26 నుంచి వెలిగొండ కోసం కందుల పాదయాత్ర

ABN , First Publish Date - 2023-03-19T00:32:35+05:30 IST

పశ్చిమ ప్రకాశం వరప్రదాయని వెలుగొండ ప్రాజెక్టుపై వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యపు ధోరణికి వ్యతిరేకంగా మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఈ నెల 26 నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు.

26 నుంచి వెలిగొండ కోసం కందుల పాదయాత్ర

మార్కాపురం , మార్చి 18: పశ్చిమ ప్రకాశం వరప్రదాయని వెలుగొండ ప్రాజెక్టుపై వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యపు ధోరణికి వ్యతిరేకంగా మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఈ నెల 26 నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు. 26న కొనకమెట్ల మండలం వెలుగొండ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పాదయాత్ర ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో ప్రత్యేక జిల్లాల ఏర్పాటులో మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటుకు వైసీపీ నాయకులు చేసిన రాజకీయ కుట్రపై ఆయన ధ్వజమెత్తానున్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాడిన నాలుగేళ్లలో ప్రజలు ఎదుర్కోంటున్న సమస్యలను వివరించనున్నారు. ఈ పాదయాత్రను విజయవంతం చేసేందుకు టీడీపీ శ్రేణులు సన్నద్ధం అవుతున్నాయి.

Updated Date - 2023-03-19T00:32:35+05:30 IST