాబుకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక వైసీపీ మూకలు దాడులకు తెగబడుతున్నాయన్నారు. సమావేశంలో మాజీ అధ్యక్షుడు షేక్ అబ్దుల్లా, సీనియర్ నా యకులు ఎన్‌సీ మాలకొండయ్య, పునుగుపాటి రవికుమార్, అట్లూరి రామకృష్ణంరాజు, కనిగిరి మహిళా అధ్యక్షురాలు జె.లక్ష్మీదేవి, మాజీ కో ఆఫ్సన్ సభ్యులు పఠాన్ నాయబ్‌రసూల్, నా యకులు కోనంగి వెంకటకొండయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు.