జగన్‌ ఇచ్చిన హామీలు నెరవేర్చాలి

ABN , First Publish Date - 2023-06-07T22:41:04+05:30 IST

మున్సిపల్‌ కార్మికులకు జగన్‌ ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కె.నాగభూషణం అన్నారు. సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్మికులు వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ గత నెల 31న హిందూపురంలో ప్రారంభమైన జాతా బుధవారం మార్కాపురానికి చేరింది.

జగన్‌ ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
మాట్లాడుతున్న యూనియన్‌ నాయకుడు నాగభూషణం

మార్కాపురానికి వచ్చిన మున్సిపల్‌ కార్మికుల ప్రచార జాతా

మార్కాపురం, జూన్‌ 7: మున్సిపల్‌ కార్మికులకు జగన్‌ ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కె.నాగభూషణం అన్నారు. సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్మికులు వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ గత నెల 31న హిందూపురంలో ప్రారంభమైన జాతా బుధవారం మార్కాపురానికి చేరింది. యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు కె.సుబ్బరాయుడు ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్యాలయం వద్ద సభ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు నాగభూషణం మాట్లాడుతూ మున్సిపల్‌ కార్మికులందరినీ క్రమబద్ధీకరించాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను మున్సిపల్‌ కార్మికులందరికీ వర్తింపచేయాలన్నారు. వైసీపీవి మాటలే తప్ప ఆచరణలో కార్మికుల సమస్యలను పరిష్కరించడం లేదన్నారు. ఆప్కాస్‌ పరిధిలోకి మున్సిపల్‌ కార్మికులందరినీ తీసుకువచ్చి ప్రభుత్వం మోసం చేసిందన్నారు. జీతాలు సక్రమంగా చెల్లించకపోవడం, పీఎఫ్‌, ఈఎ్‌సఐ వంటి సమస్యల పరిష్కారం కాకపోవడంతో కార్మికులు తీ వ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి డీకేఎం రఫీ మా ట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణ జాబితాలో మున్సిపల్‌ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు లేకపోవడం అన్యాయమన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పి.రూబెన్‌, మున్సిపల్‌ యూనియన్‌ నాయకులు జి.హరి, జి.పి.తిరుమలయ్య, బ్రహ్మం, ఏ.రమణ, కార్మికులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-07T22:42:01+05:30 IST