Share News

కంభం చెరువుగట్టుపై కాపుల వనభోజనాలు

ABN , First Publish Date - 2023-12-11T01:46:21+05:30 IST

ప్రసిద్ధ కంభం చెరువు గట్టుపై ఆదివారం కార్తీక వనభోజనాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీకృష్ణదేవరాయుల వంశస్తుడు అన్నయ్యగారి అమర్‌నాథ్‌ హాజరయ్యారు.

కంభం చెరువుగట్టుపై కాపుల వనభోజనాలు

కంభం, డిసెంబరు 10 : ప్రసిద్ధ కంభం చెరువు గట్టుపై ఆదివారం కార్తీక వనభోజనాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీకృష్ణదేవరాయుల వంశస్తుడు అన్నయ్యగారి అమర్‌నాథ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ తాత ముత్తాతలు నడయాడిన ఈ పవిత్ర నేలపైకి రావడం సంతృప్తిగా ఉందన్నారు. శ్రీమతి వరదరాజమ్మ నిర్మించిన ఈ కంభం చెరువును దర్శించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. మరో ముఖ్య అతిథిగా రాష్ట్ర జనసేన పార్టీ కార్యదర్శి ఆమంచి స్వాములు హాజరయ్యారు. తన రాజకీయ జీవితం గిద్దలూరు నియోజకవర్గంలోనే మొదలు అవుతుందని, ఇందులో ఎలాంటి అనుమానాలకు తావు లేదన్నారు. పవన్‌ కళ్యాణ్‌ తనను గిద్దలూరు నుంచి పోటీ చేసేందుకకు మాట కూడా ఇచ్చారని పేర్కొన్నారు. తాను చీరాలలో పోటీ చేసే ప్రసక్తే లేదన్నారు. ప్రతి ఒక్కరూ ఐక్యమత్యంగా శక్తివంచన లేకుండా ఇతర కులాలను కలుపుకుంటూ జనసేన, టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో వేలాది మంది కాపు సామాజిక వర్గీయులు పాల్గొన్నారు. గిద్దలూరు, కంభం మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్లు ఆర్‌డీ.రామకృష్ణ, ఏలం వెంకటేశ్వర్లు, ముద్దర్ల శ్రీను, ఆమంచి రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.

గిద్దలూరు : పట్టణంలోని వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానం ఆధ్వర్యం లో ఆదివారం మధ్యాహ్నం ఆర్యవైశ్య కార్తీక వనభోజనాల కార్యక్రమం జరిగింది. ఆర్యవైశ్య కుటుంబీకులు వనభోజనాల్లో పాల్గొన్నారు. ఉసిరి చెట్టు వద్ద మహిళలు కార్తీక దీపాలు వెలిగించి పూజలు నిర్వ హించారు. దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. కార్యక్రమంలో దేవస్థాన కమిటీ అధ్యక్షులు గర్రె సత్యనారాయణ, తుమ్మలపెంట సత్యనారాయణ, శివా పురం ఆంజనేయులు, వాడకట్టు రంగసత్యం, రాచపూటి నరసింహారావు, దమ్మాల జనార్థన్‌, ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు.

మార్కాపురం వన్‌టౌన్‌ : వనభోజనాలు ఐక్యతకు చిహ్నం అని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ కందుల నారాయణరెడ్డి అన్నారు. స్థానిక నరసింహ స్వామి కొండ వద్ద సగర, ఉప్పర వంశస్థుల సేవా సంఘం ఆధ్వర్యంలో కార్తిక వనభోజనాలు ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణరెడ్డి మాట్లాడుతూ సగరులు విద్య, ఉద్యోగ రంగాలలో రాణించాలన్నారు. మాజీ ఎమ్మెల్యే జెంకే వెంకటరెడ్డి మాట్లాడుతూ భారతీయ సంస్కృతి ఎంతో గొప్పదన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర సగర కార్పొరేషన్‌ చైర్‌ పర్సన్‌ బంగారు రమణమ్మ, సగర సంఘ నాయకులు జేవీ శ్రీనివాసులు, కొప్పుల శ్రీనివాసులు, బయన్న, ఎం.రమాదేవి, కొప్పుల వెంకటేశ్వర్లు, వీరాంజనేయులు, రామకృష్ణ, ఎం.వెంకటే శ్వర్లు తదితరులు పాల్గొన్నారు. గౌడ సంఘం ఆధ్వర్యంలో ఉత్సాహంగా కార్తిక వనభోజనాలు నిర్వహించారు. మహిళలు కార్తిక దీపాలు వెలిగించి పూజలు చేశారు. వివిధ పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంక్షేమ సంఘం నాయకులు రమణ గౌడ్‌, వెంకటేశ్వర్లు గౌడ్‌, లక్ష్మయ్య గౌడ్‌, నాగార్జునగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-12-11T01:46:23+05:30 IST