యువగళం విజయవంతంతో జగన్ వెన్నులో వణుకు
ABN , Publish Date - Dec 23 , 2023 | 11:47 PM
యువగళం విజయవంతం కావటంతో సీఎం జగన్ వెన్నులో వణుకు పుడుతోందని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. స్థానిక టీడీపీ మహిళాశక్తి కార్యాలయంలో శనివారం నాయకులతో కలిసి యువగళం సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈకార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ ఉగ్ర మాట్లాడుతూ రాష్ట్రంలో రావణాసుర పాలన అంతం కావాలని ప్రతి ఆంధ్రుడు కోరుకుంటున్నాడన్నారు. అందుకే కనివినీ ఎరుగని రీతిలో యువగళం సభ పెద్దఎత్తున విజయవంతమైందన్నారు. సైకో పాలనపై ప్రజలు ఎంతో విసుగు చెందారన్నారు. యువగళం పాదయాత్ర ముగింపు సభకు జనసేనాని పవన్‌కల్యాణ్ పాల్గొనటం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుందన్నారు.
కనిగిరి, డిసెంబరు 23: యువగళం విజయవంతం కావటంతో సీఎం జగన్ వెన్నులో వణుకు పుడుతోందని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. స్థానిక టీడీపీ మహిళాశక్తి కార్యాలయంలో శనివారం నాయకులతో కలిసి యువగళం సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈకార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ ఉగ్ర మాట్లాడుతూ రాష్ట్రంలో రావణాసుర పాలన అంతం కావాలని ప్రతి ఆంధ్రుడు కోరుకుంటున్నాడన్నారు. అందుకే కనివినీ ఎరుగని రీతిలో యువగళం సభ పెద్దఎత్తున విజయవంతమైందన్నారు. సైకో పాలనపై ప్రజలు ఎంతో విసుగు చెందారన్నారు. యువగళం పాదయాత్ర ముగింపు సభకు జనసేనాని పవన్‌కల్యాణ్ పాల్గొనటం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుందన్నారు. యువగళం ముగింపు సభ నాలుగు మార్గాలు 20 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించడం దేశంలోనే చర్చగా మారిందన్నారు. యువగళం సభ విజయవంతంతో జగన్ తాడేపల్లి ప్యాలె్‌సలో టీవీలు బద్దలయ్యాయన్నారు. వేదికపై 500 మందికి పైగా ఆశీనులవటం ఎంతో ప్రత్యేకతగా నిలించిందన్నారు. యువగళం ముగింపు సభకు వైసీపీ ప్రభుత్వం కనీసం బస్సులు కూడా ఇవ్వలేదన్నారు. ఒడిసా గవర్నమెంట్ 100 బస్సులను ఇచ్చిందన్నారు. కానీ జగన్ సభలకు మాత్రం బస్సులు, ప్రయివేటు వాహనాలు, ఇతర సంస్థల వాహనాల ద్వారా జనాల్ని సభలకు తరలించిన సందర్భాలు ఉన్నాయన్నారు. యువగళం సభ తర్వాత వైనాట్ 175 అని మాట్లాడిన జగన్‌కు వచ్చే ఎన్నికల్లో 60 కూడా వచ్చే పరిస్థితి లేదని స్వయంగా మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పే దుస్థితికి వచ్చిందన్నారు. అందుకోసం జగన్ గెలిచేందుకు అడ్డదారులు తొక్కుతున్నాడని ఆరోపించారు. ఎక్కడయితే టీడీపీకి బలంగా ఓటు బ్యాంకు ఉంటుందో ఆ ప్రాంతంలో ఓట్లు గల్లంతు కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు డాక్టర్ ఉగ్ర చెప్పారు. కనిగిరి నియోజకవర్గంలో పీసీపల్లి మండలం గుదేవారిపల్లి గ్రామంలో వైసీపీకి చెందిన వ్యక్తులే టీడీపీ సానుభూతి పరుల ఓట్లను తీయించే కుట్రకు దిగారని ఆరోపించారు. ఎన్ని కుట్రలు, కుయుక్తులు పన్నినా వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తు విజయాన్ని అడ్డుకోలేరన్నది గుర్తుంచుకోవాలన్నారు. ఈ సమావేశంలో టీడీపీ సీనియర్ నాయకులు వీవీఆర్ మనోహరరావు(చిరంజీవి), రాచమల్ల శ్రీనివాసులురెడ్డి, పిచ్చాల శ్రీనివాసులురెడ్డి, తమ్మినేని శ్రీనివాసులురెడ్డి, ఫిరోజ్, అహ్మద్, గుడిపాటి ఖాదర్, నారపరెడ్డి(యడవల్లి) శ్రీనివాసులురెడ్డి, బుల్లా బాలబాబు, కేవీఎస్ గౌడ్, తిరుపాలు తెలుగు మహిళలు కరణం అరుణ, పార్వతి తదితరులు పాల్గొన్నారు.