Share News

జగన్‌ది సామాజిక దళిత వంచన యాత్ర

ABN , First Publish Date - 2023-11-22T00:11:50+05:30 IST

దళితుల ఓట్ల కోసం జగన్‌ ప్రభుత్వం చేస్తున్నది సామాజిక సాధికార బస్సు యాత్రకాదని, దళిత సామాజిక వి ద్రోహ యాత్రని దళిత హక్కుల పరిరక్షణ సమితి నీలం నాగేంద్రరావు ధ్వజమెత్తారు. సామాజిక సాధి కార బస్సు యాత్రను నిరసిస్తూ మంగళవారం ఒం గోలులోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన కార్య క్రమాన్ని నిర్వహించారు.

జగన్‌ది సామాజిక దళిత వంచన యాత్ర

దళిత నేత నీలం

ఒంగోలు(కలెక్టరేట్‌), నవంబరు 21 : దళితుల ఓట్ల కోసం జగన్‌ ప్రభుత్వం చేస్తున్నది సామాజిక సాధికార బస్సు యాత్రకాదని, దళిత సామాజిక వి ద్రోహ యాత్రని దళిత హక్కుల పరిరక్షణ సమితి నీలం నాగేంద్రరావు ధ్వజమెత్తారు. సామాజిక సాధి కార బస్సు యాత్రను నిరసిస్తూ మంగళవారం ఒం గోలులోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన కార్య క్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం దళిత వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందని ఆరోపిం చారు అగ్రకులాలను, పొదుపు గ్రూపు మహిళలను, పెన్షన్‌దారులను సమీకరించి సామాజిక సాధికార పేరుతో బస్సుయాత్రలు చేయడం ప్రభుత్వ న యవంచనకు నిదర్శనమన్నారు. నమ్మి ఓట్లేసిన అ న్ని వర్గాల వారిని జగన్‌ నట్టేట ముంచారని విమ ర్శించారు. పాత సబ్సిడీ పథకాలను రద్దు చేసి రూ పాయి రుణం కూడా రాష్ట్రంలో ఎవరికి ఇవ్వని దు స్థితి ఏర్పడిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం 50 శాతం వాటతో ఇచ్చే అట్రాసిటీ కేసుల రిలీఫ్‌ ఫం డ్స్‌ను రాష్ట్ర వ్యాప్తంగా నిలుపుదల చేయడం దుర్మా ర్గంగా ఉందన్నారు. దళితులకు గత ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీలకు పెట్టిన ఇంగ్లీషు మీడియం బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ను రద్దు చేయడం దుర్మార్గంగా ఉందన్నారు. సబ్‌ ప్లాన్‌ నిధులను దారి మళ్ళించి నాలుగున్నరరేళ్లలో పప్పుబెల్లాల్లాగా పంచారని, ఎ స్సీ, ఎస్టీలకు భూమి కొనుగోలు పథకాన్ని నిలి పివేసిన వ్యక్తి జగన్మోహన్‌రెడ్డి అని ఆరోపించారు. కార్యక్రమంలో దళిత నాయకులు దారా అంజయ్య, కాకుమాను రవి, దేవరపల్లి రమణయ్య, ఎర్రమోతు నారాయణ, తానికొండ ఆనంద్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-11-22T00:12:03+05:30 IST