కాపు రిజర్వేషన్‌ను అమలు చేయాలి
ABN , First Publish Date - 2023-01-02T22:57:04+05:30 IST
కాపు రిజర్వేషన్లను అమలు చేయాలని పలువురు డిమాండ్ చేశారు. కాపు సంక్షేమ సేన జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాకు రాయని రమేష్ అధ్యక్షతన వ హించారు.
ఒంగోలు(కలెక్టరేట్), జనవరి 2 : కాపు రిజర్వేషన్లను అమలు చేయాలని పలువురు డిమాండ్ చేశారు. కాపు సంక్షేమ సేన జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాకు రాయని రమేష్ అధ్యక్షతన వ హించారు. పలువురు మాట్లాడుతూ కాపు రిజర్వేషన్ల కోసం రాష్ట్ర అధ్యక్షుడు చేగుండి హరిరామ జోగయ్యకు మద్దతుగా ధర్నా చేపట్టినట్లు తెలిపారు, రాష్ట్ర ప్రభుత్వం మొండివైఖరిని విడనాడి వెంటనే కాపులకు రిజర్వేషన్ క ల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చే స్తామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో మలగా రమేష్, చిట్టెం ప్ర సాద్, మహిళా అధ్యక్షురాలు శిరీష, శ్రీనివాస్, మేడడిశెట్టి సుబ్బారావు, మ హేష్, మ నోజ్, నరేంద్రసింగ్, ప్రమీల, కల్యాణి, ఉష పాల్గొన్నారు.