Share News

జనకంఠక పాలనకు స్వస్తి పలకాలి

ABN , Publish Date - Dec 31 , 2023 | 10:50 PM

నూతన సంవత్సరంలో నియో జకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ పేర్కొన్నారు. ఈమేరకు ఆదివారం ఒక ప్రకటనలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతనోత్సహం, నూతనోత్తేజం, నూతన ఆలోచనలతో జనకంఠక పాలనకు స్వస్తి పలికేం దుకు మహిళలు, యువత నడుం బిగించి కదం తొక్కాల ని పిలుపునిచ్చారు.

జనకంఠక పాలనకు  స్వస్తి పలకాలి
గొట్టిపాటి రవికుమార్‌, అద్దంకి ఎమ్మెల్యే

- ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌

- నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

అద్దంకి, డిసెంబరు 31: నూతన సంవత్సరంలో నియో జకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ పేర్కొన్నారు. ఈమేరకు ఆదివారం ఒక ప్రకటనలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతనోత్సహం, నూతనోత్తేజం, నూతన ఆలోచనలతో జనకంఠక పాలనకు స్వస్తి పలికేం దుకు మహిళలు, యువత నడుం బిగించి కదం తొక్కాల ని పిలుపునిచ్చారు. వైసీపీ పాలనలో అన్నిరకాలుగా వైఫ ల్యం చెందిన రాష్ట్రాన్ని మళ్ళీ చక్కగా పరిపాలించి, గాడి తప్పిన పాలనను గాడిలో పెట్టే చంద్రబాబు మరలా ము ఖ్యమంత్రిగా వస్తారని అన్నారు. 2024లో జరిగే ఎన్నికల్లో మంచి రోజులు వస్తాయని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజల కోసం అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా భావించి నిత్యం పరితపించే నిత్యశ్రామికుడు చంద్రబాబుకు తోడుగా నిల వాలని కోరారు.

Updated Date - Dec 31 , 2023 | 10:50 PM