Share News

దర్శిలో దూకుడుగా జనసేన

ABN , Publish Date - Dec 26 , 2023 | 10:55 PM

దర్శి నియోజకవర్గంలో ఒక్కసారిగా జనసేన కార్యక్రమాల జోరు పెరిగింది. జనసేన నేత గరికపాటి వెంకట్‌ ప్రజా సంబంధ కార్యక్రమాలతో ముందుకు సాగడం అందుకు కారణమైంది. ఇటీవల జనసేనలో చేరి దర్శి బాధ్యతలు చేపట్టిన వెంకట్‌ ఆదివారం నుంచి దర్శి నియోజకవర్గంలో ఉంటున్నారు.

దర్శిలో దూకుడుగా జనసేన

జనసంబంధ కార్యక్రమాలతో ముందుకెళ్తున్న వెంకట్‌

టీడీపీ, జనసేన నేతలతో సమన్వయ సమావేశాలు

6 నుంచి భారీస్థాయిలో రాష్ట్రస్థాయి ఎడ్ల పందేలు

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

దర్శి నియోజకవర్గంలో ఒక్కసారిగా జనసేన కార్యక్రమాల జోరు పెరిగింది. జనసేన నేత గరికపాటి వెంకట్‌ ప్రజా సంబంధ కార్యక్రమాలతో ముందుకు సాగడం అందుకు కారణమైంది. ఇటీవల జనసేనలో చేరి దర్శి బాధ్యతలు చేపట్టిన వెంకట్‌ ఆదివారం నుంచి దర్శి నియోజకవర్గంలో ఉంటున్నారు. తొలుత శనివారం దర్శిలో సెమీక్రిస్మస్‌ వేడుకల నిర్వహణలో పాల్గొన్న ఆయన ఆదివారం సాయంత్రం శంకరాపురం నుంచి జనసేన అభిమానులు, కార్యకర్తల ఆధ్వర్యంలో ర్యాలీగా దర్శికి చేరారు. మార్గమధ్యంలో పోలవరం, వేంపాడు, ముండ్లమూరు, పసుపుగల్లు, ఉల్లగల్లు, పులిపాడు, రెడ్డినగర్‌ తదితర గ్రామాల మీదుగా దర్శికి చేరారు. మార్గమధ్యలో అన్ని గ్రామాలలో జనసేన కార్యకర్తలతోపాటు వైసీపీ ప్రభుత్వం పట్ల అసంతృప్తితో ఉన్న ప్రజానీకం ఎదురెళ్లి ఆయనకు స్వాగతం పలికారు. దర్శిలో ఆదివారం రాత్రి భారీస్థాయిలో సెమీక్రిస్మస్‌ వేడుకలు నిర్వహించడం, నియోజకవర్గంలోని క్రైస్తవులను ప్రధానంగా ఆకర్షించింది. గతంలో ఎన్నడూ లేని విఽధంగా భారీస్థాయిలో కేక్‌ను ఏర్పాటు చేయడంతోపాటు 80 అడుగుల ఎత్తున స్టార్‌ను ఏర్పాటు చేసి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అప్పట్నుంచి నియోజకవర్గంలో ఉన్నవెంకట్‌ సోమ, మంగళవారాల్లో కొన్నిచోట్ల దర్శి, రాజంపల్లి క్రిస్టియన్‌ పాలేల్లో దళిత వితంతవులకు దుస్తులు పంపిణీ చేశారు. తొలుత పాస్టర్లకు కూడా దుస్తులు అందజేశారు. నాణ్యమైన దుస్తుల పంపిణీ ద్వారా ప్రత్యేకతను చాటుకున్నారు. మంగళవారం కురిచేడు మండలం పొట్లపాడులో రంగా వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. దర్శిలోని తన కార్యాలయంలో కూడా రంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలోకి వచ్చిరోజున నుంచి స్థానికంగా ఉండటంతోపాటు శాశ్వత నివాసం కోసం సొంతిల్లును ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు. అంతేగాక నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి పలు హామీలు ఇవ్వడం చర్చినీయాంశంగా మారాయి. దీనికితోటు అ టు జనసేన, ఇటు టీడీపీ నేతలతో సమన్వయ కార్యక్రమాలు ఏర్పాటకు చర్యలు చేపట్టారు. సోమవారం తెలుగుదేశం నేతలు చేసిన ప్రకటనను మంగళవారం వెనక్కి తీసుకుని టీడీపీ, జనసేనలు ఎవరిని పార్టీ అభ్యర్థిగా నియమించినా గెలుపు కోసం ఉమ్మడిగా కృషి చేస్తామని ప్రకటించడం అందుకు నిదర్శనం. అలాగే మంగళవారం సాయంత్రం టీడీపీకీ చెందిన మాజీ ఎమ్మెల్యే నారాపుశెట్టి పాపారావును ఆయన ఇంటికెళ్లి వెంకట్‌ కలిసి మాట్లాడారు. అలా స్థానికంగా ఉన్న నేతలను కలిసి సమన్వయ చర్యలు ప్రారంభించారు. దీనికితోడు దర్శిలో స్థిర నివాసం కోసం సొంత గృహాన్ని ఏర్పాటు చేసుకునేందుకు నిర్మించిన గృహాన్ని కొనుగోలు చేస్తున్నారు. మొత్తం నియోజకవర్గ ప్రజలతో అందుబాటులో ఉండేలా 24గంటలు పనిచేసే కార్యాలయాన్ని సిబ్బందిని ఏర్పాటు చేశారు. గరికిపాటి ఫౌండేషన్‌ ద్వారా చేపట్టనున్న అనేక వినూత్న సంక్షేమ, అభివృదిఽ్ధకార్యక్రమాలను ప్రకటించడం ద్వారా నియోజకవర్గ ప్రజల దృష్టని ఆకర్షించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా వైసీపీ నేతలు ఎడ్లపోటీలు నిర్వహిస్తుండగా, వెంకట్‌ ఆరో తేదీ నుంచే భారీస్థాయిలో ఎడ్ల పోటీలకు ఏర్పాట్లు చేశారు. ప్రథమ బహుమతిగా రూ.7లక్షల విలువైన ట్రాక్టర్‌ను ప్రకటించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు. జనసేన సంబంఽధించిన కార్యకర్తలు, అభిమానులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీంతో దర్శి నియోజకవర్గంలో జనసేన కార్యక్రమాలతో దూకుడుగా పెరగ్గా, ఆ పార్టీ నేత పలు కార్యక్రమాలతో బిజీగా ఉంటున్నారు.

Updated Date - Dec 26 , 2023 | 10:55 PM