కవయిత్రుల సమ్మేళనానికి జ్యోతిష్మతికి ఆహ్వానం

ABN , First Publish Date - 2023-09-19T22:14:28+05:30 IST

ఉత్తర అమెరికా తెలుగు సంఘం, తానా ప్రపంచ సాహిత్య వేదిక సెప్టెంబరు 24న ఆన్‌ లైన్‌లో నిర్వహిస్తున్న నారీ సాహిత్య భేరి అంతర్జాతీయ శతాధిక కవయిత్రుల సమ్మేళనం జరగనుంది.

కవయిత్రుల సమ్మేళనానికి జ్యోతిష్మతికి ఆహ్వానం

అద్దంకి టౌన్‌, సెప్టెంబరు 19: ఉత్తర అమెరికా తెలుగు సంఘం, తానా ప్రపంచ సాహిత్య వేదిక సెప్టెంబరు 24న ఆన్‌ లైన్‌లో నిర్వహిస్తున్న నారీ సాహిత్య భేరి అంతర్జాతీయ శతాధిక కవయిత్రుల సమ్మేళనం జరగనుంది. ఈ కార్యక్రమానికి అద్దంకి నుంచి కవయిత్రి, రచయిత్రి పాలపర్తి జ్యోతిష్మతిని ప్రత్యేక అతి థిగా తానా సంస్థ ఆహ్వానించింది. ఈ సాహిత్య సమ్మేళనం 14 గంటల పాటు నిర్మిరామంగా జరుగుతుంది. భారత్‌తో పాటు 15 దేశాలుకు చెందిన ప్రముఖ తెలుగు రచయిత్రిలు, కవయిత్రిలు పాల్గొంటారు. కవయిత్రి జ్యోతిష్మతి ఎస్‌బీఐలో 16 సంవత్సరాలు పనిచేసి స్వచ్ఛందంగా ఉ ద్యోగ విరమణ చేశారు. అనేక వచన కవితలు, కఽథలు రచించారు. సాహిత్యోప న్యాసాలు చేస్తూ అద్దంకిలో సృజన నిర్వహించే కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొం టారు. జ్యోతిష్మతికి తానా ద్వారా అంతర్జాతీయ గుర్తింపు రావడంపట్ల సృజన సాహిత్య సంస్థ సభ్యులు గాడేపల్లి దివాకర్‌దత్తు, కె.అనిలకుమార సూరి, జాన పద కళాపీఠం బాధ్యులు డాక్టర్‌ యు. దేవపాలన, జ్యోతి చంద్రమౌళితో పాటు మహమ్మద్‌ రఫీ, మలాది శ్రీనివాసరావు తదితరులు అభినందించారు. తానా నిర్వహిస్తున్న కార్యక్రమంలో కవిత్వం వినిపించడానికి తనకు స్థానం కల్పించి నందుకు తానా అధ్యక్షడు నిరంజన్‌ శృంగవరపు, తానా ప్రపంచ ఐక్య వేదిక నిర్వాహకులు డాక్టర్‌ ప్రసాద్‌ తోటకూర, సమన్వయకర్త చిగురుమళ్ల శ్రీనివాస్‌కి జ్యోతిష్మతి ధన్యవాదాలు తెలియజేశారు.

Updated Date - 2023-09-19T22:14:28+05:30 IST